Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అఫ్గాన్ చేతిలో ఓటమి.. పాకిస్థాన్ చెత్త రికార్డ్

ఆసియా కప్ 2025 ప్రారంభానికి ముందు పాకిస్థాన్ జట్టు ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. దాయాదీ అఫ్గానిస్థాన్ చేతిలో 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. యూఏఈ వేదికగా జరుగుతున్న ట్రై సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో చెత్త ఫీల్డింగ్‌తో మూల్యం చెల్లించుకుంది. తద్వారా చెత్త రికార్డ్‌ను తమ పేరిట లిఖించుకుంది.

అంతర్జాతీయ క్రికెట్‌లో ఏడాది కాలంలో అత్యధిక క్యాచ్‌లు నేలపాలు చేసిన జట్టుగా అప్రతిష్టను మూటగట్టుకుంది. 2024 నుంచి పాకిస్థాన్ జట్టు మొత్తం 48 క్యాచ్‌లను చేజార్చడంతో పాటు రనౌట్స్‌ను మిస్ చేసుకుంది. మైదానంలో 89 సార్లు మిస్ ఫీల్డ్ చేసింది. క్యాచ్‌లు, రనౌట్స్ పరంగా చూస్తే.. 41 జట్లతో పోల్చితే పాకిస్థాన్ అత్యంత జట్టుగా అగ్రస్థానంలో ఉంది. ఇక మిస్‌ఫీల్డ్‌ల పరంగా వెస్టిండీస్(90) రెండో స్థానంలో కొనసాగుతోంది. 12 పూర్తి స్థాయి జట్లలో పాకిస్థా‌న్ క్యాచింగ్ సామర్థ్యంలో 81.4 శాతంతో 8వ స్థానంలో నిలిచింది. ఈ గణంకాలే ఫీల్డింగ్‌లో పాకిస్థాన్ ఎంత దారుణంగా ఉందోననే విషయాన్ని స్పష్టం చేస్తోంది.

Pakistan s Dismal Fielding Record Exposed by Shocking Stats After Loss to Afghanistan

ఈ చ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 169 పరుగులు చేసింది. సెదికుల్లా అటల్(45 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 64), ఇబ్రహీం జడ్రాన్(45 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 65) హాఫ్ సెంచరీలతో రాణించారు. పాక్ బౌలర్లలో ఫహీమ్ అష్రఫ్(4/27) నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. సయీమ్ అయుబ్ ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 151 పరుగులే చేసింది. హ్యారీస్ రౌఫ్(16 బంతుల్లో 4 సిక్స్‌లతో 34 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు. అఫ్గాన్ బౌలర్లలో ఫజలక్ ఫరూఖీ(2/21), రషీద్ ఖాన్(2/30), మహమ్మద్ నబీ(2/20), నూర్ అహ్మద్(2/20) రెండేసి వికెట్లు తీసారు.

సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగానే ఆసియా కప్ 2025 ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 14న భారత్‌తో జరిగే హైఓల్టేజ్ మ్యాచ్‌తో పాకిస్థాన్ తమ క్యాంపైన్‌ను ప్రారంభించనుంది. బాబర్ ఆజామ్, మహమ్మద్ రిజ్వాన్ లేకుండా పాకిస్థాన్ ఈ టోర్నీ ఆడనుంది.

Story first published: Thursday, September 4, 2025, 10:37 [IST]
Other articles published on Sep 4, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+