Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs PAK: వామ్మో.. మొహ్మద్ రిజ్వాన్ మామూలోడు కాదుగా! చెప్పి మరీ కొట్టాడు! ఆషాట్లు సూపర్ (వీడియో)!!

India vs Pakistan: Mohammad Rizwans shadow practicing video goes viral

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్‌ 2021లో భాగంగా ఆదివారం రాత్రి దుబాయి వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 151 పరుగుల సాధారణ స్కోర్‌ చేయగా.. పాక్ మరో 13 బంతులు మిగిలుండగానే ఒక వికెట్ కూడా కోల్పోకుండా విజయాన్ని అందుకుంది. దాయాదుల మధ్య ఎపుడూ హోరాహోరీగా జరిగే మ్యాచ్.. ఈసారి మాత్రం ఏకపక్షంగా సాగింది. ఈ మ్యాచులో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో తేలిపోగా.. పాక్ అద్భుతంగా రాణించింది.

ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడో ఏమో

ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడో ఏమో

చాలా ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌ టోర్నీల్లో విజయం సాధించడంతో పాక్ జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా షాహిన్ షా ఆఫ్రిది, బాబర్ ఆజామ్, మొహ్మద్ రిజ్వాన్‌పై అందరూ ప్రశంసిస్తున్నారు. అయితే ఈ మ్యాచ్​కు ముందు రిజ్వాన్​​ చేసిన ప్రాక్టీస్​ ఇప్పుడు నెట్టింట వైరల్​గా మారింది. ఏదైనా ప్రతిష్టాత్మక పోరులో గెలవాలంటే కసి, పట్టుదల, ప్రణాళిక, సన్నద్ధత ఎంతో ముఖ్యం. ఇవన్నీ ఉంటేనే ఆ ఆటగాడు మైదానంలో సక్సెస్ అవుతాడు. ఇవన్నీ తనలో ఉన్నాయని నిరూపించాడు పాక్ ఓపెనర్ మొహ్మద్ రిజ్వాన్. టీమిండియా​తో మ్యాచ్​ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడో ఏమో.. ముందే ఎలాంటి షాట్లను ఆడాలో ప్రాక్టీస్ చేశాడు. అవే షాట్లను మైదానంలో ఆడాడు.

ప్రతి పిల్లాడు వీధి క్రికెట్‌లోనే అలాంటి బంతులను ఎదుర్కొంటారు.. ఆ భారత బౌలర్‌ ఓ లెక్కనా: పాక్‌ మాజీ కెప్టెన్

రిజ్వాన్ మామూలోడు కాదుగా

ఆదివారం (అక్టోబర్ 24) భారత్, పాకిస్తాన్ మ్యాచ్​ మొదలుకావడానికి ముందు వికెట్ల వెనకాల నిలబడి మొహ్మద్ రిజ్వాన్ షాట్లు ఆడాడు. తర్వాత లక్ష్య ఛేదనలో బరిలో దిగి అదే షాట్లను మ్యాచ్​లోనూ ఆడాడు. మ్యాచుకు ముందు ప్రాక్టీస్ చేసిన ఒక్క షాట్‌ను కూడా వదలకుండా మ్యాచులో ఆడాడు. అందులో డిఫెన్స్, భారీ షాట్లు కూడా ఉన్నాయి. భువనేశ్వర్ కుమార్, మొహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో సునాయాస షాట్లు ఆడాడు.

ఇందుకు సంబందించిన వీడియోను ఐసీసీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రిజ్వాన్​పై ప్రశంసలు కురిపిస్తున్నారు. 'వామ్మో.. మొహ్మద్ రిజ్వాన్ మామూలోడు కాదుగా', 'రిజ్వాన్ చెప్పి మరీ కొట్టాడు', 'రిజ్వాన్ షాట్లు సూపర్' అంటూ కామెంట్ల వర్షం కురిపించారు.

రిజ్వాన్‌ ఆడుతూ పాడుతూ

రిజ్వాన్‌ ఆడుతూ పాడుతూ

భారత్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన పాకిస్థాన్‌.. బ్యాటింగ్‌లోనూ అదరగొట్టింది. సొంతగడ్డ లాంటి దుబాయ్‌ పిచ్‌పై పాక్‌ ఓపెనర్లు తొలి ఓవర్‌ నుంచే వేగంగా ఆడారు. భువనేశ్వర్‌ కుమార్ వేసిన ఇన్నింగ్స్‌ మొదటి ఓవర్‌లో 4, 6తో మొహ్మద్ రిజ్వాన్‌ (79; 55 బంతుల్లో 6x4, 3x6) దంచుడు షురూ చేశాడు. బాబర్‌ అజామ్‌ (68; 52 బంతుల్లో 6x4, 2x6) కూడా ధాటిగానే ఆడాడు. తొలి నాలుగు ఓవర్లను నలుగురు వేర్వేరు బౌలర్లతో వేయించినా.. భారత్‌కు ఒక్క వికెట్‌ దక్కలేదు.

మంచి బంతులను ఆచితూచి ఆడిన పాక్‌ ఓపెనర్లు.. చెత్త బంతులపై మాత్రం నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డారు. భారత బౌలర్లు ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోవడంతో పాక్ ఓపెనర్లు ఆడుతూ పాడుతూ పరుగులు చేశారు. ఈ క్రమంలోనే ఇద్దరూ హాఫ్ సెంచరీలు బాదారు. దాంతో మరో 13 బంతులు మిగిలుండగానే పాక్ విజయాన్ని అందుకుంది.

Story first published: Tuesday, October 26, 2021, 9:15 [IST]
Other articles published on Oct 26, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+