క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన స్టార్ బౌలర్!!

కరాచీ: రెండు దశాబ్దాలపాటు పాకిస్తాన్ క్రికెట్‌కు ఎనలేని సేవలందించిన పేస్ బౌలర్ ఉమర్ గుల్ వీడ్కోలు పలికారు. 36ఏళ్ల గుల్ అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు శుక్రవారం ప్రకటించారు. పాకిస్తాన్ నేషనల్ టీ20 కప్‌లో గుల్ బలూచిస్తాన్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి బలూచిస్తాన్, సౌతర్న్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ అనంతరం గుల్ తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ మ్యాచ్‌లో పరాజయం పాలైన బలూచిస్తాన్ టోర్నీ నుంచి తప్పుకోగా.. పంజాబ్ జట్టు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది.

ఎంతో గర్వపడుతున్నా:
20 ఏళ్ల పాటు తనకు మద్దతుగా నిలిచి ఆదరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ ఉమర్ గుల్ మీడియా చాట్‌లో పేర్కొన్నారు. 'నా క్రికెట్ ప్రయాణాన్ని ఎంతో ఆస్వాదించాను. నా దేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు ఎంతో గర్వపడుతున్నాను. కృషి, సంకల్పం, నిబద్ధత, గౌరవ విలువలను నేను క్రికెట్ నుంచే నేర్చుకున్నాను. ఈ ప్రయాణంలో నాకు మద్దతు ఇచ్చి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను' అని గుల్ తెలిపారు.

అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు:
'నా అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇన్నేళ్ల నా క్రికెట్ ప్రయాణంలో వాళ్లే నాకు స్పూర్తి. వాళ్లు నాకోసం ఎంతో త్యాగం చేశారు. ఇక నుంచి నేను వాళ్లను మిస్ అవుతాను' అని గుల్ ఉద్వేగానికి గురయ్యారు. కొత్త ఆటగాళ్లకు దారి ఇచ్చేందుకు, గొప్ప జీవితాన్నిచ్చిన క్రికెట్‌కు మరిన్ని సేవలు చేసేందుకే వైదొలిగినట్టు ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్ క్రికెట్ మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని గుల్ ఆకాక్షించారు.

2003లో ఎంట్రీ:
2002 అండర్ 19 వరల్డ్‌కప్‌లో మెరిసిన ఉమర్ గుల్.. 2003లో పాకిస్తాన్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు. జింబాంబ్వేపై మ్యాచ్‌తో వన్డేల్లో అరంగేట్రం చేసిన గుల్.. అదే ఏడాది బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడారు. 2004లో భారత్-పాకిస్తాన్ లాహోర్ టెస్టులో ఐదు వికెట్లు తీసి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించారు. దాంతో పాకిస్తాన్ ముల్తాన్ టెస్టు సిరీస్‌ను డ్రా చేయగలిగింది. దశాబ్దం క్రితం టీ20 క్రికెట్‌లో ఉమర్ గుల్ నెంబర్ 1 బౌలర్‌గా కొనసాగారు.

2016లో చివరి మ్యాచ్:
పాకిస్థాన్ తరఫున మొత్తం 47 టెస్టు మ్యాచ్‌లాడిన 36ఏళ్ల ఉమర్ గుల్ 163 వికెట్లు తీశారు. 130 వన్డేల్లో 179 వికెట్లు, 60 టీ20 మ్యాచుల్లో 85 వికెట్లు పడగొట్టారు. ఇక ఐపీఎల్ 2008 సీజన్‌లోనూ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. 2016లో పాకిస్థాన్ తరఫున గుల్ చివరి టీ20 మ్యాచ్ ఆడారు.
ముంబై, ఢిల్లీ మధ్యే ఐపీఎల్ ఫైనల్.. ఆకాశ్ చోప్రా జోస్యం!! అరటిపండు తొక్క కనిపించడం లేదా అని సెటైర్!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications