
మాలిక్, సర్ఫరాజ్‌కు నో చాన్స్..
యువ ఆటగాళ్లకే ప్రాధాన్యం ఇచ్చిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. సీనియర్ ఆటగాళ్లు అయిన షోయబ్ మాలిక్, సర్ఫరాజ్ అహ్మద్, వాహబ్ రియాజ్‌లకు మొండిచెయ్యే చూపించింది. జట్టులో చోటు దక్కకున్నా కనీసం రిజర్వ్ ప్లేయర్లుగానైనా యూఏఈ వెళ్తారని ప్రచారం జరిగినా పీసీబీ ఈ సినీయర్ ఆటగాళ్లకు ఆ అవకాశం ఇవ్వలేదు. బాబర్ ఆజామ్ నేతృత్వంలో యువ ఆటగాళ్లకే అవకాశం కల్పించింది. షాదాబ్ ఖాన్, అసిఫ్ అలీ, ఆజామ్ ఖాన్, హారీస్ రౌఫ్ హసన్ అలీ, ఇమాద్ వసీం, కుష్‌దిల్, హఫీజ్, హస్నైన్, నవాజ్, రిజ్వాన్, వాసిమ్, షాహిన్, మక్సూద్‌లను ఎంపిక చేసీన పీసీబీ.. దహని, ఉస్మాన్ ఖాదీర్, ఫకార్ జమాన్‌లను రిజర్వ ప్లేయర్లుగా తీసుకుంది.

టీమిండియాను ఓడిస్తాం..
గ్రూప్ 2లోలో ఉన్న భారత్, పాకిస్థాన్.. అక్టోబర్ 24న దుబాయ్ వేదికగా జరిగే మ్యాచ్‌తో టీ20 ప్రపంచకప్ వేటను ప్రారంభించనున్నాయి. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత దాయాది జట్లు మళ్లీ తలపడుతుండటం ఇదే తొలిసారి. అయితే ఈ మ్యాచ్‌లో భారత్‌ను ఓడించి మెగా టోర్నీలో శుభారంభం చేస్తామని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. 'పాకిస్థాన్‌తో పోల్చితే భారత జట్టు మరింత ఒత్తిడిలో ఉంటుంది. టీమిండియాను ఓడించి మెగా టోర్నీలో శుభారంభం చేస్తాం. కోహ్లీసేనపై మాదే పైచేయి. వారిని కచ్చితంగా ఓడిస్తాం. టీమిండియా ఆటగాళ్లు జట్టుగా టీ20 మ్యాచులు ఆడి చాలా రోజులవుతుంది.
ప్రస్తుతం భారత జట్టు టెస్టులు ఆడుతోంది. ఆ తర్వాత భారత ఆటగాళ్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడుతారు. అక్కడ జట్టుగా కాకుండా ఒక్కో జట్టుకు ఆడుతారు. ఇక యూఏఈ మాకు సొంతిల్లు లాంటిది. అక్కడ అన్ని మాకు సానుకూలాంశాలే ఉంటాయి. అందుకే టీమిండియాతో జరిగే మ్యాచ్‌లో గెలవడానికి 100 శాతం మేం ప్రయత్నిస్తాం. టోర్నీని విజయంతోనే ఆరంభిస్తాం' అని బాబర్ ఆజామ్ ధీమా వ్యక్తం చేశాడు.

అంత సీన్ లేదు..
ఇక తాజాగా పాకిస్థాన్ జట్టును ప్రకటించడంతో బాబర్ ఆజామ్ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ భారత అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. భారత్ ఓడించే సీన్ పాకిస్థాన్‌కు లేదని, అసలు మెగాటోర్నీలో భారత్‌పై పాక్ గెలిచిన దాఖలాలు లేవని గుర్తు చేస్తున్నారు. బాబర్ వ్యాఖ్యలు వింటుంటే నవ్వొస్తుందని, టీమిండియా బీ టీమ్‌ను కూడా పాకిస్థాన్ ఓడించలేదంటున్నారు. బాబర్ ఆజామ్ మినహా మిగతా ఆటగాళ్లకు సరైన గుర్తింపు కూడా లేదని, వాళ్లకు భారత్‌తో ఆడిన అనుభవం కూడా లేదని కామెంట్ చేస్తున్నారు. 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్ మరిచిపోయారా? అంటూ చురకలంటిస్తున్నారు.

ఒక్క మ్యాచ్ ఓడలేదు..
టీ20 ప్రపంచకప్‌ల్లో భారత్-పాక్ ఇప్పటి వరకు 5 సార్లు తలపడగా భారత్ ఒక్కసారి కూడా ఓడలేదు. నాలుగు మ్యాచ్‌ల్లో నేరుగా విజయాలందుకోగా.. 2007 టీ20 ప్రపంచకప్ లీగ్ మ్యాచ్‌లో బౌలౌట్ విధానంలో గెలుపొందింది. అదే టోర్నీ ఫైనల్లోనూ పాకిస్థాన్‌ను చిత్తు చేసి తొలి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది.
పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్ టీమ్..
బాబర్ ఆజామ్(కెప్టెన్), షాదాబ్ ఖాన్, అసిఫ్ అలీ, ఆజామ్ ఖాన్, హారీస్ రౌఫ్ హసన్ అలీ, ఇమాద్ వసీం, కుష్‌దిల్, హఫీజ్, హస్నైన్, నవాజ్, రిజ్వాన్, వాసిమ్, షాహిన్, మక్సూద్
రిజర్వ్ ఆటగాళ్లు: దహని, ఉస్మాన్ ఖాదీర్, ఫకార్ జమాన్


Click it and Unblock the Notifications
