న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'సుశాంత్ మ‌ర‌ణం ధోనీని షాక్‌కు గురిచేసింది.. ఆ విషాదంను త‌ట్టుకోలేక‌పోయాడు'

MS Dhoni was shocked, shattered upon hearing of Sushant Singh Rajput’s death-Neeraj Pandey
Sushant Singh Rajput : Sushant మ‌ర‌ణ వార్త విని వణికిపోయిన Dhoni !

ముంబై: డిప్రెషన్‌ కారణంగా బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ముంబైలోని తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. భారత మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ జీవిత కథ ఆధారంగా నిర్మించిన 'ఎంఎస్‌ ధోనీ: ది అన్‌టోల్డ్‌ స్టోరీ' సినిమాలో మహీ పాత్రలో సుశాంత్‌ పరకాయ ప్రవేశం చేసారు. ఆ సినిమాకు ప్ర‌ధాన పాత్ర‌ధారుడిగా ఎంపికైన త‌ర్వాత‌.. ధోనీ వ‌ద్దే నేరుగా ఆయన శిక్ష‌ణ తీసుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది. ఈ కారణంగానే సుశాంత్ మ‌ర‌ణం ధోనీని షాక్‌కు గురిచేసిందట.

సరిగ్గా ఏడాది క్రితం.. వన్డే ప్రపంచకప్‌లో షమీ మాయ!!సరిగ్గా ఏడాది క్రితం.. వన్డే ప్రపంచకప్‌లో షమీ మాయ!!

షాక్‌కు గుర‌య్యాడు:

షాక్‌కు గుర‌య్యాడు:

సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ మ‌ర‌ణం గురించి 'ఎంఎస్‌ ధోనీ: ది అన్‌టోల్డ్‌ స్టోరీ' చిత్ర ద‌ర్శ‌కుడు నీర‌జ్‌ పాండే క్రికెట‌ర్ ఎంఎస్ ధోనీతో ఆదివారం ముచ్చ‌టించిన‌ట్లు సమాచారం తెలుస్తోంది. సుశాంత్ మ‌ర‌ణ‌వార్త విన్న మ‌హీభాయ్ షాక్‌కు గుర‌య్యార‌ని, ఒక్కసారిగా వ‌ణికిపోయిన‌ట్లు నీర‌జ్ ఓ మీడియాతో వెల్ల‌డించారు. 'సుశాంత్ మరణ వార్త విని ధోనీతో పాటు అత‌ని మిత్రులు మిహిర్ దివాక‌ర్‌, అరుణ్ పాండేలు కూడా అప్‌సెట్ అయ్యారు. ముఖ్యంగా ధోనీ మూగ‌బోయాడు. ఆ విషాదం అత‌ను త‌ట్టుకోలేక‌పోయాడు' అని నీర‌జ్‌ పేర్కొన్నారు.

9 నెలలు శిక్ష‌ణ?:

9 నెలలు శిక్ష‌ణ?:

సినిమాకు ఎంపికైన త‌ర్వాత‌ ధోనీ వ‌ద్దే నేరుగా సుశాంత్ శిక్ష‌ణ తీసుకున్నారు. ధోనీ స్ట‌యిల్‌ను అనుక‌రించేందుకు దాదాపు 9 నెల‌ల పాటు అత‌ని వ‌ద్దే శిక్ష‌ణ తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ధోనీ ట్రేడ్‌మార్క్ 'హెలికాప్ట‌ర్' షాట్ ఆడేందుకు కూడా సుశాంత్ ప్ర‌త్యేక శిక్ష‌ణ పొంది.. ఆ షాట్‌తో అంద‌ర్నీ మెప్పించారు కూడా. అయితే సినిమా తీయ‌డాని క‌న్నా ముందే ధోనీని సుశాంత్ త‌న నిజ‌జీవితంలో అనుక‌రించాడ‌ని, అందుకే అత‌ను అంత సులువుగా ఆ పాత్ర‌ను పోషించిన‌ట్లు ధోనీ వ‌ద్ద ఏజెంట్‌గా చేస్తున్న అరుణ్ పాండే తెలిపారు. ధోనీ త‌ర‌హాలోనే సుశాంత్ కూడా ఓ చిన్న గ్రామం నుంచి వ‌చ్చిన‌ట్లు ఆయన చెప్పారు.

ధోనీలా మారే క్రమంలో:

ధోనీలా మారే క్రమంలో:

'తాను మహీ లాగ మెప్పించలేకపోతే కోట్లాది మంది అతని అభిమానులు క్షమించరని సుశాంత్‌ అంటుండేవాడు. అందుకే ఆ పాత్ర కోసం విపరీతంగా శ్రమించాడు. ఒక రోజు హెలికాఫ్టర్‌ షాట్‌ సాధన చేస్తుండగా.. కండరాలు పట్టేశాయి. అతను విశ్రాంతి తీసుకుంటాడని అనుకున్నాం. కానీ.. నొప్పితోనే సాధన కొనసాగించాడు. వారం రోజుల పాటు ఆ షాట్‌ను ప్రాక్టీస్‌ చేసి పట్టు సాధించాడు. ధోనీలా మారే క్రమంలో తన పాత ఇంటికి వెళ్లి అతను పడుకున్న చోటే నేల మీద పడుకుని నిద్రపోయాడు' అని పాండే చెప్పారు. ఎంఎస్ ధోనీ, కేదార్‌నాథ్‌, చిచ్చోరే, సోంచిడియా లాంటి చిత్రాల్లో సుశాంత్ న‌టించారు.

దాదా బయోపిక్‌కు నో:

దాదా బయోపిక్‌కు నో:

'ధోనీ బయోపిక్ హిట్ కావడంతో సుశాంత్ మరికొన్ని బయోపిక్‌లు చేయాలని ఆశించాడు. రెజ్లర్ గ్రేట్ కాళీ, ఫుట్‌బాలర్ భైచుంగ్ భూటియా, క్రికెటర్ సౌరవ్ గంగూలీ బయోపిక్‌ల గురించి ప్రణాళికలు రచించాడు. అయితే.. గ్రేట్ కాళీ బయోపిక్ చర్చల వద్దే ఆగిపోయింది. ఇక గంగూలీతో మీటింగ్ తర్వాత అతనిపై బయోపిక్ చేసేందుకు సుశాంత్ చాలా ఆసక్తి ప్రదర్శించాడు. దాదాతో చర్చలు జరిపి హక్కులు కొనుగోలు చేయాలని తన టీమ్‌ను కూడా సుశాంత్ పంపాడు. కానీ గంగూలీ మాత్రం బయోపిక్‌‌కు ఒప్పుకోలేదు. దీంతో సుశాంత్ అప్పట్లో చాలా అప్‌సెట్ అయ్యాడు' అని అతని సన్నిహితులు ఇటీవల వెల్లడించారు.

Story first published: Monday, June 22, 2020, 21:31 [IST]
Other articles published on Jun 22, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X