Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC 2025-27: ఘోర పరాజయంతో పాతాళానికి పాక్.. భారత్ స్థానం ఏంటంటే..?

వెస్టిండీస్ పర్యటనను పాకిస్థాన్ ఘోర పరాజయంతో ప్రారంభించింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ 2027లో భాగంగా జరుగుతున్న రెండు టెస్ట్‌ల సిరీస్‌లో పాకిస్థాన్ శుభారంభం చేయలేకపోయింది. మంగళవారం ముగిసిన తొలి టెస్ట్‌లో సమష్టిగా రాణించిన వెస్టిండీస్ 90 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది.

WTC Final 2027: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ తేదీలు వచ్చేశాయ్! ఎక్కడ, ఎప్పుడు అంటే?

WTC Final 2027: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ తేదీలు వచ్చేశాయ్! ఎక్కడ, ఎప్పుడు అంటే?

పూర్తిగా పేస్ ఆధిపత్యం నడిచిన ఈ మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్లే 40 వికెట్లు పడగొట్టారు. 211 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ 120 పరుగులకే కుప్పకూలింది. వెస్టిండీస్ పేసర్ జైడెన్ సీల్స్(5/20) ఐదు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులు చేయగా.. పాకిస్థాన్ 282 పరుగులకు ఆలౌటైంది.

Pakistan drop to last in WTC 2025-27 points table after 90-run loss to West Indies in 1st Test

పాతాళానికి పాక్..

29 పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌ బరిలోకి దిగిన వెస్టిండీస్ 181 పరుగులకు ఆలౌటైంది. దాంతో పాక్ ముందు 211 లక్ష్యం నమోదు కాగా.. పాక్ ఛేదించలేకపోయింది. విదేశాల్లో పాకిస్థాన్‌కు ఇది వరుసగా 8వ ఓటమి. ఈ ఘోర పరాజయంతో డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో పాకిస్థాన్ పాతాళానికి పడిపోయింది.

ఈ డబ్ల్యూటీసీ 2027 ఎడిషన్‌లో ఇప్పటి వరకు 5 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన పాక్.. ఒకే ఒక్క విజయం, 6.66 విన్నింగ్ పర్సంటేజీతో అట్టడుగు స్థానంలో నిలిచింది. వెస్టిండీస్ 11 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, 22.73 విజయాల శాతంతో 8వ స్థానంలో కొనసాగుతోంది.

WTC 2027: అఫ్గాన్‌పై భారీ విజయం.. టీమిండియాకు నో యూజ్! ఎందుకంటే..?

WTC 2027: అఫ్గాన్‌పై భారీ విజయం.. టీమిండియాకు నో యూజ్! ఎందుకంటే..?

ఐదో స్థానంలో భారత్..

భారత్ 9 మ్యాచ్‌ల్లో 4 గెలిచి, ఒకటి డ్రా చేసుకొని 48.15 విన్నింగ్ పర్సంటేజీతో ఐదో స్థానంలో నిలిచింది. 8 మ్యాచ్‌ల్లో 7 విజయాలు, 87.50 విన్నింగ్ పర్సంటేజీతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా..4 మ్యాచ్‌ల్లో మూడు విజయాలు, 75 విన్నింగ్ పర్సంటేజీతో సౌతాఫ్రికా రెండో స్థానంలో ఉంది.

న్యూజిలాండ్ 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 72.22 విన్నింగ్ పర్సెంటేజీతో మూడో స్థానంలో కొనసాగుతుండగా.. 4 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, 58.33 విజయాల శాతంతో నాలుగో స్థానంలో నిలిచింది. డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో భారత్ అగ్రస్థానంలో నిలవాలంటే శ్రీలంకతో రెండు టెస్ట్ సిరీస్‌లతో పాటు న్యూజిలాండ్, ఆస్ట్రేలియాపై విజయాలు సాధించాలి.

Story first published: Wednesday, July 29, 2026, 18:03 [IST]
Other articles published on Jul 29, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+