ముంబై, ఢిల్లీ మధ్యే ఐపీఎల్ ఫైనల్.. అరటిపండు తొక్క కనిపించడం లేదా అని మాజీ క్రికెటర్ సెటైర్!!

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు వరుస విజయాలతో దూసుకెళ్తోన్న విషయం తెలిసిందే. 8 మ్యాచులు ఆడి.. ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో 12 పాయింట్లతో ఈ రెండు జట్లు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో అబుదాబి వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో విజయాన్ని అందుకున్న ముంబై.. మెరుగైన నెట్ రన్‌రేట్ సాయంతో ఢిల్లీని వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ప్లే ఆఫ్ రేసులో ముంబై, ఢిల్లీలు ముందున్నాయి.

టాప్-2లో ముంబై, ఢిల్లీ:
ముంబై, ఢిల్లీలు టాప్-2లో ఉండగా.. రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 మ్యాచులు ఆడి.. 5 విజయాలు అందుకుని 10 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. కోల్‌కతా నైట్ రైడర్స్ 8 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు 8 పాయింట్లతో.. తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 4 పాయింట్లతో అట్టడుగున ఉంది. బెంగళూరుపై 8 వికెట్ల తేడాతో గురువారం గెలిచిన పంజాబ్ తన ప్లేఆఫ్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంది. ఇంక పంజాబ్ ఒక్క మ్యాచ్ ఓడినా.. ఇంటికి పయనమవ్వాల్సిందే.

ముంబై, ఢిల్లీ మధ్యే ఫైనల్:
ఐపీఎల్ 2020లో ఇప్పటివరకు ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు నువ్వా నేనా అన్నట్టు పాయింట్ల పట్టికలో పోటీపడుతున్నాయి. ఒకరోజు ముంబై అగ్రస్థానంలో ఉంటే.. మరోరోజు ఢిల్లీ ఉంటుంది. ప్రస్తుతం ఈ జట్ల ఆటతీరును పరిశీలిస్తే.. ఈ రెండు జట్ల మధ్యే ఫైనల్ జరిగేలా కనిపిస్తోంది. టీమిండియా మాజీ క్రికెటర్, క్రికెట్ కామెంటేటర్ ఆకాశో చోప్రా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశాడు.

అరటి పండు తొక్క కనిపించడం లేదా:
ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మద్యే ఐపీఎల్ 2020 ఫైనల్ జరుగుతుందా? అని కామెంటేటర్ ఆకాశో చోప్రా ట్వీట్ చేశారు. 'మనం ముంబై, ఢిల్లీ జట్ల మధ్యే ఐపీఎల్ 2020 ఫైనల్స్ చూడవచ్చేమో' అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. ఆకాశ్ చోప్రా ట్వీట్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కోచ్ టామ్ మూడీ స్పందించాడు. 'నీకు అరటి పండు తొక్క కనిపించడం లేదా?' అని ట్వీట్ చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్‌ను పరోక్షంగా ప్రస్తావిస్తూ మూడీ ట్వీటాడు. ఫైనల్ చేరే జట్లలో చెన్నై కూడా ఉంటుందని మూడీ చెప్పకనే చెప్పాడు. అయితే చెన్నై మాత్రం 8 మ్యాచులలో కేవలం మూడు విజయాలు మాత్రమే అందుకోవడం విశేషం.

చెన్నై ఓడిపోతే:
ఈరోజు రాజస్థాన్, బెంగళూరు జట్ల మధ్య దుబాయ్ వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకి మొదటి మ్యాచ్ ఉంది. ఆ తర్వాత ఢిల్లీ, చెన్నై జట్ల మధ్య షార్జా వేదికగా రెండో మ్యాచ్ జరగనుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో చెన్నై ఓడిపోతే.. పాయింట్ల పట్టికలో ఆరు నుంచి ఏడుకి పడిపోయే అవకాశం ఉంది. ఇక ఢిల్లీ గెలిస్తే పట్టికలో మళ్లీ నెం.1 స్థానాన్ని దక్కించుకుంటుంది.
టేబుల్ టాపర్ అయినా.. ఇప్పటి వరకు ఢిల్లీ క్యాపిటల్స్ సరైన ఆట ఆడలేదు: పాంటింగ్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications