For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అందుకే AK47 ఫైరింగ్ సెలెబ్రేషన్: పాక్ ఓపెనర్

ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా భారత్‌తో జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓపెనర్ సహిబ్జాద ఫర్హాన్ వ్యవహారి శైలి తీవ్ర చర్చనీయాంశమైంది. ఫర్హాన్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో పాకిస్థాన్‌కు 171 పరుగుల పోరాడే లక్ష్యాన్ని అందించాడు. తొలి ఓవర్‌లోనే అతను ఇచ్చిన క్యాచ్‌ను అభిషేక్ శర్మ వదిలేయడంతో ఊపిరి పీల్చుకున్న ఫర్హాన్.. ఆ తర్వాత భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

45 బంతుల్లో 58 పరుగులతో పాక్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే హాఫ్ సెంచరీ అనంతరం ఫర్హాన్ చేసుకున్న AK47 ఫైరింగ్ సెలెబ్రేషన్స్ తీవ్ర చర్చనీయాంశమైంది. భారత్‌పై తుపాకీ ఎక్కుపెట్టిన ఫర్హాన్‌పై నెటిజన్లు మండిపడ్డారు. ఈ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం తన సెలెబ్రేషన్స్‌కు గల కారణాన్ని ఫర్హాన్ వెల్లడించాడు. ఈ సంబరాలపై ఎవరు ఏమనుకున్నా తనకు అనవసరమని పేర్కొన్నాడు. ఆ సమయంలో అలా సెలెబ్రేట్ చేసుకోవాలనిపించిందని చెప్పాడు.

Pakistan s Sahibzada Farhan Breaks Silence on AK47 Gesture During Clash Against India

'నా నుంచి భవిష్యత్తులో మరిన్నీ సిక్స్‌లు చూస్తారు. AK47 ఫైరింగ్ సెలెబ్రేషన్ గురించి ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం. ఆ క్షణంలో అలా సంబరాలు చేసుకోవాలనిపించింది. నాకు నచ్చినట్లు సంబరాలు చేసుకున్నాను. ఈ సెలెబ్రేషన్ గురించి ప్రజలు ఏమనుకున్నా నేను పట్టించుకోను. ప్రత్యర్థి ఎవరైనా.. ఎక్కడ ఆడినా టీ20ల్లో దూకుడగా ఆడాలి. అది భారత్, మరో దేశమా అనవసరం. ఈ రోజు ఆడినట్లుగానే ప్రతీ జట్టుపై దూకుడుగా ఆడాలి.

గత కొన్ని మ్యాచ్‌ల్లో మేం పవర్ ప్లేను సరిగ్గా ఉపయోగించకోవడం లేదు. త్వరగా వికెట్లు కోల్పోతున్నాం. వికెట్లు కోల్పోకుండా పవర్ ప్లేను వాడుకోవడం కీలకం. ఈ రోజు పవర్ ప్లేలో ఆడినట్లు ఆడాలి. త్వరగా వికెట్లు కోల్పోకూడదు. దేవుడి దయ వల్ల ఈ రోజు పవర్ ప్లేలో మెరుగైన ప్రదర్శన చేశాం. 10 ఓవర్లలోనే 90కి పైగా పరుగులు చేశాం. కానీ మిడిల్ ఓవర్లలో కొంచెం తడబడ్డాం. తదుపరి మ్యాచ్‌ల్లో దాన్ని సరిచేసుకుంటాం.'అని ఫర్హాన్ చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, September 22, 2025, 15:47 [IST]
Other articles published on Sep 22, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+