Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కృనాల్ పాండ్యాతో గొడవ.. సాహసోపేత నిర్ణయం తీసుకున్న దీపక్​ హుడా​!!

Deepak Hooda has decided to leave Baroda, to play for Rajasthan.

బరోడా: టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్, బరోడా టీమ్ వైస్ కెప్టెన్ దీప‌క్ హుడా సాహసోపేత నిర్ణయం తీసుకున్నాడు. సుదీర్ఘకాలంగా దేశవాళీ క్రికెట్​లో బరోడా జట్టుకు ఆడిన హుడా.. ఆ టీమ్​కు గుడ్ బై చెప్పాడు. బరోడా క్రికెట్​ అసోసియేషన్​ (బీసీఏ) నుంచి అతడు అభ్యంతర పత్రం (నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్) కూడా తీసుకున్నాడు. దీప‌క్ హుడా వచ్చే సీజన్​లో రాజస్థాన్​ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా ప్రకటించాడు. బరోడా టీమ్​కు అతడు వీడ్కోలు పలకడానికి అసలు కారణం ఆ జట్టు కెప్టెన్ కృనాల్ పాండ్యాతో జరిగిన గొడవే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

స్పోర్ట్‌ స్టార్‌తో దీప‌క్ హుడా మాట్లాడుతూ బరోడా టీమ్​కు గుడ్ బై చెప్పడంపై స్పందించాడు. 'సుదీర్ఘకాలంగా ఆడిన బరోడా జట్టును వీడడం చాలా బాధగా ఉంది. కానీ ఇదే సరైన నిర్ణయమని భావిస్తున్నాను. నా కోచ్​లు శ్రేయోభిలాషులుతో కూడా ఈ విషయమై చర్చించాను. అన్ని చూసుకునే ఈ నిర్ణయం తీసుకున్నా' అని దీప‌క్ హుడా తెలిపాడు. 2013 నుంచి బరోడా జట్టుకి ఆడుతున్న దీపక్.. ఇప్పటి వరకూ 46 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లాడి 2908 పరుగులు చేశాడు. 68 లిస్ట్-ఎ గేమ్స్, 131 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

ఈ ఏడాది జనవరి 10 నుంచి ముస్తాక్ అలీ ట్రోఫీ ప్రారంభం అయింది. మొదటి మ్యాచ్‌కి ముందు బరోడా టీమ్ కెప్టెన్ కృనాల్ పాండ్యాతో గొడవపడిన దీపక్ హుడా.. అసోషియేషన్‌ అనుమతి తీసుకోకుండా జట్టును వీడాడు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బయో-బబుల్ వాతావరణంలో ట్రోఫీని బీసీసీఐ నిర్వహించగా.. క్రికెటర్ ముందస్తు అనుమతి లేకుండా బబుల్ నుంచి వెలుపలికి వెళ్లడానికి వీల్లేదు. టీమ్‌ని వీడిన తర్వాత పాండ్యాపై పెద్ద ఎత్తున హుడా ఆరోపణలు చేశాడు. టీమ్ మీటింగ్‌లో అందరి ముందు ఉద్దేశపూర్వకంగానే తనని కృనాల్ దూషించాడని, తన కెరీర్‌లో ఏ కెప్టెన్ నుంచి కూడా ఈ తరహా వేధింపులు ఎదుర్కోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.

కృనాల్ పాండ్యా-దీపక్ హుడా వివాదంపై టీమ్ మేనేజర్‌ని బరోడా క్రికెట్ అసోషియేషన్ పూర్తి స్థాయిలో రిపోర్ట్‌ని కోరింది. హుడా వివాదంపై పూర్తి స్థాయిలో తాజాగా విచారణ జరిపిన బరోడా క్రికెట్ అసోషియేషన్ అఫెక్స్ కౌన్సిల్.. అతడు క్రమశిక్షణ తప్పాడని స్పష్టం చేసింది. దాంతో అతనిపై నిషేధం పడింది. ఐపీఎల్ 2021 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కి ఆడిన హుడా 143.20 స్ట్రైక్‌రేట్‌తో 116 పరుగులు చేశాడు. ఇందులో రెండు గెలిపించే ఇన్నింగ్స్‌లు కూడా ఉన్నాయి. ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లు యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి ప్రారంభంకానుండగా.. అందుకో అతడు ఆడనున్నాడు.

Story first published: Thursday, July 15, 2021, 22:46 [IST]
Other articles published on Jul 15, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+