Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే బుమ్రా వరల్డ్ క్లాస్ బౌలర్ అయ్యాడు: టీమిండియా మాజీ కోచ్

టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాపై మాజీ బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే ప్రశంసల జల్లు కురిపించాడు. బుమ్రా వైవిధ్యమైన బౌలరని, పుట్టకతోనే అతనికి ప్రత్యేకమైన నైపుణ్యాలు వచ్చాయని చెప్పాడు. అసాధారణ ప్రతిభతో పాటు అతని ఆలోచనా విధానం, ఆటపై ఉన్న పట్టు వరల్డ్ క్లాస్ బౌలర్‌గా నిలబెట్టాయని తెలిపాడు. ఇతర బౌలర్లతో పోల్చితే బుమ్రాలో చాలా ప్రత్యేకమైన నైపుణ్యాలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు.

టీ20 ప్రపంచకప్ 2024 విజయానంతరం టీమిండియా బౌలింగ్ కోచ్‌ బాధ్యతల నుంచి పారస్ మాంబ్రే తప్పుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బుమ్రా బౌలింగ్ టెక్నిక్ గురించి పారస్ మాంబ్రే ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

Paras Mhambrey reveals what makes Jasprit Bumrah so special

'నైపుణ్యం పరంగా బుమ్రా ప్రత్యేకమైన బౌలర్. మంచి బంతి వేసేందుకు ఏ బౌలర్ అయిన కొంచెం రనప్ చేయాలి. అప్పుడే వారు కావాల్సిన స్వింగ్, వేగం‌తో పాటు బంతిపై పట్టు సాధిస్తారు. కానీ బుమ్రా మాత్రం 4 అడుగుల రనప్‌తో బౌలింగ్ చేసినా అంతే వేగంగా బంతిని సంధించగలడు. కాస్త దూరం పరుగెత్తి బౌలింగ్ చేసినా ఎలాంటి మార్పు ఉండదు. అంతే ఖచ్చితత్వంతో బౌలింగ్ చేస్తాడు.

ప్రపంచంలోని ఇతర బౌలర్లందరి కంటే బుమ్రా బాల్ రిలీజ్ భిన్నంగా ఉంటుంది. ఇతర బౌలర్ల కంటే 20 సెంటీమీటర్ల ముందుగానే బుమ్రా బంతిని రిలీజ్ చేస్తాడు. ఇతరులు ఎవరైనా ఇలా ముందుగానే బంతిని రిలీజ్ చేస్తే బూమారాంగ్ అవుతుంది. ఈ 20 సెంటీ మీటర్ల గ్యాప్ బుమ్రాకు ప్రయోజనం.
బుమ్రా బౌలింగ్ శైలి కూడా భిన్నమే. అందుకే అతన్ని ఫ్రీక్ బౌలర్ అని పిలుస్తాను. ఈ నైపుణ్యం బుమ్రాకు పుట్టుకతోనే వచ్చింది. రంజీ క్రికెట్, ఇతర దేశవాళీ క్రికెట్ ఆడటం ద్వారా అతనికి మంచి అనుభవం వచ్చింది. ఈ అనుభవంతోనే అతను నిలకడగా బౌలింగ్ చేయడంతో పాటు పరిస్థితులకు తగ్గట్లు బౌలింగ్ చేస్తున్నాడు.

అతను ప్రతీ బంతి ఆలోచించి బౌలింగ్ చేస్తాడు. బ్యాట్స్‌మెన్ ఆడుతున్న షాట్లకు తగ్గట్లు బౌలింగ్ వ్యూహాలు రచిస్తాడు. పిచ్ కండిషన్స్‌ను పసిగడుతాడు. క్రికెటర్ మొక్క అత్యుత్తమ ఆయుధం ఆలోచన విధానం అనేది నా అభిప్రాయం. బుమ్రా కూడా గేమ్‌పై పట్టు సాధించి, బ్యాటర్ల ఆటతీరును విశ్లేషించి బౌలింగ్ చేస్తాడు. అందుకే అతను సక్సెస్ అవ్వడంతో పాటు వరల్డ్ క్లాస్ బౌలర్‌గా నిలబడ్డాడు.'అని పారస్ మాంబ్రే చెప్పుకొచ్చాడు.

Story first published: Sunday, August 11, 2024, 20:20 [IST]
Other articles published on Aug 11, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+