Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాక్‌ క్రికెట్‌కు కరోనా సెగ.. మరో ముగ్గురు క్రికెటర్లకు పాజిటివ్‌!!

Pakistan cricketers Haider Ali, Shadab Khan and Haris Rauf test positive for Coronavirus

రావల్పిండి: ఇంగ్లండ్‌ పర్యటనకు ముందు పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టుకు ఊహించని షాక్‌ తగిలింది. మరో ముగ్గురు పాక్ క్రికెటర్లకు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పాక్‌ క్రికెటర్లు షాదాబ్‌ ఖాన్, హరీష్‌ రవూఫ్‌, హైదర్‌ అలీ ఈ మహమ్మారి బారిన పడినట్టు పాక్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ఒక ప్రకటనలో తెలిపింది. అయితే వీరందరికి ఎలాంటి వైరస్ లక్షణాలు కనిపించకపోవడం గమనార్హం.

 ముగ్గురు క్రికెటర్లకు పాజిటివ్:

ముగ్గురు క్రికెటర్లకు పాజిటివ్:

మరో వారం రోజుల్లో ఇంగ్లండ్‌ పర్యటన కోసం పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు బయలుదేరాల్సి ఉంది. ఈ సిరీస్‌ కోసం ఎంపికైన 29 మంది పాక్‌ క్రికెటర్లలోని కొందరికి రావల్పిండిలో ఆదివారం కరోనా వైరస్ టెస్టులు నిర్వహించారు. ఇందులో షాదాబ్‌ ఖాన్, హరీష్‌ రవూఫ్‌, హైదర్‌ అలీ ప్రమాదకర వైరస్ మహమ్మారి బారిన పడినట్టు తేలింది. కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించే వరకు వారిలో కరోనా లక్షణాలు కనిపించలేదని సమాచారం.

స్వీయ నిర్బంధంలోకి:

స్వీయ నిర్బంధంలోకి:

కరోనా సోకిన ముగ్గురు పాక్ క్రికెటర్లను తక్షణమే స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని ఆదేశించినట్టు పీసీబీ తెలిపింది. ఇమాద్‌ వసీం, ఎస్మాన్‌ షిన్వరికి కూడా ఆదివారం పరీక్షలు చేయగా.. వారికి నెగెటివ్‌గా నిర్ధారణ అయినట్టు పేర్కొంది. ఇంకా కొందరు క్రీడాకారులు, అధికారులకు కరాచీ, లాహోర్‌,పెషావర్‌లలో సోమవారం పరీక్షలు చేయించగా.. వారి రిపోర్టులు ఈ రోజు వచ్చే అవకాశం ఉంది. భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా భర్త, ఆల్‌రౌండర్‌ షోయబ్‌ మాలిక్.. కోచ్‌ వకార్‌ యూనిస్‌ల ఫలితాలు కూడా ఈరోజు రానున్నాయి.

చికిత్స పొందుతున్న అఫ్రీదీ:

చికిత్స పొందుతున్న అఫ్రీదీ:

పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీదీ కూడా కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే అఫ్రీదీ ఆరోగ్యం బాగాలేదని వార్తలు రాగా.. స్వయంగా ఆయనే స్పందించి నేను బాగానే ఉన్నాను అని స్పష్టం చేశాడు. ఇక పాక్‌ మాజీ క్రికెటర్ తౌఫిక్‌ ఉమర్ కూడా కరోనా బారిన పడ్డాడు. పాకిస్థాన్‌లో ఇప్పటివరకు 1.82లక్షలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా వీరిలో 3606 మంది ప్రాణాలు కోల్పోయారు.

మష్రాఫె మోర్తజాకు కూడా:

మష్రాఫె మోర్తజాకు కూడా:

సాధారణ ప్రజానీకం నుంచి సెలెబ్రిటీల దాకా కరోనా వైరస్ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే బంగ్లా స్టార్ క్రికెటర్ మష్రాఫె మోర్తజాకు కరోనా సోకగా.. టెన్నిస్ ఆటగాడు గ్రిగర్‌ దిమిత్రోవ్‌కు తాజాగా కరోనా పాజిటివ్ అని తేలింది. క్రోయేషియాలో జరిగిన ఆడ్రియా టూర్ ‌ఎగ్జిబిషన్‌ ఈవెంట్‌లో ఆడిన దిమిత్రోవ్‌కు జ్వరం రావడంతో.. టెస్టులు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా తేలింది.

'సుశాంత్ మ‌ర‌ణం ధోనీని షాక్‌కు గురిచేసింది.. ఆ విషాదంను త‌ట్టుకోలేక‌పోయాడు'

Story first published: Tuesday, June 23, 2020, 10:32 [IST]
Other articles published on Jun 23, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+