Pakistan Playing XI vs India:3+3 ఫార్మూలతో బాబర్ సేన.. తుది జట్టు అంచనా ఇదే!

దుబాయ్: యావత్ క్రికెట్ ప్రపంచం ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న భారత్ X పాకిస్థాన్ పోరుకు రంగం సిద్దమైంది. ఆసియా కప్‌లో భాగంగా దాయాదీ దేశాలు ఆదివారం అమీతుమీ తేల్చుకోనున్నాయి. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో చిత్తుగా ఓడిన భారత్.. ప్రతీకారం తీర్చుకోవడంపై దృష్టిసారించగా.. అదే జోరును కొనసాగిస్తూ రోహిత్ సేనకు షాకివ్వాలని పాక్ భావిస్తోంది. ఇప్పటికే ఈ దాయదుల పోరుపై భారీ హైప్ క్రియేట్ అవ్వగా.. ఇరు జట్ల సారథులు తమ మాటలతో ఈ హై ఓల్టేజ్ సమరానికి కాలు దువ్వారు.
టైటిల్ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నామని, శుభారంభం దక్కుతుందని రోహిత్ ధీమా వ్యక్తం చేయగా.. మాటలతో కాకుండా చేతల్లో చేసి చూపిస్తామని బాబర్ ఆజామ్ పేర్కొన్నాడు. అయితే షాహిన్ షా అఫ్రిది గైర్హాజరీ నేపథ్యంలో పాక్ ఎలాంటి కాంబినేషన్‌తో బరిలోకి దిగుతుందనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఓపెనర్లుగా బాబర్ ఆజామ్, రిజ్వాన్..
కెప్టెన్ బాబర్ ఆజామ్, వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ ఓపెనర్లుగా బరిలోకి దిగడం ఖాయం. గతేడాది టీ20 ప్రపంచకప్‌లో ఈ ఇద్దరే చివరి వరకు ఆడి భారత్‌ను చిత్తుగా ఓడించాడు. ప్రస్తుతం ఈ ఇద్దరూ మూడు ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తున్నారు. బాబర్ ఆజామ్.. నెదర్లాండ్స్‌పై వరుసగా మూడు హాఫ సెంచరీలు బాది ఫుల్ జోష్‌లో ఉండగా.. మహమ్మద్ రిజ్వాన్‌కు టీ20ల్లో ఘనమైన రికార్డు ఉంది. 50.4 సగటుతో అతను పరుగులు చేశాడు. ఈ ఇద్దరితో భారత్‌కు ప్రమాదం పొంచింది. వీలైనంత త్వరగా ఔట్ చేయకపోతే మ్యాచ్ ఫలితాన్ని శాసించగలరు.

మిడిలార్డర్‌లో ఫకార్, ఇఫ్తికార్, ఆసిఫ్ అలీ
పాక్ జట్టులో ఫకార్ జమాన్ విధ్వసంకర ఆటగాడు. ఒక్కసారి క్రీజులో సెట్ అయ్యాడంటే అతన్ని ఆపటం కష్టం. 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఫకార్ భారత్ పతనాన్ని శాసించాడు. నెదర్లాండ్స్‌పై ఇటీవలే సెంచరీ బాదాడు. ఫకార్ మూడో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. ఇక నాలుగో స్థానంలో ఇఫ్తికార్, ఐదో స్థానంలో ఆసిఫ్ అలీ ఆడనున్నారు. ఇఫ్తికర్ వేగంగా ఆడగలడు. అసిఫ్ అలీ సైతం భారీ సిక్సర్లు కొట్టగల సామర్థ్యం ఉంది.

ముగ్గురు ఆల్ రౌండర్లు..
కుష్దిల్ షా, షాదాబ్ ఖాన్, మహమ్మద్ నవాజ్ ఆల్‌రౌండర్లుగా బరిలోకి దిగనున్నారు. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన కుష్దిల్ షా.. ఈ సీజన్ పీఎస్‌ఎల్‌లో దుమ్మురేపాడు. అయితే అతనికి హైదర్ అలీ నుంచి గట్టి పోటీ ఉంది. స్పిన్ ఆల్‌రౌండర్ అయిన షాదాబ్ ఖాన్ తన బౌలింగ్‌తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు. అటు బ్యాటింగ్‌లోనూ సత్తా చాటగలడు. మరో లెఫ్టార్మ్ స్పిన్నర్ అయిన మహమ్మద్ నవాజ్ లోయరార్డర్‌లో బ్యాటింగ్ చేయగలడు. 30 టీ20ల్లో 25 వికెట్లు పడగొట్టాడు.

ముగ్గురు పేసర్లు..
షాహిన్ షా గైర్హాజరీలో నసీమ్ షా, హ్యారీస్ రౌఫ్, మహమ్మద్ హస్నైన్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. 16 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన నసీమ్ షా.. మళ్లీ ఇన్నాళ్లకు అవకాశం అందుకున్నాడు. నెదర్లండ్స్‌పై ఐదు వికెట్లతో సత్తా చాటాడు. టీ20 ప్రపంచకప్‌లో హ్యారిస్ రౌఫ్ దుమ్మురేపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతనే పేస్ విభాగాన్ని లీడ్ చేయనున్నాడు. షాహిన్ అఫ్రిది స్థానంలో జట్టులోకి వచ్చిన మహమ్మద్ హస్నైన్‌కు మూడో పేసర్‌గా అవకాశం దక్కవచ్చు. అయితే అతనికి షాన్ వాజ్ దహనితో పోటీ ఉండనుంది.

పాక్ తుది జట్టు(అంచనా)
బాబర్ ఆజామ్(కెప్టెన్), మహమ్మద్ రిజ్వాన్, ఫకార్ జమాన్, ఇఫ్తికార్, అసిఫ్ అలీ, కుష్దిల్ షా, షాదాబ్ ఖాన్, మహమ్మద్ నవాజ్, షాహిన్ షా, నసీమ్ షా, హ్యారీస్ రౌఫ్, మహమ్మద్ హస్నైన్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications