Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అప్పుడు గంభీర్‌ను తప్పుగా అర్థం చేసుకున్నా: పాక్ మాజీ క్రికెటర్

Pakistan EX-Cricketer Kamran Akmal Recalls Heated Exchange With Gautam Gambhir

ఇస్లామాబాద్: టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్‌తో తనకు ఎలాంటి గొడవలు, శతృత్వం లేదని పాకిస్థాన్‌ మాజీ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్‌ కమ్రాన్‌ అక్మల్‌ తెలిపాడు. అయితే అతన్ని తప్పుగా అర్థం చేసుకోవడంతోనే మైదానంలో ఒకసారి గొడవపడ్డానని తెలిపాడు. అతడు చాలా మంచి వ్యక్తని చెప్పిన కమ్రాన్ అక్మల్.. 2010 ఆసియాకప్‌లో గంభీర్‌తో చోటు చేసుకున్న వివాదంపై స్పష్టతను ఇచ్చాడు. అలనాటి ఆటగాళ్లతో జరుగుతున్న లెజెండ్స్ క్రికెట్ లీగ్ సందర్భంగా నిర్వహించిన ఓ ఇంటర్వ్యూ ర్యాపిడ్‌ ఫైర్‌ రౌండ్‌లో అక్మల్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

అసలేం జరిగిందంటే..?

అసలేం జరిగిందంటే..?

నాటి మ్యాచ్‌లో గౌతమ్ గంభీర్‌ ఆడబోయిన ఓ బంతిని వికెట్ల వెనుకున్న కమ్రాన్ అక్మల్ క్యాచ్‌ అందుకున్నాడు. దాన్ని అప్పీల్‌ చేయగా అంపైర్‌ నాటౌటిచ్చాడు. ఇదే విషయంపై డ్రింక్స్‌ బ్రేక్‌ సమయంలో గంభీర్‌.. అతని వద్దకెళ్లి ఆ బంతి తన బ్యాట్‌కు తాకలేదని చెప్పాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మాటల యుద్దం నెలకొంది. ఆ సమయంలో గంభీర్‌తో సహా బ్యాటింగ్‌ చేస్తున్న ధోనీ కలగజేసుకొని ఇద్దరికీ సర్దిచెప్పాడు. అయితే ఈ ఘటనపై తాజాగా అక్మల్‌ను ప్రశ్నించగా క్లారిటీ ఇచ్చాడు.

తప్పుగా అర్థం చేసుకున్నా..

తప్పుగా అర్థం చేసుకున్నా..

టీమిండియా క్రికెటర్లలో హర్భజన్‌ సింగ్ లేదా గౌతమ్‌ గంభీర్‌.. ఇద్దరిలో ఎవరితో మీకు ఎక్కువ గొడవలున్నాయని అడిగితే ఎవరితోగొడవల్లేవని చెప్పాడు.

'నాకైతే ఇద్దరితో ఎలాంటి గొడవలు లేవు. అయితే, గంభీర్‌తో ఆసియా కప్‌ మ్యాచ్‌లో చిన్న పొరపాటు జరిగింది. నేను అతడు ఔటయ్యాడని తప్పుగా అర్థం చేసుకున్నా. కానీ, గంభీర్‌ చాలా మంచి క్రికెటర్‌. మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. అలాగే ఒకసారి బెంగళూరులో ఇషాంత్‌తో జరిగిన వివాదంలోనూ నాకెలాంటి శత్రుత్వం లేదు.'అని అక్మల్ క్లారిటీ ఇచ్చాడు.

 బెస్ట్ కీపర్ అతనే..

బెస్ట్ కీపర్ అతనే..

భారత జట్టులో ఇర్ఫాన్‌ పఠాన్ లేదా జహీర్‌ ఖాన్‌.. ఎవరెక్కువ డేంజర్‌? అని ప్రశ్నించగా అక్మల్.. జహీర్ ఖానే తన ఫేవరేట్ ఫాస్ట్ బౌలరని తెలిపాడు.

ప్రపంచంలోనే అత్యుత్తమ వికెట్‌ కీపర్‌ ఎవరని అడగ్గా..'నేను చాలా దగ్గరగా చూసినవారిలో రషీద్‌ లతీఫ్‌, ఆడం గిల్‌క్రిస్ట్‌. గత 15 ఏళ్లలో మహేంద్రసింగ్‌ ధోనీ బెస్ట్‌.'అని బదులిచ్చాడు. కమ్రాన్‌ అక్మల్‌, ఉమ్రాన్‌ అక్మల్‌.. ఇద్దరిలో ఎవరు బెస్ట్‌? అని హోస్ట్ స్మార్ట్‌గా ప్రశ్నించగా.. తానైతే ఉమర్ పేరే చెబుతానన్నాడు.

కమ్రాల్ మైదానంలో ఎందుకు సీరియస్‌గా ఉంటాడంటే..'నిజమా.. నేనైతే అలా ఉండను. ఒక్కోసారీ కీపింగ్‌లో మ్యాచ్‌ పరిస్థితుల్ని బట్టి అలా ఉండొచ్చు. కానీ, నేను ఎక్కవమటుకు చాలా సరదాగా ఉంటా. ఆటను ఆస్వాదిస్తుంటా.'అని చెప్పుకొచ్చాడు.


Story first published: Monday, January 31, 2022, 13:41 [IST]
Other articles published on Jan 31, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+