Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాకిస్తాన్ జట్టుతో ఆటాడుకుంటున్న కరోనా: స్టార్ ఆల్‌రౌండర్‌కు పాజిటివ్‌.. మళ్లీ నెగటివ్!!

Pakistan spinner Kashif Bhatti joins squad after testing Coronavirus negative

వోర్సెస్టర్: పాకిస్తాన్ క్రికెట్ జట్టుతో కరోనా వైరస్ ఓ ఆటాడుకుంటోంది. ముందుగా సీనియర్ ఆల్‌రౌండర్‌ మహమ్మద్‌ హఫీజ్‌తో ఆడుకున్న వైరస్.. తాజాగా మరో ఆల్‌రౌండర్ కాశీఫ్ భట్టీతో ఆటాడుకుంటోంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిర్వహించిన టెస్టులో భట్టీకి పాజిటివ్‌ అని తేలగా.. తర్వాత ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) పరీక్షించగా నెగెటివ్‌ వచ్చింది. ఇప్పుడేమో మళ్లీ పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. మొత్తానికి పాకిస్థాన్ క్రికెట్ జట్టుని కరోనా వైరస్ వీడటం లేదు.

ఇంగ్లండ్ టూర్‌ కోసం గత నెలలో 29 మందితో కూడిన జట్టుని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇంగ్లండ్ వెళ్లే ముందు పీసీబీ కరోనా వైరస్ పరీక్షలు చేయగా.. అందులో 10 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మహ్మద్ హఫీజ్ పర్సనల్‌గా వైరస్ పరీక్షలు చేయించుకోగా నెగటివ్ రావడంతో.. అదే విషయాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. దాంతో పీసీబీ అతనికి మూడు రోజుల వ్యవధిలోనే రెండు సార్లు పరీక్షలు నిర్వహించగా.. ఆఖరికి నెగటివ్‌గా తేలింది. అతనితో పాటు మరో ఐదుగురికి నెగిటివ్‌గా వచ్చింది. మొత్తంగా రెండు బ్యాచ్‌లుగా 20 మంది క్రికెటర్లని ఇంగ్లండ్ టూర్‌కి పీసీబీ పంపింది.

 భట్టీకి పాజిటివ్.. నెగటివ్

భట్టీకి పాజిటివ్.. నెగటివ్

పీసీబీ మూడో దశలో నిర్వహించిన పరీక్షల్లో హైదర్ అలీ, ఇమ్రాన్ ఖాన్, కాశీఫ్ భట్టి‌లకి నెగటివ్ రావడంతో.. వారిని కూడా మూడో బ్యాచ్‌గా ఇంగ్లండ్‌కి పంపింది. ఇంగ్లీష్ గడ్డపై అడుగుపెట్టిన తర్వాత అక్కడ ఈసీబీ ఈ ముగ్గురికీ పరీక్షలు చేయగా.. ఇందులో కాశీఫ్ భట్టీకి కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో భట్టీని సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని ఈసీబీ ఆదేశించింది. తాజాగా నిర్బహించిన టెస్టులో మాత్రం 33 ఏళ్ల భట్టీకి నెగటివ్ వచ్చింది. దీంతో వోర్సెస్టర్‌లోని మిగిలిన జట్టులో చేరడానికి ఈసీబీ అనుమతిచ్చింది. ప్రస్తుతం కాశీఫ్ భట్టీ ప్రాక్టీస్ చేస్తున్నాడు.

సిరీస్‌కి ముందు కూడా కరోనా పరీక్షలు

సిరీస్‌కి ముందు కూడా కరోనా పరీక్షలు

ఆగస్టు 5 నుంచి ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్ల మధ్య మూడు టెస్టులు, మూడు టీ20ల సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ మొత్తాన్ని పూర్తి బయో సెక్యూర్ వాతావరణంలో ఈసీబీ నిర్వహించబోతోంది. బయో సెక్యూర్ రూల్స్ ప్రకారం నెల రోజుల ముందే అక్కడికి పాక్ టీమ్‌ని రప్పించిన ఈసీబీ.. 14 రోజులు క్వారంటైన్‌లో ఉంచింది. తాజాగా క్వారంటైన్‌ సమయం ముగిసింది. ఇక సిరీస్‌కి ముందు ఇరు జట్ల ఆటగాళ్లకి కరోనా పరీక్షలు నిర్వహించి.. నెగటివ్ ఉన్నవారిని మ్యాచ్ ఆడడానికి అనుమతిస్తారు. జులై 13న పాక్‌ టీమ్‌ డెర్బీషైర్‌కు వెళ్లనుంది.

మాంచెస్టర్, సౌతాంప్టన్ వేదికగానే

మాంచెస్టర్, సౌతాంప్టన్ వేదికగానే

ఆగస్టు 5 నుంచి ఇంగ్లండ్-పాకిస్థాన్ జట్ల మధ్య మూడు టెస్టులు, మూడు టీ20ల సిరీస్‌‌ జరగాల్సి ఉంది. సిరీస్‌ మొత్తం మాంచెస్టర్, సౌతాంప్టన్ వేదికగానే జరగనున్నాయి. మొదటి టెస్టు మాంచెస్టర్‌లో జరుగుతుంది. రెండో టెస్టు (ఆగస్టు 13-17), మూడో టెస్టు (ఆగస్టు 21-25)కు సౌతాంప్టన్‌ వేదికగా జరగనున్నాయి. ఆ తర్వాత రెండు జట్లు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడతాయి. తొలి మ్యాచ్‌ ఆగస్టు 28న జరుగుతుంది. టీ20లు అన్నీ సౌతాంప్టన్‌లో జరుగుతాయి.

ఐపీఎల్ నిర్వ‌హ‌ణ‌కు మేం సిద్ధం: స‌ల్మాన్

Story first published: Friday, July 17, 2020, 16:44 [IST]
Other articles published on Jul 17, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+