Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాకిస్థాన్ మహిళల జట్టులో గొడవ.. సీనియర్ ప్లేయర్ హోటల్ గదిలో భర్త!

ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో పాకిస్థాన్ టీమ్ పేలవ ప్రదర్శన కనబర్చింది. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ఒకవైపు వరుస పరాజయాలతో పాకిస్థాన్ మహిళల టీమ్ సతమతమవుతుంటే.. మరోవైపు జట్టులో అంతర్గత విభేదాలు, గొడవలు తారస్థాయికి చేరినట్లు వార్తలు వస్తున్నాయి.

కెప్టెన్ ఫాతిమా సనా, టీమ్ మెంటార్ వహాబ్ రియాజ్ మధ్య తీవ్ర విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి ఆధిపత్య పోరుతో ఆటగాళ్లు నలిగిపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధికారికంగా స్పందించకపోయినా, సోషల్ మీడియా, మెయిన్‌స్ట్రీమ్ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.

సీనియర్ ప్లేయర్ భర్తతో..

బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందు కోచ్, కెప్టెన్ మధ్య విభేదాలు తారా స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. సీనియర్ ప్లేయర్ ఆలియా రియాజ్ భర్త, ఆమెతో పాటే టీమ్ హోటల్‌ గదిలో ఉండటాన్ని కెప్టెన్ ఫాతిమా సనా తీవ్రంగా వ్యతిరేకించింది. కెప్టెన్ ఫాతిమా సూచనలతో ఆలియా రియాజ్ భర్త అలీ యూనిస్‌ను టీమ్ మేనేజ్‌మెంట్ గది ఖాళీ చేయించింది.

Pakistan Women s Captain Fatima Sana in Heated Clash With Coach and Senior Player Over Hotel Room Dispute

అయితే బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్‌కు రాకుండా అలియా రియాజ్ తన భర్తతో కలిసి షికారుకు వెళ్లింది. దాంతో క్రమశిక్షణ ఉల్లంఘన కింద ఆలియాను బంగ్లాదేశ్‌తో మ్యాచ్ నుంచి తప్పించాలని ఫాతిమా పట్టుబట్టింది. అయితే, మెంటార్ వహాబ్ రియాజ్ మాత్రం ఆమెను తుది జట్టులో నుంచి తీసేయడం కుదరదని స్పష్టం చేశాడు. అయితే ఆ మ్యాచ్‌లో ఆలియా దారుణంగా విఫలమవడంతో పాటు పాకిస్థాన్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

కోచ్‌ను కడిగిపారేసిన ఫాతిమా..

మ్యాచ్ అనంతరం అందరి ముందే ఫాతిమా సనా.. వహాబ్‌ను నిలదీసినట్లు తెలుస్తోంది. క్రమశిక్షణ నిబంధనలను పాటించకపోవడం వల్లే ఓటమి ఎదురైందని, దీనికి మీరే బాధ్యత వహించాలని అసహనం వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ ఒక్క ఘటనే కాకుండా జట్టులో సీనియర్ ఆటగాళ్ల మధ్య గ్రూపులు ఏర్పడ్డాయని, కోచ్‌లు, ఆటగాళ్ల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని కూడా ప్రచారం జరుగుతోంది. తాము ఇచ్చిన ప్రణాళికలను ఆటగాళ్లు మైదానంలో అమలు చేయడం లేదని కోచ్‌లు ఆరోపిస్తున్నట్లు సమాచారం.

పాకిస్థాన్ క్రికెట్‌లో ఇలాంటి ఘటనలు కొత్తేమీ కాదు. పురుషుల జట్టులో కూడా ఇలాంటి విభేదాలే ఉన్నట్లు ప్రచారం జరిగింది. గత 3-4 ఏళ్లుగా మహిళల జట్టుకు మార్క్ కోల్స్, జునైద్ ఖాన్, బాసిత్ అలీ, సలీమ్ జాఫర్ వంటి కోచ్‌లను పీసబీ మార్చింది. దాంతో పాకిస్థాన్ జట్టు బలహీనంగా మారిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Story first published: Thursday, June 25, 2026, 12:52 [IST]
Other articles published on Jun 25, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+