Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కొంపముంచిన జాంబియా క్రికెట్.. పాకిస్థాన్ ఆటగాళ్లపై రెండేళ్ల నిషేధం!

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) అనుమతి లేకుండా అనధికారిక టీ20 లీగ్‌లో పాల్గొన్న పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లపై ఆ దేశ క్రికెట్ బోర్డు కఠిన చర్యలు తీసుకుంది. ఎలాంటి క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా రెండేళ్ల నిషేధం విధించింది. ఈ నిషేధ కాలంలో ఆటగాళ్లు ఎలాంటి క్రికెట్ వ్యవహారాల్లో పాల్గొనడానికి వీలు లేదు.

పీసీబీ లేదా పాకిస్థాన్ సూపర్ లీగ్ పరిధిలోని జట్లకు కోచ్‌గా.. మెంటార్‌గా లేదా ఎలాంటి సలహాదారు పాత్రల్లోనూ పనిచేయడానికి వీలుండదు. ఐసీసీ నియమ నిబంధనలను కాపాడటానికి, క్రికెట్ సమగ్రతను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు పేర్కొంది.

IND vs SL: గాయంతో సాయి సుదర్శన్ ఔట్.. రేసులో తెలుగోడు!

IND vs SL: గాయంతో సాయి సుదర్శన్ ఔట్.. రేసులో తెలుగోడు!

ఆసియా లెజెండ్స్ లీగ్ పేరిట..

ఆసియా లెజెండ్స్ లీగ్ పేరిట జాంబియా‌లోని లూసాకా వేదికగా జరిగిన ఈ టోర్నీకి జాంబియా క్రికెట్ యూనియన్ అనుమతి లేదు. జాంబియా బోర్డు మద్దతు లేని ఈ టోర్నీని అనధికారికమైనదిగా ప్రకటించారు.

Pakistan Cricketers Face Two-Year Ban for Playing in Unapproved Asian Legends League

పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ సోహైల్ తన్వీర్, వికెట్ కీపర్ బ్యాటర్ కమ్రాన్ అక్మల్, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మహమ్మద్ హఫీజ్, భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఈ టోర్నీ ఆడుతున్నట్లు నిర్వాహకులు ప్రచారం చేశారు. కానీ ఈ టోర్నీకి జాంబియా క్రికెట్ బోర్డు గుర్తింపు లేదనే కారణంతో అంబటి రాయుడు‌తో పాటు కమ్రాన్ అక్మల్ చివరి నిమిషంలో టోర్నీ నుంచి తప్పుకున్నాడు.

ఎన్‌ఓసీ లేకుండా ఆడటంతో..

ఆగస్ట్ 2న మొదలైన ఈ టోర్నీలో హఫీజ్, తన్వీర్, జాహిద్ మహమూద్, మహమ్మద్ ఇర్ఫాన్ వంటి ఆటగాళ్లు పాల్గొన్నారు. పీసీబీ నుంచి ఎన్‌ఓసీ సర్టిఫికేట్ తీసుకోకుండానే పాల్గొన్న ఆటగాళ్లపై చర్యలు తీసుకున్నారు. అయితే ఏజెంట్స్ చేతిలో తాము మోసపోయామని ఓ పాక్ మాజీ ఆటగాడు ఆవేదన వ్యక్తం చేశాడు. డబ్బుల కోసం ఆ టోర్నీ ఆడామని, కానీ ఇప్పుడు ఆ డబ్బులు కూడా రాలేదని తెలిపాడు. అక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పాడు.

IND vs SL వామప్ మ్యాచ్.. భారత్‌ను ఆదుకున్న జడేజా, మానవ్ సుతార్!

Also Read

IND vs SL వామప్ మ్యాచ్.. భారత్‌ను ఆదుకున్న జడేజా, మానవ్ సుతార్!

తమ పరిస్థితిని వివరిస్తూ.. తమ నిషేధ కాలాన్ని మరోసారి సమీక్షించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మోహ్‌సిన్ నఖ్వీకి లేఖ రాయనున్నట్లు తెలిపారు. ఈ వ్యవహారంపై కమ్రాన్ అక్మల్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ఈ పనిష్‌మెంట్‌పై పీసీబీ రివ్యూ చేయాలని కోరాడు. భారత్, శ్రీలంక, అఫ్గానిస్థాన్ ఆటగాళ్లు కూడా ఈ టోర్నీలో పాల్గొన్నారని, వారిపై ఆయా దేశ క్రికెట్‌ బోర్డులు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నాడు. ఆటగాళ్ల జీవనోపాధి క్రికెట్ అని, వారి నిషేధ కాలాన్నిపున సమీక్షించాలని కోరాడు. మరోవైపు జాంబియా క్రికెట్ బోర్డు అనుమతి లేని కారణంగా ఈ ఏసియన్ లెజెండ్స్ లీగ్ మధ్యలోనే ఆగిపోయింది.

Story first published: Sunday, August 9, 2026, 10:04 [IST]
Other articles published on Aug 9, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+