For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Pakistan Playing XI: మాలిక్‌కు రెస్ట్.. హైదర్ అలీ డౌట్! అఫ్గానిస్థాన్‌తో బరిలోకి దిగే పాక్ తుది జట్టు ఇదే!

Pakistan Playing 11 vs Afghanistan T20 World Cup 2021: Shoaib Malik Rest And Haider Ali Dobut

దుబాయ్: టీ20 ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దుమ్మురేపుతున్న పాకిస్థాన్.. మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. శుక్రవారం అఫ్గానిస్థాన్‌తో దుబాయ్ వేదికగా రాత్రి జరిగే మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనుంది. పటిష్టమైన భారత్, న్యూజిలాండ్‌లను మట్టి కరిపించిన పాకిస్థాన్ రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. తమ కంటే బలహీనమైన అఫ్గాన్‌ను ఓడించి సెమీస్ అవకాశాలను మరింత సులువు చేసుకోవాలనే పట్టుదలతో ఆ జట్టు ఉంది. మరోవైపు స్కాట్లాండ్‌పై భారీ విజయాన్నందుకున్న అఫ్గానిస్థాన్.. పాక్‌కు షాకిచ్చి సెమీస్ రేసులో నిలవాలని భావిస్తోంది.

ప్రస్తుతం ఆ జట్టు సైతం బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ముస్తాఫిజుర్, రషీద్ ఖాన్ తమ స్పిన్‌తో దుమ్ములేపుతున్నారు. దాంతో ఈ మ్యాచ్‌ సైతం అభిమానులను అలరించనుంది. అయితే ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగే పాకిస్థాన్ తుది జట్టుపై ఓ లుక్కెద్దాం.

ఓపెనర్లుగా బాబర్ ఆజామ్, రిజ్వాన్..

ఓపెనర్లుగా బాబర్ ఆజామ్, రిజ్వాన్..

ఒకప్పుడు ఛేదన అంటేనే తడబడిపోయే, ఒత్తిడికి గురయ్యే జట్టుగా పాకిస్థాన్‌కు పేరుండేది. ఒకట్రెండు వికెట్లు పడ్డాయంటే మంచి స్థితి నుంచి ఒకేసారి కుప్పకూలిపోయి మ్యాచ్‌లు చేజార్చుకోవడం ఆ జట్టుకు అలవాటు. కానీ ఈ ప్రపంచకప్‌లో మాత్రం దీనికి భిన్నమైన దృశ్యాలు కనిపించాయి. భారత్‌పై 150 పైచిలుకు లక్ష్యాన్ని ఆ జట్టు వికెట్‌ కోల్పోకుండా ఛేదించడం అనూహ్యం.

భారత బౌలర్లు ఎంతగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసినా పాక్‌ ఓపెనర్లు లొంగలేదు. ఇక న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 69 పరుగులకే 4 కీలక వికెట్లు పడ్డా ఆ జట్టు కోలుకుంది. మాలిక్‌ అండతో అసిఫ్‌ అలీ చెలరేగి ఆడి జట్టును గెలిపించాడు. ఛేదనల్లో సమీకరణం తేలిగ్గా ఉన్నప్పటికీ ఒత్తిడికి గురై మ్యాచ్‌లు అప్పగించేసే జట్టు.. టపటపా వికెట్లు పడిపోయి, సాధించాల్సిన రన్‌రేట్‌ 9 దాటిపోయిన సమయంలో దృఢంగా నిలబడి మ్యాచ్‌ గెలవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

పాకిస్థాన్‌ ఆటలో ఈ మార్పుకు ప్రధాన కారణం కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ అన్నది విశ్లేషకుల మాట. బాబర్ అటు కెప్టెన్‌గా ఇటు ఓపెనర్‌గా జట్టును ముందుండి నడిపిస్తున్నారు. అతనికి అండగా మహమ్మద్ రిజ్వాన్ అదరగొడుతున్నాడు.

హైదర్ అలీ డౌట్..

హైదర్ అలీ డౌట్..

అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌కు సీనియర్ ప్లేయర్ అయిన షోయబ్ మాలిక్‌కు విశ్రాంతి ఇవ్వాలని భావిస్తే హైదర్ అలీకి తుది జట్టులో చోటు దక్కవచ్చు. అయితే విన్నింగ్ కాంబినేషన్‌ను మార్చే సాహసం బాబర్ ఆజామ్ చేయకపోవచ్చు. భారత్, పాక్‌పై అదే టీమ్‌ను కొనసాగించాడు. అదే జరిగితే హైదర్ అలీకి మళ్లీ నిరాశే ఎదురవుతోంది. అయితే సూపర్ ఫామ్‌లో ఉన్న బాబర్ ఆజామ్, మహమ్మద్ రిజ్వాన్.. అఫ్గాన్ స్పిన్ త్రయం రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, మహమ్మద్ నబీలను ఎలా ఆడుతుందనేది చూడాలి. స్కాట్లాండ్‌పై ముజీబ్, రషీద్ ఖాన్ దుమ్మురేపారు.

మిడిల్‌లో సీనియర్లు..

మిడిల్‌లో సీనియర్లు..

ఇక ఫస్ట్ డౌన్‌లో ఫఖర్ జమాన్‌ బరిలోకి దిగనున్నాడు. అయితే ఫఖర్ తన స్థాయికి తగిన ప్రదర్శన బాకీ ఉన్నాడు. ఆ తర్వాత నాలుగు, ఐదు స్థానాల్లో ఎంతో అనుభవం కలిగిన షోయబ్ మాలిక్, మహ్మద్ హఫీజ్‌ బరిలోకి దిగనున్నారు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో మాలిక్‌ తన ఫినిషర్ రోల్‌ను సమర్థవంతంగా నిర్వహించాడు.

ఆరో స్థానంలో అసిఫ్ అలీ బ్యాటింగ్ చేయవచ్చు. ఆల్‌రౌండర్ల కోటాలో ఇమాద్ వసీం, షాదాబ్ ఖాన్ బరిలోకి దిగనున్నారు. స్పిన్నర్లు అయిన ఈ ఇద్దరు యూఏఈ పిచ్‌లపై కీలకం కానున్నారు. హసన్ అలీ, షాహిన్ షా అఫ్రీదీ, హ్యారిస్ రౌఫ్‌తో పేస్ విభాగం పటిష్టంగా ఉంది. ఈ ముగ్గురు మంచి ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా అఫ్రిదీ, రౌఫ్ అదరగొడుతున్నారు.

 తుది జట్లు(అంచనా):

తుది జట్లు(అంచనా):

బాబార్ ఆజామ్(కెప్టెన్), మహమ్మద్ రిజ్వాన్, ఫకార్ జమాన్, మహమ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, అసిఫ్ అలీ, ఇమాద్ వసీం, షాదాబ్ ఖాన్, హసన్ అలీ, షాహిన్ షా అఫ్రిది, హ్యారిస్ రౌఫ్

అఫ్గానిస్థాన్

అఫ్గానిస్థాన్

హజ్రతుల్లా జాజై, మహమ్మద్ షాజాద్(కీపర్), రెహ్మానుల్లా గుర్బాజ్, అస్గర్ అఫ్గాన్, నజీబుల్లా జడ్రాన్, మహమ్మద్ నబీ(కెప్టెన్), గుల్బదిన్ నైబ్, రషీద్ ఖాన్, కరీమ్ జనత్, నవీన్ ఉల్ హక్, ముజీబ్ ఉర్ రెహ్మాన్

Story first published: Friday, October 29, 2021, 16:18 [IST]
Other articles published on Oct 29, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+