Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్ నిర్వ‌హ‌ణ‌కు మేం సిద్ధం: స‌ల్మాన్

Salman Hanif said Dubai is ready to host the IPL 2020

దుబాయ్: భార‌త్‌లో క‌రోనా వైర‌స్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేప‌థ్యంలో ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) నిరవధిక వాయిదా ప‌డింది. భారత్‌లో క్రికెట్‌ను పున:ప్రారంభించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఎంత ప్రయత్నిస్తున్నా అది సాధ్యం కావట్లేదు. దేశంలో కరోనా వైరస్ ఇప్పట్లో అదుపులోకి వచ్చే పరిస్థితులు లేకపోవడంతో ఐపీఎల్‌ను విదేశాలకు తరలించాలని బీసీసీఐ భావిస్తోంది. అయితే ఆ టోర్నీని దుబాయ్‌లో నిర్వ‌హిస్తార‌న్న ఊహాగానాలు ఇటీవల ఎక్కువయ్యాయి.

ఐపీఎల్ నిర్వ‌హ‌ణ‌కు మేం సిద్ధం

ఐపీఎల్ నిర్వ‌హ‌ణ‌కు మేం సిద్ధం

ఈ నేప‌థ్యంలో దుబాయ్ స్పోర్ట్స్ సిటీ హెడ్ స‌ల్మాన్ హ‌నిఫ్ ఈ ఐపీఎల్‌పై ఓ క్లారిటీ ఇచ్చారు. తాజాగా స‌ల్మాన్ హ‌నిఫ్ గల్ఫ్ న్యూస్‌తో మాట్లాడుతూ... 'ఒక‌వేళ ఐపీఎల్ 2020ని దుబాయ్‌లో నిర్వ‌హించాల‌నుకుంటే.. మేము సిద్ధంగా ఉన్నాం. దుబాయ్ స్పోర్ట్స్ సిటీలో అన్ని స‌దుపాయాలు రెడీగా ఉన్నాయి. దుబాయ్ ఇంట‌ర్నేష‌న‌ల్ స్టేడియం, ఐసీసీ అకాడ‌మీ.. స్పోర్ట్స్ సిటీలోనే ఉన్నాయి. స్టేడియంలో తొమ్మిది పిచ్‌లు ఉన్నాయి. ఒక‌వేళ త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ మ్యాచ్‌లు నిర్వ‌హించినా ఎటువంటి న‌ష్టం ఉండ‌దు. పిచ్ కోసం మ్యాచ్‌ల‌ను షెడ్యూల్ చేయాల్సిన అవ‌స‌రం ఉంది' అని అన్నారు. ఐసీసీ కాంప్లెక్స్‌లో ప్రాక్టీస్ కోసం 38 నెట్ వికెట్లు ఉన్న‌ట్లు హ‌నిఫ్ తెలిపారు.

వ‌చ్చే వారం క్లారిటీ

వ‌చ్చే వారం క్లారిటీ

యూఏఈలో ఇప్ప‌టి వ‌ర‌కు 50 వేల మందికి కరోనా వైర‌స్ సోకింది. కేవలం 300 మంది మాత్రమే మ‌ర‌ణించారు. వీలైతే ఐపీఎల్‌ 2020ని విదేశాల్లోనూ నిర్వ‌హించేందుకు ఆస‌క్తిగా ఉన్న‌ట్లు ఇటీవ‌ల బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ తెలిపారు. అక్టోబ‌ర్ 18 నుంచి న‌వంబ‌ర్ 15 వ‌ర‌కు ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్‌ జ‌ర‌గాల్సి ఉన్న‌ది. దానిపై వ‌చ్చే వారం క్లారిటీ రానుంది. ఒక‌వేళ ప్రపంచకప్‌ ర‌ద్దు అయితే, అప్పుడు ఐపీఎల్ ఎడిష‌న్‌ను సెప్టెంబ‌ర్ లేదా అక్టోబ‌ర్‌లో దుబాయ్‌లో నిర్వ‌హిస్తార‌న్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ నిర్వ‌హ‌ణ‌కు గ్రీన్ సిగ్న‌ల్ వ‌స్తే.. అప్పుడు ప్లేయ‌ర్లు ప్రాక్టీస్ కోసం దుబాయ్‌కు ముందే వెళ్లాల్సి వ‌స్తుంది.

దుబాయ్‌‌‌‌ వేదికగా ట్రైనింగ్‌‌‌‌ క్యాంప్‌

దుబాయ్‌‌‌‌ వేదికగా ట్రైనింగ్‌‌‌‌ క్యాంప్‌

దేశంలో కరోనా వైరస్ ఇప్పట్లో అదుపులోకి వచ్చే పరిస్థితులు లేకపోవడంతో ఐపీఎల్‌తో పాటు టీమిండియా క్రికెటర్లను విదేశాలకు తరలించాలని బీసీసీఐ భావిస్తోంది. ఇందులో భాగంగా యూఏఈలో ఐపీఎల్‌‌‌‌ను నిర్వహించేందుకు ఆ బోర్డుతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. చర్చలు కూడా కొలిక్కి వచ్చినట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి. ఆగస్ట్‌‌‌‌ మూడో వారం నుంచి సెప్టెంబర్‌‌‌‌ రెండో వారం మధ్యలో దుబాయ్‌‌‌‌ వేదికగా 4 నుంచి 6 వారాల పాటు ఈ ట్రైనింగ్‌‌‌‌ క్యాంప్‌‌‌‌ ఉండనుంది. 30, 35 మంది టాప్‌‌‌‌ క్రికెటర్లు ఇందులో పాల్గొంటారు. క్యాంప్‌‌‌‌ ముగిసిన వెంటనే ప్లేయర్లందరూ తమ ఫ్రాంచైజీలతో చేరుతారు.

11 అంశాలపై బోర్డు చర్చ:

11 అంశాలపై బోర్డు చర్చ:

కరోనా కారణంగా నిరవధికంగా వాయిదా పడిన ఐపీఎల్‌పై ఈ రోజు స్పష్టత రానుంది. ఐపీఎల్‌ నిర్వహణ, లీగ్‌ విధివిధానాల ఖరారే ప్రధాన అజెండాగా బీసీసీఐ ఎపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ కానుంది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆధ్వర్యంలో జరుగనున్న ఈ వర్చువల్‌ సమావేశంలో ఐపీఎల్‌ సహా 11 అంశాలపై బోర్డు చర్చించనుంది. వచ్చేవారం ఐసీసీ భేటీలో టీ20 ప్రపంచకప్‌ వాయిదాపై నిర్ణయం వెలువడే అవకాశం ఉండటంతో.. ఐపీఎల్‌ విషయంలో పూర్తి సన్నద్ధతతో ఉండాలని బీసీసీఐ భావిస్తోంది.

Girlfriend or dog: ఇంతకు జోప్రా ఆర్చర్ ఎవరిని కలిశాడు?

Story first published: Friday, July 17, 2020, 15:47 [IST]
Other articles published on Jul 17, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+