For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20ల్లో పాకిస్తాన్ అత్యధిక స్కోర్.. రికార్డు సెంచరీతో లివింగ్‌స్టోన్‌ పోరాడినా ఇంగ్లండ్‌కు తప్పని ఓటమి!!

Pakistan Makes Highest T20 Score And Makes Clean Win on England

నాటింగ్‌హమ్‌: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో ఎదురైన పరాభవానికి పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంది. ముందుగా బ్యాటింగ్‌లో, ఆపై బౌలింగ్‌లో సత్తాచాటిన పాక్.. తొలి టీ20 మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. శుక్రవారం నాటింగ్‌హమ్‌ ట్రెంట్‌ బ్రిడ్జ్‌లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌పై పాకిస్థాన్‌ 31 పరుగుల తేడాతో గెలిచింది.

టీ20 ఫార్మాట్‌లో పాకిస్తాన్ (232/6) అత్యధిక స్కోర్ నమోదు చేసింది. అంతకుముందు పాక్ అత్యధిక స్కోర్ 205/3. ఇక ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్‌ లియామ్‌ లివింగ్‌స్టోన్‌ ఇంగ్లండ్ తరఫున వేగవంతమైన సెంచరీ చేశాడు. 42 బంతుల్లో సెంచరీ చేశాడు. అంతేకాదు 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి రికార్డు నెలకొల్పాడు.

చెలరేగిన రిజ్వాన్‌, అజామ్‌

చెలరేగిన రిజ్వాన్‌, అజామ్‌

ట్రెంట్‌ బ్రిడ్జ్‌లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 232 పరుగులు చేసింది. ఓపెనర్లు బాబర్‌ అజామ్‌ 49 బంతుల్లో 85 పరుగులు, రిజ్వాన్‌ 41 బంతుల్లో 63 పరుగులు చేశారు. ఈ జోడి తొలి వికెట్‌కు ఏకంగా 150 పరుగులు జోడించారు. ఇంగ్లీష్ బౌలర్లను పాక్ ఓపెనర్లు ఓ ఆటాడుకున్నారు.

ఇద్దరూ బౌండరీల మోత మోగించారు. ఆపై ఇద్దరూ కొద్ది వ్యవధిలో పెవిలియన్ చేరినా.. ఫకర్ జమాన్ (26), మొహ్మద్ హఫీజ్ (24) కూడా చెలరేగడంతో పాక్ భారీ స్కోర్ చేసింది. ఇంగ్లండ్ బౌలర్లు ప్రతి ఒక్కరు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. టామ్ కరన్ రెండు వికెట్లు తీశాడు.

42 బంతుల్లో సెంచరీ

42 బంతుల్లో సెంచరీ

అనంతరం బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌.. ఏడు ఓవర్లకే నాలుగు వికెట్లు కోల్పోయి మ్యాచ్‌పై ఆశలు వదిలేసుకుంది. డేవిడ్ మలన్ (1), జానీ బెయిరిస్టో (11), మొయిన్ అలీ (1), ఇయాన్ మోర్గాన్ (16) పూర్తిగా విఫలమయ్యారు. అయితే మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ లియామ్‌ లివింగ్‌స్టోన్‌ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ శిబిరంలో ఆశలు రేపాడు.

42 బంతుల్లో సెంచరీ చేయడంతో పాటు.. సిక్స్‌ ద్వారా టీ20ల్లో ఫాసెస్ట్‌ సెంచరీ సాధించిన ఇంగ్లీష్‌ బ్యాట్స్‌మన్‌ ఘనతకు తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి మరో రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లండ్ తరఫున ఫాసెస్ట్‌ హాఫ్ సెంచరీని కూడా నమోదుచేశాడు.

కృనాల్ పాండ్యాతో గొడవ.. సాహసోపేత నిర్ణయం తీసుకున్న దీపక్​ హుడా​!!

భారీ షాట్‌కు ​ప్రయత్నించి

భారీ షాట్‌కు ​ప్రయత్నించి

సెంచరీ చేసిన తర్వాతి బంతికే (17వ ఓవర్‌లో) లియామ్‌ లివింగ్‌స్టోన్‌ భారీ షాట్‌కు ​ప్రయత్నించి అవుట్‌ అయ్యాడు. షాబాద్ ఖాన్ బౌలింగ్‌లో షహీన్ ఆఫ్రిది అద్భుత క్యాచ్ అందుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ విజయావకాశాలు సన్నగిల్లాయి. తర్వాతి బ్యాట్స్‌మ్యాన్‌ టామ్ కరన్, డేవిడ్ విల్లి, మాథ్యూ పార్కిన్సన్ చేతులెత్తేయడంతో మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే 201 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది ఇంగ్లండ్‌. దీంతో పాక్ ఘన విజయం సాధించింది. 3-0 వన్డే సిరీస్‌ అవమానకరైమన ఓటమికి కొంతలో కొంత పాక్‌ ప్రతీకారం తీర్చుకున్నట్లు అయ్యింది. వీరోచితంగా పోరాడిన లియామ్‌ను ఇంగ్లండ్‌ మాజీ దిగ్గజాలతో పాటు పలువురు మెచ్చుకుంటున్నారు.

Story first published: Saturday, July 17, 2021, 10:38 [IST]
Other articles published on Jul 17, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+