న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స‌చిన్ టెండూల్క‌ర్‌తో పోల్చ‌కండి : పాక్ క్రికెటర్

Pakistan opener Abid Ali Says Tendulkar is my inspiration

ఇస్లామాబాద్ : టీమిండియా దిగ్గజ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అంటే ఇష్టపడని వారేవరూ ఉండరు. కేవలం భారత్‌లోనే కాకుండా సచిన్‌కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.

India vs New Zealand: సూపర్ ఓవర్‌లో సంజూ శాంసన్‌ను పంపించాలనుకున్నాం.. కానీIndia vs New Zealand: సూపర్ ఓవర్‌లో సంజూ శాంసన్‌ను పంపించాలనుకున్నాం.. కానీ

దాయదీ దేశం పాకిస్థాన్‌లో కూడా చాలా మంది సచిన్‌ను ఆరాధిస్తారు. ఇక ఆ దేశ సీనియర్ క్రికెటర్ అబిద్ అలీ సైతం సచిన్ తన ఆరాధ్య క్రికెట‌ర్‌గా భావిస్తాడు. ఇక సచిన్ స్టైల్‌ను అనుకరించే అబిద్ కూడా అంతే ఎత్తు ఉండటంతో అందరూ అతన్ని పాకిస్థాన్ సచిన్ అని పిలుస్తుంటారు.

అయితే అబీద్ అలీ మాత్రం తనను దిగ్గజ ప్లేయర్ అయిన సచిన్‌తో పోల్చవద్దంటున్నాడు. సచిన్ తన ఆరాధ్య క్రికెటరని, త‌న కెరీర్ ప్రారంభం నుంచి కూడా స‌చిన్ వీడియోలు చూస్తున్నాన‌ని, అతని శైలిని అనుక‌రించేవాడిన‌ని ఈ పాక్ క్రికెటర్ చెప్పుకొచ్చాడు. ఇక అరంగేట్ర టెస్ట్, వన్డేల్లో సెంచరీ చేసిన తొలి ప్లేయర్‌గా అబిద్ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.

India vs New Zealand 4th T20I: మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అదే !!India vs New Zealand 4th T20I: మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అదే !!

'సచిన్ ఓ గొప్ప బ్యాట్స్‌మన్. అందుకే అతని బ్యాటింగ్ స్టైల్‌ను అందిపుచ్చుకోవాలనుకుంటున్నా. అతని వీడియోలు చూస్తునే నేర్చుకున్నా.'అని అబిద్ అలీ చెప్పుకొచ్చాడు. ఇక త‌న ఎత్తు స‌చిన్ అంతే ఉంటుంద‌ని, అందుకే స‌చిన్ బ్యాటింగ్ స్టైల్‌ను అనుక‌రిస్తున్న‌ట్లు తెలిపాడు. స‌చిన్‌‌కు సంబంధించిన మంచి టెక్నిక్స్‌‌ను తాను పాటిస్తున్నాని, అంతమాత్రాన త‌నను పాకిస్థాన్ సచిన్‌గా పిలవడం స‌రికాద‌న్నాడు. స‌చిన్‌తోపాటు ఎంతోమంది లెజెండరీ క్రికెటర్ల బ్యాటింగ్ చూస్తూ పెరిగాన‌ని తెలిపాడు.

వచ్చేనెల‌లో రావ‌ల్పిండిలో బంగ్లాదేశ్‌తో పాకిస్తాన్ టెస్టు సిరీస్ ఆడ‌నుంది. ఈ సిరీస్ తొలి మ్యాచ్‌లో మ‌రో శ‌త‌కం బాదితే, వ‌రుస‌గా మూడు టెస్టుల్లో సెంచ‌రీ చేసిన ప్లేయ‌ర్‌గా భార‌త మాజీ కెప్టెన్ మ‌హ్మ‌ద్ అజారుద్దీన్ నెల‌కొల్పిన ప్ర‌పంచ రికార్డును అబీద్ అలీ స‌మం చేస్తాడు. 1984-85 సిరీస్‌లో అజార్ ఈ రికార్డును ఇంగ్లండ్‌పై న‌మోదు చేశాడు.

Story first published: Friday, January 31, 2020, 22:09 [IST]
Other articles published on Jan 31, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X