Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

AUS vs PAK: 9 పరుగులకే 5 వికెట్లు!

ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మూడో టెస్ట్‌ రసవత్తరంగా మారింది. 14 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లకు 68 పరుగులు చేసింది. 9 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హజెల్ వుడ్(4/9) నిప్పులు చెరగడంతో పాకిస్థాన్ టాపార్డర్ కుప్పకూలింది. ఓపెనర్ సయీమ్ ఆయుబ్(53 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 33), బాబర్ ఆజామ్(52 బంతుల్లో ఫోర్‌తో 23) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. నలుగురు బ్యాటర్లు డకౌటయ్యారు. హజెల్ వుడ్‌కు తోడుగా మిచెల్ స్టార్క్, నాథన్ లయన్, ట్రావిస్ హెడ్ తలో వికెట్ తీసారు. ప్రస్తుతం పాకిస్థాన్ 82 పరుగుల ఆధిక్యంలో ఉంది.

 Pakistan losing 5 wickets for 9 runs in AUS vs PAK 3rd Test

అంతకుముందు 116/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 109.4 ఓవర్లలో 299 పరుగులకు ఆలౌటైంది. మార్నస్ లబుషేన్(147 బంతుల్లో 6 ఫోర్లతో 60), మిచెల్ మార్ష్(113 బంతుల్లో 6 ఫోర్లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించారు. పాకిస్థాన్ బౌలర్లలో ఆమిర్ జమాల్(6/69) ఆరు వికెట్లు తీయగా.. సాజిద్ ఖాన్, మిర్ హమ్‌జా తలో వికెట్ తీసారు. అఘా సల్మాన్‌కు రెండు వికెట్లు దక్కాయి.

14 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్థాన్‌‌కు మిచెల్ స్టార్క్ షాకిచ్చాడు. తొలి ఓవర్‌లోనే ఓపెనర్ అబ్దుల్లా షఫీక్(0)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ మరుసటి ఓవర్‌లోనే షాన్ మసూద్‌(0)ను హజెల్ వుడ్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో పాకిస్థాన్ ఒక్క పరుగుకే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఈ పరిస్థితుల్లో సయీమ్ ఆయుబ్, బాబర్ ఆజామ్ ఆచితూచి ఆడే ప్రయత్నం చేశారు. మూడో వికెట్‌కు 56 పరుగులు జోడించిన అనంతరం సయీమ్ ఆయుబ్‌ను లయన్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. ఆ వెంటనే బాబర్ ఆజామ్‌ను ట్రావిస్ హెడ్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చడంతో పాకిస్థాన్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన సౌద్ షకీల్(2), సాజిద్ ఖాన్(0), అఘా సల్మాన్(0)లు వరుసగా పెవిలియన్ చేరారు.

Story first published: Friday, January 5, 2024, 15:53 [IST]
Other articles published on Jan 5, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+