ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాజయం.. కోచ్‌తో ఆ ఇద్దరి ఆటగాళ్లపై వేటు!
ఇంగ్లండ్ పర్యటనలో పాకిస్థాన్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. మూడు టెస్ట్‌ల సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన పాకిస్థాన్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ ఘోర పరాజయాలను మూటగట్టుకుంది. ఇంగ్లండ్‌కు కనీస పోటీ ఇవ్వలేకపోయింది. తొలి టెస్ట్‌లో ఇన్నింగ్స్ 103 పరుగుల తేడాతో చిత్తయిన పాకిస్థాన్.. తాజాగా లార్డ్స్ టెస్ట్‌లో 194 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.
దాంతో మూడు టెస్ట్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 0-2తో కోల్పోయింది. ఈ పరాజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది. పాకిస్థాన్‌తో పాటు ఇంగ్లండ్ కూడా డబ్ల్యూటీసీ ఫైనల్ చేరలేని పరిస్థితి నెలకొంది.
రిజ్వాన్, ఇమామ్ ఔట్..
ఈ పరాజయంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. మహమ్మద్ రిజ్వాన్‌తో పాటు ఇమామ్ ఉల్ హక్‌ను జట్టు నుంచి తప్పించి పాకిస్థాన్‌కు పంపించాలని నిర్ణయించిందని జియో న్యూస్ పేర్కొంది. ఈ వరుస పరాజయాల నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు హైలెవెల్ మీటింగ్ నిర్వహించిందని కూడా తెలిపింది.

ఈ సమావేశంలో పీసీబీ ఛైర్మన్ మోహ్‌సిన్ నఖ్వీ, సీఓఓ సుమైర్ అహ్మద్, పీఎస్‌ఎల్ సీఈఓ సల్మాన్ నజీర్, సీనియర్ సెలెక్టర్ అకీబ్ జావెద్, పరిమిత ఓవర్ల హెడ్ కోచ్ మైక్ హెస్సెన్ హాజరయ్యారని పేర్కొంది. ఇమ్రాన్ ఖాన్ కుమారుల ఇంటర్వ్యూ కంటే పాకిస్థాన్ ఘోర పరాజయాలే తీవ్ర అసంతృప్తికి గురి చేశాయని పీసీబీ ఛైర్మెన్ అన్నట్లు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి.
పాక్ పరాజయాలపైనే..
'రెండో టెస్టు సందర్భంగా స్కై స్పోర్ట్స్‌లో ఇమ్రాన్ ఖాన్ కుమారుల ఇంటర్వ్యూ ప్రసారం కావడం కూడా అధికార వర్గాలను కలవరపెట్టింది. కానీ అన్నింటికన్నా ఎక్కువగా.. మీడియాలో పాకిస్తాన్ జట్టును చిత్రీకరించిన తీరు, వారి ప్రదర్శనే ఆందోళన కలిగించాయి. ఇమామ్ తీవ్ర చిక్కుల్లో ఉన్నాడు. అతని స్థానంలో అబ్దుల్లా ఫజల్ జట్టులో చేరుతాడు.'అని ఓ పీసీబీ అధికారి తెలిపాడు.
సర్ఫరాజ్ అహ్మద్‌పై వేటు..
ఈ వరుస పరాజయాల నేపథ్యంలో పాకిస్థాన్ టెస్ట్ టీమ్ హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్‌ను తప్పించాలనే యోచనలో పీసబీ ఉన్నట్లు తెలుస్తోంది. సర్ఫరాజ్ అహ్మద్ స్థానంలో పరిమిత ఓవర్ల కోచ్ మైక్ హెస్సేన్‌కే టెస్ట్ టీమ్ బాధ్యతలు కూడా అప్పగించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగే మూడో టెస్ట్‌కు ముందే ఈ నిర్ణయం వెలువడనుందని జియో న్యూస్ పేర్కొంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

