Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

శుభ్‌మన్ గిల్‌‌‌ ముందు పాక్ అభిమాని చిల్లర చేష్టలు!(వీడియో)

టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ముందు ఓ అభిమాని చిల్లర చేష్టలకు పాల్పడ్డాడు. బుధవారం అడిలైడ్‌ వీధుల్లో చోటు చేసుకున్న ఈ ఘటన నెట్టింట చర్చనీయాంశమైంది. మూడు వన్డేల సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీమిండియా.. అడిలైడ్ వేదికగా గురువారం జరగనున్న రెండో వన్డేకు సన్నదమైంది. బుధవారం ఆప్షనల్ ట్రైనింగ్ సెషన్ కావడంతో కొందర ఆటగాళ్లు అడిలైడ్ వీధుల్లో షికారు చేశారు. శుభ్‌మన్ గిల్ కూడా హర్షిత్ రాణాతో కలిసి బయటకు వెళ్లాడు.

ఈ సందర్భంగా ఓ క్రికెట్ అభిమాని.. శుభ్‌మన్ గిల్‌కు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అయితే సదరు ఫ్యాన్ పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తి అని తెలియని శుభ్‌మన్ గిల్ కరచాలనం చేశాడు. ఆ వెంటనే సదరు పాక్ ఫ్యాన్ తన దుర్భుద్దిని బయటపెట్టుకున్నాడు. పాకిస్థాన్ జిందాబాద్ అంటూ గట్టిగా నినాదాలు చేశాడు. శుభ్‌మన్ గిల్ మాత్రం ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా ముందుకుసాగిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు సదరు అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Pakistan Fan Misbehaves with India Captain Shubman Gill in Adelaide Watch Video

అభిమాని ఎవరా? అనేది చూడకుండా గిల్ హుందాగా కరచాలనం చేశాడని, కానీ అతను మాత్రం చిల్లర చేష్టలతో పరువు తీసుకున్నాడని మండిపడుతున్నారు. పాకిస్థాన్ సాధించిన అదిపెద్ద అచీవ్‌మెంట్ ఇదేనని ఎద్దేవా చేస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ ఘటనల నేపథ్యంలో ఆసియా కప్ 2025 సందర్భంగా భారత ఆటగాళ్లు.. పాకిస్థాన్ ప్లేయర్లతో కరచాలనం చేయని సంగతి తెలిసిందే.

ఆసియా కప్ 2025 విజేతగా నిలిచిన తర్వాత కూడా పీసీబీ ఛైర్మన్ మోహ్‌సిన్ నఖ్వీ చేతుల మీదుగా టైటిల్ అందుకోలేదు. ఇప్పటికీ ఆ టైటిల్ మోహ్‌సిన్ నఖ్వీ దగ్గరే ఉంది. ఈ క్రమంలోనే సదరు అభిమాని భారత ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చి గొప్ప ఘనతగా చెప్పుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఈ చర్యతో తాను నవ్వుల పాలయ్యాననే విషయాన్ని గ్రహించలేకపోయాడు. ఆస్ట్రేలియా పర్యటనను ఓటమితో ప్రారంభించిన టీమిండియా.. మరికాసేపట్లో ప్రారంభమయ్యే రెండో వన్డేలో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.

Story first published: Thursday, October 23, 2025, 8:18 [IST]
Other articles published on Oct 23, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+