Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

U19 World Cup 2024: కన్నీటి పర్యంతమైన పాక్ ఆటగాళ్లు (వీడియో)

అండర్ 19 ప్రపంచకప్ 2024 సెమీఫైనల్లో పరాజయం ఎదురవ్వడంతో పాకిస్థాన్ ఆటగాళ్లు కన్నీటి పర్యంతమయ్యారు. ఆస్ట్రేలియా గురువారం ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఒక్క వికెట్ తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయంతో ఉబికి వస్తున్న దు:ఖాన్ని పాక్ కుర్రాళ్లు ఆపుకోలేకపోయారు. ఆటగాళ్లంతా మైదానంలో ఎక్కడికక్కడా అలానే కూర్చొని కన్నీటి పర్యంతమయ్యారు.

ఆసీస్ బ్యాటర్ కొట్టిన విన్నింగ్ షాట్‌ను ఆపేందుకు డైవ్ చేసి విఫలమైన ఉబైద్ షా.. అలానే నేలపై పడుకుండిపోయాడు. ప్రస్తుతం పాక్ ఆటగాళ్ల భావోద్వేగానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

 Pakistan players in tears after losing U19 World Cup 2024 semi final vs Australia

ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడినా.. అసాధారణ పోరాటాన్ని కనబర్చింది. 180 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునేందుకు అన్నివిధాల ప్రయత్నించింది. దురదృష్టవశాత్తు చివరి వికెట్ తీయలేక ఓటమికి తల ఒంచింది. మాక్ మిలన్(29 బంతుల్లో 2 ఫోర్లతో 19 నాటౌట్).. చివరి బ్యాటర్ కల్లమ్ వైడ్లర్‌(2 నాటౌట్) సాయంతో 17 పరుగులు జోడించి ఆసీస్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 48.5 ఓవర్లలో 179 పరుగులకు కుప్పకూలింది. పాకిస్థాన్ బ్యాటర్లలో అజాన్ అవైస్(91 బంతుల్లో 3 ఫోర్లతో 52), అరఫత్ మిన్‌హాస్(61 బంతుల్లో 9 ఫోర్లతో 52) హాఫ్ సెంచరీలతో రాణించగా.. మిగితా బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో టామ్ స్ట్రాకర్(6/24) ఆరు వికెట్ల‌తో పాకిస్థాన్ పతనాన్ని శాసించగా.. మహ్లీ బియర్డ్‌మన్, కల్లమ్ విడ్లేర్, రాఫ్ మెక్‌మిలాన్, టామ్‌ కాంప్‌బెల్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆసీస్ 49.1 ఓవర్లలో 9 వికెట్లకు 181 పరుగులు చేసి గెలుపొందింది. హారీ డిక్సన్(75 బంతుల్లో 5 ఫోర్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఓలివర్ పీక్(75 బంతుల్లో 3 ఫోర్లతో 49), మాక్ మిలన్(29 బంతుల్లో 2 ఫోర్లతో 19 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. పాకిస్థాన్ బౌలర్లలో అలీ రాజా నాలుగు వికెట్లు తీయగా.. అరఫత్ మిన్‌హాస్ రెండు వికెట్లు పడగొట్టాడు. నవీద్ అహ్మద్ ఖాన్, ఉబైద్ షా తలో వికెట్ తీసారు.

Story first published: Thursday, February 8, 2024, 22:05 [IST]
Other articles published on Feb 8, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+