For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అక్తర్‌ ఎప్పుడూ అలాంటి కలలే కంటూ ఉంటాడు.. అతడు వాస్తవంలో బతకాలి! ఆసిఫ్‌ చురకలు!

Pakistan Ex player Mohammad Asif slams Shoaib Akhtar over 2007 dressing room episode

కరాచీ: పాకిస్తాన్ మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌ కనడం మానేయాలని ఆ జట్టు మాజీ బౌలర్‌ మహ్మద్‌ ఆసిఫ్‌ చురకలు అంటించాడు. చీఫ్‌ సెలక్టర్‌, హెడ్‌ కోచ్‌, పీసీబీ చైర్మన్‌ అవుతానంటూ అక్తర్‌ కనడం మానేసి.. వాస్తవంలో బతకాలి అని సూచించాడు. సమయం వృథా చేసే బదులు వర్ధమాన క్రికెటర్లకు తన వంతు సాయం చేస్తే బాగుంటుందని ఆసిఫ్‌ హితవు పలికాడు. దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌లో అక్తర్‌, ఆసిఫ్‌ మధ్య గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సమయం వచ్చినప్పుడల్లా పాక్ మాజీలు స్పందిస్తూనే ఉన్నారు.

ఆసిఫ్‌ను బ్యాట్‌తో కొట్టాడు

ఆసిఫ్‌ను బ్యాట్‌తో కొట్టాడు

దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌ ప్రారంభానికి ముందు పాకిస్తాన్ బౌలర్లు షోయబ్‌ అక్తర్‌, మహ్మద్‌ ఆసిఫ్‌ల మధ్య డ్రెస్సింగ్‌ రూంలో గొడవ జరిగిన సంగతి తెలిసిందే. షాహిద్‌ ఆఫ్రిది, మొహ్మద్ ఆసిప్‌ మాట్లాడుకుంటుండగా అక్కడికి వచ్చిన అక్తర్‌.. తన గురించే మాట్లాడుకుంటూ నవ్వుతున్నారని భావించి వారితో వాగ్వాదానికి దిగాడు.

ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ క్రమంలో ఆవేశానికి గురైన అక్తర్.. ఆసిఫ్‌ను బ్యాట్‌తో కొట్టాడు. దీంతో అతడి తొడకు గాయమైంది. ఈ వివాదం యావత్‌ క్రికెట్‌ ప్రపంచాన్నే కుదిపేసింది. పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు అక్తర్‌ను టీ20 ప్రపంచకప్‌ నుంచి తప్పిస్తూ స్వదేశానికి పిలిపించింది.

అక్తర్ క్షమాపణ కోరడంతో

అక్తర్ క్షమాపణ కోరడంతో

ఆపై మహ్మద్‌ ఆసిఫ్‌ను అక్తర్ క్షమాపణ కోరడంతో ఆ వివాదం తాత్కాలికంగా ముగిసిపోయింది. కానీ ఇప్పటికి కూడా దీనికి సంబంధించిన చర్చ జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో ఇటీవల పాక్ మాజీ కెప్టెన్ షాహిద్‌ ఆఫ్రిది ఈ విషయం గురించి మాట్లాడాడు. తాను జోక్‌ చేస్తే అక్తర్‌ సీరియస్‌ అయ్యాడని, దీంతో గొడవ జరిగిందన్నాడు.

ఆవేశంలో అతడు తప్పు చేశాడని కూడా పేర్కొన్నాడు. తాజాగా ఈ ఘటన గురించి ఆసిఫ్‌ మాట్లాడుతూ పైవిధంగా స్పందించాడు. అంతేకాకుండా.. అక్తర్‌ కలలు కనడం మానేసి యువ క్రికెటర్లకు సాయం చేస్తే బాగుంటుంది అంటూ చురకలు అంటించాడు.

'అప్పట్లో కుల్దీప్, నేను ఎంచక్కా కలిసిఆడేవాళ్లం.. అంతా జడేజానే చేశాడు'

వాస్తవంలో బతకాలి:

వాస్తవంలో బతకాలి:

'షోయబ్‌ అక్తర్‌తో పదమూడేళ్ల కింద గొడవ జరిగింది. ఆ గొడవను అతడు అలానే గుర్తుపెట్టుకున్నాడు. వీలు చిక్కినప్పుడల్లా నా గురించి ఇష్టారీతిన వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయం గురించి నేను తనతో మాట్లాడాలనుకున్నాను. అందుకే ఇటీవల అక్తర్‌కు కాల్‌ చేశాను. దయచేసి ఆ ఘటన గురించి ఇకపై మాట్లాడొద్దు అని చెప్పా.

అదంతా గతం. ఆ విషయం గురించి మర్చిపో అని చెప్పాను' అని మహ్మద్‌ ఆసిఫ్‌ తెలిపాడు. చీఫ్‌ సెలక్టర్‌ అవుతానని, పాకిస్తాన్‌ హెడ్‌ కోచ్‌ అని, పీసీబీ చైర్మన్‌ అవుతానని అక్తర్‌ కలలు కంటూ ఉంటాడు. అతడు వాస్తవంలో బతకాలి. 2007 నాటి ఘటన గురించి మాట్లాడుతూ.. సమయం వృథా చేసే బదులు వర్ధమాన క్రికెటర్లకు తన వంతు సాయం చేస్తే బాగుంటుంది' అని ఆసిఫ్‌ చురకలు వేశాడు.

Story first published: Friday, May 21, 2021, 16:24 [IST]
Other articles published on May 21, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+