Hasan Aliపై ఫిక్సింగ్ ఆరోపణలు! భారత్‌కు చెందిన అతని భార్యపై పాక్ ఫ్యాన్స్ ఫైర్!

దుబాయ్: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ నిష్క్రమణకు కారణమైన ఆ జట్టు ఆల్‌రౌండర్ హసన్ అలీ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. డబ్బులకు అమ్ముడుపోయిన హసన్ అలీ జట్టు పరాజయానికి కారణమయ్యాడని పాక్ అభిమానులు ఆరోపిస్తున్నారు. ఆస్ట్రేలియాతో గురువారం జరిగిన సెమీఫైనల్-2 మ్యాచ్‌లో పాకిస్థాన్ ఐదు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మ్యాచ్ ఆసాంతం ఆధిపత్యం చెలాయించిన పాక్.. చివరి రెండు ఓవర్లలో పట్టు సడలించి మూల్యం చెల్లించుకుంది. ముఖ్యంగా మాథ్యూ వేడ్ ఇచ్చిన క్యాచ్‌ను హసన్ అలీ నేలపాలు చేయడం పాక్ కొంపముంచింది.
హసన్ అలీపై సందేహాలు..
అచ్చం న్యూజిలాండ్-ఇంగ్లండ్ సెమీస్‌ను తలపిస్తూ సాగిన పోరులో కివీస్ మాదిరిగానే ఆసీస్ మయా చేసింది. మాథ్యూ వేడ్(17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 41 నాటౌట్), మార్కస్ స్టోయినీస్(31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 నాటౌట్) వీరిచిత బ్యాటింగ్‌తో అద్భుత విజయాన్నందుకొని ఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే ఈ మ్యాచ్‌లో హసన్ అలీ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో దారుణంగా విఫలమయ్యాడు. ముఖ్యంగా అతను వేసిన 18వ ఓవర్‌లో మాథ్యూ వేడ్ ఓ భారీ సిక్సర్‌తో పాటు బౌండరీ బాదడంతో మ్యాచ్ మూమెంటమ్ మారింది. మ్యాచ్‌పై మరింత పట్టి బిగించిన ఆసీస్ సునాయస విజయాన్నందుకుంది.
మూడు విభాగాల్లో విఫలం..
అయితే ఈ మూడు విభాగాల్లో విఫలమైన హసన్ అలీపై అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాటింగ్‌లో ఫస్ట్ బాల్‌కే క్యాచ్ ఔటై గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన అతను.. బౌలింగ్‌లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. ఇక టోర్నీ ఆసాంతం అదరగొట్టిన అతను ఇలా కీలక మ్యాచ్‌లో కావాలనే విఫలమయ్యాడని పాక్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. పైగా అతని సతీమణి భారత్‌కు చెందిన వ్యక్తని, ఫిక్సింగ్‌లో ఆమె పాత్ర కూడా ఉండవచ్చంటున్నారు. ప్రస్తుతం ఈ ఆరోపణలు పాక్ క్రికెట్‌లో దుమారం రేపుతున్నాయి. పాక్ బాబర్ ఆజామ్.. హసన్ అలీకి అండగా నిలిచినా.. అభిమానులు మాత్రం అతన్ని విలన్‌లా చూస్తున్నారు.

అతని భార్యే కారణమంటూ..
ఈ ఓటమిని సహించన పాక్ అభిమానులు.. హసన్ అలీ కుటుంబ సభ్యులను కూడా విడిచిపెట్టడం లేదు. ముఖ్యంగా అతని సతీమణి సమియా అర్జూ భారత్ కావడంతో పాక్ అభిమానులు ఆమెను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్‌కు దిగుతున్నారు. జుగుప్సాకరమైన కామెంట్స్ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్‌ను కొంతమంది భారత అభిమానులు తిప్పికొడుతున్నారు. హసన్ అలీ చేసిన తప్పిదానికి అతని ఫ్యామిలీని ట్రోల్ చేయడం ఏ మాత్రం సమంజసం కాదని కామెంట్ చేస్తున్నారు. ఇక హర్యానుకు చెందిన సమియా అర్జును హసన్ అలీ 2019లో దుబాయ్‌లో పెళ్లిచేసుకున్నాడు.

ఆసీస్‌లో నయా ఫినిషర్..
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 176 పరుగులు చేసింది. మహమ్మద్ రిజ్వాన్(52 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 67), ఫకార్ జమాన్(29 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 55 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. కెప్టెన్ బాబర్ ఆజామ్(34 బంతుల్లో 5 ఫోర్లతో 39) పర్వాలేదనిపించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ రెండు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, ఆడమ్ జంపా తలో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం 177 పరుగుల లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా 19 ఓవర్లలోనే 5 వికెట్లకు 177 పరుగులు చేసి 6 బంతులుండగానే విజయాన్నందుకుంది. మాథ్యూ వేడ్, మార్కస్ స్టోయినిస్‌లకు అండగా డేవిడ్ వార్నర్(30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 49), మిచెల్ మార్ష్(22 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 28) రాణించారు. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ నాలుగు వికెట్లు తీయగా.. షాహిన్ షా ఓ వికెట్ దక్కించుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications