For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Pakistan Playing XI: ఆజామ్ ఖాన్‌పై వేటు.. భారత్‌తో తలపడే పాకిస్థాన్ తుది జట్టు ఇదే!

టీ20 ప్రపంచకప్ 2024‌ను ఓటమితో ప్రారంభించిన పాకిస్థాన్.. మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. ఆదివారం న్యూయార్క్ వేదికగా జరగనున్న హైఓల్టేజ్ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి భారత్‌తో పాకిస్థాన్ అమీతుమీ తేల్చుకోనుంది. పసికూన అమెరికా చేతిలో అనూహ్య పరాజయాన్ని ఎదుర్కొన్న పాకిస్థాన్.. మెగా టోర్నీలో కొనసాగాలంటే ఈ బిగ్ మ్యాచ్‌లో గెలవడం చాలా ముఖ్యం.

ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా పాకిస్థాన్ సూపర్-8కు అర్హత సాధిస్తోంది. ఓడితే మాత్రం అమెరికా ఆడే మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే భారత్‌ను ఓడించడమే లక్ష్యంగా పాకిస్థాన్ సన్నదమవుతోంది. తొలి మ్యాచ్‌లో చేసిన తప్పిదాలను సరిచేసుకోవడంపై ఫోకస్ పెట్టింది.

Pakistan Playing XI vs India for T20 World Cup 2024 Azam Khan Out and Saim Ayub In

బండోడిపై వేటు..
ఈ క్రమంలోనే తుది జట్టులో మార్పులు చేసేందుకు రెడీ అయ్యింది. బలహీనంగా ఉన్న బ్యాటింగ్‌ లైనప్‌ను పటిష్టం చేయాలనుకుంటోంది. అమెరికాతో తొలి పోరులో బాబర్ ఆజామ్, రిజ్వాన్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. అయితే ఈ ఇద్దరూ పరుగులు చేయడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలోనే దూకుడుగా ఆడే ఓపెనర్‌ను బరిలోకి దించాలని పాకిస్థాన్ భావిస్తోంది.

సయిమ్ ఆయుబ్‌ ఫిట్‌గా ఉంటే అతన్ని ఓపెనర్‌గా ఆడించాలనుకుంటోంది. ఆయుబ్ జట్టులోకి వస్తే ఆజామ్ ఖాన్‌పై వేటు పడనుంది. అప్పుడు మహమ్మద్ రిజ్వాన్ వికెట్ కీపింగ్ చేస్తాడు. అమెరికాతో మ్యాచ్‌లో ఆజామ్ ఖాన్ గోల్డెన్ డక్ అయ్యాడు. అతని వైఫల్యం పాకిస్థాన్ పరాజయానికి కారణమైంది. ఈ క్రమంలోనే ఆజామ్‌ ఖాన్‌ను పక్కనపెట్టాలని పాకిస్థాన్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

చిచ్చాకు మరో ఛాన్స్
మరో వెటరన్ ప్లేయర్ ఇఫ్తికర్ అహ్మద్ కూడా తొలి మ్యాచ్‌లో తీవ్రంగా నిరాశపరిచాడు. అయితే అతనికి స్పిన్ బౌలింగ్ చేసే సామర్థ్యం ఉండటం కలిసొచ్చే అంశం. న్యూయార్క్ పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో తుది జట్టులో కొనసాగే అవకాశం ఉంది.

గాయంతో ఇబ్బంది పడుతున్న ఇమాద్ వసీం అందుబాటులోకి వస్తే అతను తుది జట్టులోకి వస్తాడు. అప్పుడు పాకిస్థాన్ ముగ్గురు పేసర్లతోనే బరిలోకి దిగాల్సి ఉంటుంది. ఇమాద్ వసీం బరిలోకి దిగితే తొలి మ్యాచ్‌లో విఫలమైన హ్యారీస్ రౌఫ్‌పై వేటు పడనుంది.

భారత్‌తో పాకిస్థాన్ తుది జట్టు(అంచనా):
మహమ్మద్ రిజ్వాన్, సయిమ్ ఆయుబ్, బాబర్ ఆజామ్, ఫకార్ జమాన్, ఉస్మాన్ ఖవాజా, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఇమాద్ వసీం, షాహిన్ అఫ్రిది, నసీమ్ షా, మహమ్మద్ అమీర్

పాకిస్థాన్ వరల్డ్ కప్ టీమ్:
బాబర్ ఆజామ్, అబ్రర్ అహ్మద్, ఆజామ్ ఖాన్, ఫకార్ జమాన్, హ్యారీస్ రౌఫ్, ఇఫ్తికర్ అహ్మద్, ఇమాద్ వసీం, మహమ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహమ్మద్ అమీర్, మహమ్మద్ రిజ్వాన్, నసీమ్ షా, సయీమ్ ఆయుబ్, షాదాబ్ ఖాన్, షాహిన్ షా అఫ్రిది, ఉస్మాన్ ఖాన్.

Story first published: Saturday, June 8, 2024, 20:03 [IST]
Other articles published on Jun 8, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+