For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫామ్‌లో ఆజామ్‌.. రిజ్వాన్‌, అఫ్రిదితో ప్రమాదమే! న్యూజిలాండ్‌తో బరిలోకి దిగే పాక్ జట్టు ఇదే!

Pakistan Playing 11 vs NZ: Babar Azam, Mohammad Rizwan And Shaheen Afridi To Continue There Form

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్‌ 2021లో భాగంగా మంగళవారం (అక్టోబర్ 26) న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌తో కివీస్ టోర్నీలో తొలి మ్యాచ్‌ ఆడనుండగా.. పాకిస్థాన్‌కు ఇది రెండో మ్యాచ్. ప్రపంచకప్‌లలో భారత్‌పై వరుస పరాజయాల పరంపరకు బ్రేక్ వేసిన పాక్.. పూర్తి ఆత్మవిశ్వసంతో బరిలోకి దిగనుంది. ఆదివారం టీమిండియాపై అన్ని విభాగాల్లో ఆధిపత్యం చెలాయించిన పాక్.. కివీస్‌పై కూడా అదే పునరావృతం చేయాలని చూస్తోంది.

మరోవైపు న్యూజిలాండ్ కూడా పటిష్టంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. ఈ మ్యాచ్‌ షార్జా క్రికెట్ స్టేడియంలో ఈరోజు రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుండగా.. టాస్ 7 గంటలకు పడనుంది.

రికార్డ్స్ అండ్ పిచ్ రిపోర్ట్

రికార్డ్స్ అండ్ పిచ్ రిపోర్ట్

టీ20 మ్యాచుల్లో న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌ జట్లు ఇప్పటి వరకు 24 సార్లు తలపడ్డాయి. ఇందులో పాకిస్థాన్ 14 మ్యాచులు గెలుపొందగా.. న్యూజిలాండ్ 10 గెలిచింది. ఇక టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్లు 5 సార్లు తలపడగా..ఇందులో పాకిస్థాన్ 3 సార్లు, న్యూజిలాండ్ 2 సార్లు విజయాలను అందుకున్నాయి. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

అలాగే డిస్నీ+హాట్‌స్టార్ యాప్‌లోనూ అభిమానులు మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చూడోచ్చు. ఈ మ్యాచ్ జరగనున్న షార్జా పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండనుంది. శ్రీలంక, బంగ్లాదేశ్‌ జట్లు ఇదే పిచ్‌పై 340కి పైగా పరుగులు చేసాయి. ఈ రోజు కూడా పరుగుల వరద పారే అవకాశం ఉంది. అయితే మధ్య ఓవర్లలో స్పిన్నర్లు ప్రభావం చూపన్నారు.

IND vs PAK: వామ్మో.. మొహ్మద్ రిజ్వాన్ మామూలోడు కాదుగా! చెప్పి మరీ కొట్టాడు! ఆషాట్లు సూపర్ (వీడియో)!!

ఓపెనర్లే ఊదేశారు

ఓపెనర్లే ఊదేశారు

పాకిస్తాన్ జట్టు బలంగా ఉంది. ముఖ్యంగా బ్యాటింగ్‌లో స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. టీమిండియాపై 152 పరుగుల లక్ష్యాన్ని పాక్ ఓపెనర్లే సునాయాసంగా ఊదేశారు. మొహ్మద్ రిజ్వాన్‌ (79; 55 బంతుల్లో 6x4, 3x6), బాబర్‌ ఆజామ్‌ (68; 52 బంతుల్లో 6x4, 2x6) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. ఈ జోడి సొంతగడ్డ లాంటి దుబాయ్‌ పిచ్‌పై తొలి ఓవర్‌ నుంచే వేగంగా ఆడారు. మంచి బంతులను ఆచితూచి ఆడిన పాక్‌ ఓపెనర్లు.. చెత్త బంతులపై మాత్రం నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డారు.

భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని పరుగుల వరద పారించారు. ఆజామ్‌, రిజ్వాన్‌ టీమిండియా బౌలర్లకు ఎక్కడ కూడా ఒక్క అవకాశం ఇవ్వలేదు. న్యూజిలాండ్ జట్టు ఈ ఇద్దరినీ త్వరగా పెవిలియన్ చేర్చకపొతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

జమాన్‌, అఫ్రిదితో ప్రమాదమే

జమాన్‌, అఫ్రిదితో ప్రమాదమే

ఇక హిట్టర్ ఫకార్‌ జమాన్‌ నుంచి కివీస్ జట్టుకు ముప్పు పొంచి ఉంది. టీ20 ఫార్మాట్‌లో నిలకడగా రాణిస్తున్న జమాన్‌ను ఎంత త్వరగా పెవిలియన్‌కు చేరిస్తే అంత మంచిది. అతను కుదురుకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవు. సీనియర్లు షోయబ్ మాలిక్‌, మొహ్మద్ హఫీజ్‌లను కట్టడి చేయాలి. ఈ ఇద్దరూ మ్యాచును మలుపు తిప్ప గల సమర్థులు.

తమ అనుభవంతో పరుగులు చేయగలరు. గత రెండేళ్లలో ప్రపంచ స్థాయి పేసర్‌గా ఎదిగిన షహీన్‌ షా అఫ్రిది ధాటికి భారత బ్యాటర్లు చేతులెత్తేసిన విషయం తెలిసిందే. అఫ్రిది మరోసారి చెలరేగితే కివీస్ జట్టుకు తిప్పలు తప్పవు. హసన్‌ అలీ, హారిస్‌ రవూఫ్‌ లాంటి ప్రతిభావంతులైన పేసర్లు పాక్ సొంతం. స్పిన్నర్లు ఇమాద్‌, షాదాబ్‌లు ఫామ్‌లో ఉన్నారు.

పాకిస్థాన్‌ తుది జట్టు (అంచనా)

పాకిస్థాన్‌ తుది జట్టు (అంచనా)

బాబర్ అజామ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఫకార్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, ఆసిఫ్ అలీ, ఇమాద్ వసీమ్, షదాబ్ ఖాన్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హారీస్ రౌప్.

Story first published: Tuesday, October 26, 2021, 10:37 [IST]
Other articles published on Oct 26, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+