For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మ్యాచ్ మొదలుకావడానికి ముందే 10 పరుగులతో భారత్

ICC Women's T20 World Cup,IND VS PAK : Pak Docked 10 Runs Against India for Running On The Pitch
Pakistan Docked 10 Runs Against India for Running on the Pitch

హైదరాబాద్: ఐసీపీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2019లో భాగంగా వెస్టిండీస్ వేదికగా జరుగుతోన్న ఆదివారం నాటి భారత్‌-పాకిస్థాన్‌‌ల మధ్య రెండో టీ20 మ్యాచ్‌ జరిగింది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఘనవిజయం సాధించింది. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను భారత అమ్మాయిలు అలవోకగా ఓడించారు. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన పాక్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 133 పరుగులే చేసింది.

పిచ్‌ మీద బిస్మా, నిదాలు ఎక్కువ సార్లు తిరగడమే

పిచ్‌ మీద బిస్మా, నిదాలు ఎక్కువ సార్లు తిరగడమే

రెండో ఇన్నింగ్స్‌లో భారత అమ్మాయిలు బ్యాటింగ్‌కు దిగకముందే స్కోరు బోర్డుపై పది పరుగులు వచ్చినట్లు అయింది. పాకిస్థాన్‌ జట్టుకు పెనాల్టీ కింద భారత స్కోరులో అంపైర్లు ఈ పది పరుగులు కలిపారు. పాకిస్థాన్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో పిచ్‌ మీద బిస్మా, నిదాలు ఎక్కువ సార్లు తిరగడమే ఇందుక్కారణం. 13వ ఓవర్లో తొలి హెచ్చరిక అందుకున్నాక కూడా వాళ్లు అదే శైలి కొనసాగించడంతో 18వ ఓవర్లో అంపైర్‌ 5 పరుగులు పెనాల్టీని విధించారు.

చివరి ఓవర్లో మరోసారి పరుగు తీయడంతో

చివరి ఓవర్లో మరోసారి పరుగు తీయడంతో

అక్కడితో జాగ్రత్తపడకుండా చివరి ఓవర్లో మరోసారి పిచ్‌పై పరుగు తీయడంతో దానికి తోడు మరో ఐదు పరుగుల పెనాల్టీ పడింది. ఇలా భారత్‌ ఇన్నింగ్స్‌ ఆరంభానికి ముందే స్కోరులో పది పరుగులు చేరడంతో లక్ష్యం 134 నుంచి 124కు తగ్గినట్లయింది. పాక్‌కు పది పరుగుల పెనాల్టీ పడటంతో లక్ష్యం మరింత చిన్నదిగా మారి భారత్‌ ఛేదనలో పెద్దగా కష్టం లేకపోయింది.

'న్యూజిలాండ్‌లాగే పాక్‌ను సైతం చిత్తు చేస్తాం'

స్మృతి ఔటయ్యే సమయానికి 73 స్కోరుతో

స్మృతి ఔటయ్యే సమయానికి 73 స్కోరుతో

ఆఖరి మ్యాచ్‌లో మిడిలార్డర్‌లో బరిలోకి దిగిన మిథాలీ.. ఈ మ్యాచ్‌లో తిరిగి ఓపెనర్‌గా బరిలోకి దిగింది. ఆమెతో పాటు స్మృతి ధాటిగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. పాక్‌ బౌలర్లు వీరిని ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు. 7.3 ఓవర్లకే స్కోరు 50 దాటింది. ఆరంభం నుంచి అదే దూకుడుతో ఆడుతున్న టీమిండియా తొమ్మిదో ఓవర్లో స్మృతి ఔటయ్యే సమయానికి స్కోరు 73. వికెట్ పడుతున్నా.. మిథాలీ జోరు కొనసాగించింది.

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా మిథాలీ

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా మిథాలీ

ఈ క్రమంలో 42 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేయగలిగింది. జెమిమా (16)తో 28 పరుగులు, హర్మన్‌ (14 నాటౌట్‌)తో 25 పరుగులు జోడించి మిథాలీ.. జట్టును లక్ష్యానికి చేరువ చేసింది. ఇంకో 8 పరుగులే చేయాల్సిన స్థితిలో ఆమె ఔటవగా.. వేద (8)తో కలిసి హర్మన్‌ లాంఛనం పూర్తి చేసింది. తన అద్భుత ప్రదర్శనకు గాను మిథాలీ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'గా ఎంపికైంది. బుధవారం జరగనున్న మ్యాచ్‌లో భారత్‌‌తో ఐర్లాండ్‌ తలపడనుంది.

Story first published: Monday, November 12, 2018, 11:48 [IST]
Other articles published on Nov 12, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+