T20 World Cup 2022: భారత్ అంటే వణికిపోతున్న పాక్ ఫ్యాన్స్.. ఇంగ్లండ్ గెలవాలంటూ ప్రార్థనలు!

హైదరాబాద్: భారత అభిమానులు కోరుకున్నట్లుగానే పాకిస్థాన్ జట్టు టీ20 ప్రపంచకప్ 2022 ఫైనల్ చేరింది. బుధవారం ఏకపక్షంగా సాగిన తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ను 7 వికెట్ల తేడాతో పాక్ చిత్తు చేసింది. దాంతో మరోసారి భారత్-పాక్ మ్యాచ్ చూసే అవకాశం అభిమానులకు రానుంది.
నెదర్లాండ్స్ పుణ్యమా.. అనూహ్యంగా సెమీ ఫైనల్ చేరిన పాక్.. ఈ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకుంది. అసాధారణ ఆటతీరుతో టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. గురువారం జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై భారత్ విజయం సాధిస్తే.. ఫైనల్లో మరోసారి దాయాదుల పోరు చూడవచ్చని క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు. కానీ పాక్ ఫ్యాన్స్ మాత్రం ఇంగ్లండ్ ఫైనల్ రావాలని కోరుకుంటున్నారు.
భారత్ గెలవద్దంటూ..
భారత్ ఫైనల్ చేరితో తమ జట్టు టైటిల్ గెలవలేదని పాక్ ఫ్యాన్స్ భయపడుతున్నారు. మెగా టోర్నీల్లో భారత్‌పై పాక్ మంచి రికార్డు లేకపోవడంతో పాటు ఒత్తిడికి పాక్ ఆటగాళ్లు చిత్తవుతారనే ఆందోళన వారిలో నెలకొంది. అంతేకాకుండా ఈ టోర్నీ ఆరంభంలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ ఓటమిపాలైంది. సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ విరోచిత బ్యాటింగ్‌తో ఒత్తిడికి గురైన పాక్ ఆటగాళ్లు అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నారు. ఈ ఫలితం నేపథ్యంలోనే భారత్ ఫైనల్ చేరవద్దని పాక్ ఫ్యాన్స్ ప్రార్థనలు చేస్తున్నారు.
1992 రిపీట్ అంటూ..
సోషల్ మీడియా వేదికగా కూడా గురువారం జరిగే సెమీ ఫైనల్లో భారత్ ఓడిపోతుందని జోస్యం చెబుతున్నారు. పాక్ అభిమానులే కాదు.. ఆ దేశ మాజీ ఆటగాళ్లు సైతం భారత్ ఓడిపోతుందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక 1992 వన్డే ప్రపంచకప్ ఫలితం రిపీట్ అవుతుందని మరికొంతమంది ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 1992 ప్రపంచకప్ ఆస్ట్రేలియా వేదికగా జరగడం, అప్పుడు కూడా ఆతిథ్య ఆసీస్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి సెమీఫైనల్ చేరకుండా వెనుదిరగడం.. ఇప్పటిలానే ఆ టోర్నీ సెమీ ఫైనల్‌కు ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాక్ చేరుకోవడం అప్పటి పరిస్థితులను తలపిస్తున్నాయి. అంతేకాకుండా అప్పటిలానే ఇప్పుడు కూడా సెమీస్‌లో పాక్.. న్యూజిలాండ్‌ను ఓడించి ఫైనల్ చేరడం పాక్ అభిమానుల సంతోసాన్ని రెట్టింపు చేస్తోంది.
మళ్లీ భారత్-పాక్ ఫైనల్..?
ఇక 1992 ప్రపంచకప్ ఫైనల్లో పాక్.. ఇంగ్లండ్‌ను ఓడించి తొలిసారి ప్రపంచకప్‌ను అందుకుంది. దాంతోనే మళ్లీ ఇంగ్లండ్ ఫైనల్ రావాలని పాక్ అభిమానులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే గురువారం జరిగే రెండో సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో భారత్ ఓడాలని ఆశిస్తున్నారు. మరోవైపు భారత్ అభిమానులు మాత్రం.. 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్ రిపీట్ కావాలని కోరుకుంటున్నారు. ఆ టోర్నీ ఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించిన భారత్ విశ్వవిజేతగా నిలిచింది. ప్రారంభ మ్యాచ్‌లోనూ బౌలౌట్ పద్దతిన విజయం సాధించింది. ఈ సారి కూడా తొలి మ్యాచ్‌లో గెలిచిన భారత్... ఫైనల్లో పాక్‌ను ఓడిస్తుందని ఇండియా ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications