
కరాచీ: వచ్చే నెల ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగే పాకిస్థాన్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన వివరాలను పాకిస్థాన్ సెలెక్టర్లు గురువారం వెల్లడించారు. మెగా టోర్నీకి జట్లు ప్రకటించడానికి ఈ రోజే చివరి గడవు కాగా.. పీసీబీ ఎలాంటి సంచలనాలకు తావివ్వకుండా దాదాపు ఆసియాకప్ 2022 టోర్నీలో బరిలోకి దిగిన జట్టునే ఎంపిక చేసింది. కేవలం రెండు మార్పులు మాత్రమే చేసింది. ఆసియాకప్ 2022లో దారుణంగా విఫలమైన ఫకార్ జమాన్‌పై వేటు వేసి స్టాండ్ బై ప్లేయర్ల జాబితాలో చేర్చింది. ఇక గాయంతో ఆసియాకప్ 2022 టోర్నీకి దూరమైన షాహిన్ షా అఫ్రిదిని జట్టులోకి తీసుకుంది.
అతని చేరికతో షానవాజ్ దహానీని రిజర్వ్ ప్లేయర్ల జాబితాలో చేర్చించింది. కొత్తగా షాన్ మసూద్‌ను ఎంపిక చేసింది. మిడిలార్డర్ వైఫల్యంతోనే ఆసియాకప్ టైటిల్‌ను పాకిస్థాన్ చేజార్చుకోవడంతో భారీ మార్పులు ఉంటాయని అంతా భావించారు. సీనియర్ క్రికెటర్లు షోయబ్ మాలిక్‌కు జట్టులో చోటు కల్పిస్తారని అంతా ఊహించారు. కానీ పీసీబీ మాత్రం ఆసియాకప్ టీమ్‌నే కొనసాగించింది. కెప్టెన్ బాబర్ ఆజామ్, మహమ్మరిజ్వాన్‌లతో పాటు అసిఫ్ అలీ, హైదర్ అలీ, ఇఫ్తికర్ అహ్మద్, కుష్దిల్ షాలను కొనసాగించింది. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్ తమ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి భారత్‌తో అక్టోబర్ 23న తలపడనుంది.
ఆసియాకప్ 2022లో దాయాదీ దేశాలు రెండు సార్లు తలపడగా చెరొక విజయాన్నందుకున్నాయి. ఇక శ్రీలంక చేతిలో ఫైనల్లో ఓడిన పాకిస్థాన్.. అంతుకుముందు సూపర్ 4 మ్యాచ్‌లోనూ ఓటమిపాలైంది.
పాకిస్థాన్ టీ20 ప్రపంచకప్ జట్టు:
బాబర్ ఆజామ్(కెప్టెన్), షాదాబ్ ఖాన్(వైస్ కెప్టెన్), అసిఫ్ అలీ, హైదర్ అలీ, హారిస్ రౌఫ్, ఇఫ్తికర్ అహ్మద్, కుష్దిల్ షా, మహమ్మద్ హస్నైన్, మహమ్మద్ నవాజ్, మహమ్మద్ రిజ్వాన్, మహమ్మద్ వసీం, నసీమ్ షా, షాహిన్ షా అఫ్రిది, షాన్ మసూద్, ఉస్మాన్ ఖదీర్
రిజర్వ్ ప్లేయర్స్: ఫకార్ జమాన్, మహమ్మద్ హరీస్, షానవాజ్ దహాని