Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాకిస్థాన్ అరంగేట్ర స్పిన్నర్ అరుదైన ఘనత.. 71 ఏళ్ల రికార్డు బ్రేక్!

Pakistan vs South Africa: Nauman Ali Breaks 71-Year-Old Record With a Five-For on Debut

కరాచీ: పాకిస్థాన్‌ అరంగేట్ర క్రికెటర్‌ నౌమన్‌ అలీ సరికొత్త రికార్డు సృష్టించాడు. పాక్‌ క్రికెట్‌ చరిత్రలోనే అరంగేట్ర మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన తొలి లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌గా నిలిచాడు. అంతేకాకుండా ఫస్ట్ మ్యాచ్‌లోనే ఈ ఘనత సాధించిన పాకిస్థాన్‌ నాలుగో స్పిన్నర్‌గా, 12వ బౌలర్‌గా గుర్తింపు పొందాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ నాలుగో రోజు ఆటలో నౌమన్‌ అలీ ఈ ఘనతను అందుకున్నాడు. పదునైన బంతులతో ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించి జట్టు విజయానికి బాటలు వేశాడు. నౌమన్ అలీ(5/35) ధాటికీ సఫారీ రెండో ఇన్నింగ్స్‌లో విలవిలాడింది.

లేటు వయసులో ..

లేటు వయసులో ..

ఇక లేటు వయసులో టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసి అందర్నీ ఆశ్చర్యపరిచిన నౌమన్ అలీ.. వయసు ఒక అంకె మాత్రమేనని నిరూపించాడు. 34ఏళ్ల వయసులో సుదీర్ఘ ఫార్మాట్‌ను ప్రారంభించి ఫస్ట్ మ్యాచ్‌లోనే ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. తద్వారా 71 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి ఓల్డెస్ట్ అరంగేట్ర క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. 34 ఏళ్ల 114 రోజుల లేటు వయసులో నౌమన్ ఈ ఫీట్ సాధించాడు. అంతేకాకుండా ఓల్డెస్ట్ అరంగేట్ర స్పిన్నర్‌గా కూడా గుర్తింపు పొందాడు. ఇక టెస్ట్ క్రికెట్ చరిత్రలో పాకిస్థాన్‌కు చెందిన మిరన్ బక్ష్(47 ఏళ్ల 284 రోజులు), జుల్ఫికర్ బాబర్(34 ఏళ్ల 308 రోజులు), మహ్మద్ అస్లామ్(34 ఏళ్ల 177 రోజులు) ఓల్డెస్ట్ క్రికెటర్ల జాబితాలో టాప్-3లో ఉన్నారు.

చాలా శ్రమించాను.. ఆనందంగా ఉంది

చాలా శ్రమించాను.. ఆనందంగా ఉంది

నౌమన్​ అలీ.. పాకిస్థాన్​ దక్షిణ సింధు​ రాష్ట్రం సంఘర్​ డివిజన్​కు చెందిన ఖిప్రో అనే చిన్న గ్రామం నుంచి వచ్చాడు. అక్కడే పుట్టి, విద్యాభాసం చేశాడు. ఆ తర్వాత ప్రొఫెషనల్​ క్రికెటర్ అవ్వాలని​ పాకిస్థాన్‌లోని హైదరాబాద్​‌కు వచ్చాడు. డొమెస్టిక్ క్రికెట్‌లో హైదరాబాద్ తరఫునే బరిలోకి దిగాడు. టెస్టు అరంగేట్రంపై నౌమన్​ మాట్లాడుతూ.. "టెస్టు ఎంట్రీ ఇవ్వాలనేది నా కల. దీని కోసం చాలా శ్రమించాను. చోటు సంపాదించినందుకు చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్​లో మరిన్ని మ్యాచులు ఆడి బాగా రాణిస్తానని ఆశిస్తున్నాను." అని అన్నాడు.

పాక్ ఘన విజయం..

పాక్ ఘన విజయం..

నౌమన్ అలీ(5/35), యాసిర్ షా(4/75) ధాటికి సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు కుప్పకూలింది. హసన్ అలీకి ఓ వికెట్ దక్కింది. ఓపెనర్‌ మార్‌క్రమ్‌ (74), వాన్‌ డెర్‌ డస్సెన్‌ (64) అర్ధ సెంచరీలతో రాణించారు. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకొని పాక్ ముందు 90 పరుగుల లక్ష్యం నమోదవ్వగా.. ఆ జట్టు ఆడుతు పాడుతూ చేధించింది. 22.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసి 7 వికెట్లతో ఘన విజయాన్నందుకుంది. అన్రిచ్ నోర్జ్ రెండు, కేశవ్ మహారాజ్ ఓ వికెట్ తీయగా.. బాబర్ ఆజమ్(30) రాణించాడు.

Story first published: Friday, January 29, 2021, 15:40 [IST]
Other articles published on Jan 29, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+