Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బాయ్‌కాట్ గురించి మాకు తెలియదు.. ఆ సమయంలో భోజనం చేస్తున్నాం: పాక్ కోచ్

లార్డ్స్ టెస్ట్‌ను బహిష్కరిస్తామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) బెదిరింపులకు దిగిందనే వార్తలను ఆ జట్టు హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్ ఖండించాడు. ఈ విషయంపై తమకు ఎలాంటి సమాచారం లేదని స్పష్టం చేశాడు. మూడు టెస్ట్‌ల సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన పాకిస్థాన్ లార్డ్స్ వేదికగా రెండో టెస్ట్‌ ఆడుతోంది.

అయితే ఈ మ్యాచ్ రెండో రోజు ఆట సందర్భంగా పాకిస్థాన్ మాజీ ప్రధాని, దిగ్గజ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ కుమారులతో మైఖేల్ అథర్టన్ చేసిన ఇంటర్వ్యూను అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్కై స్పోర్ట్స్ ప్రసారం చేసింది. లంచ్ బ్రేక్ సమయంలో 18 నిమిషాల పాటు ఈ ఇంటర్వ్యూ ప్రసారమైంది.

ENG vs PAK: ఒరేయ్ ఆజామూ.. ఏమీరా నీ వల్ల ఉపయోగం!

ENG vs PAK: ఒరేయ్ ఆజామూ.. ఏమీరా నీ వల్ల ఉపయోగం!

మాకు తెలియదు..

ఈ ఇంటర్వ్యూను ప్రసారం చేయవద్దని స్కై స్పోర్ట్స్‌‌ను పీసీబీ కోరిందని, ప్రసారం చేస్తే మ్యాచ్‌ను బహిష్కరిస్తామని హెచ్చరించిందని వార్తలు వచ్చాయి. పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే ఈ ఇంటర్వ్యూను ప్రసారం చేయడానికి వీలు లేదని పట్టుబట్టినట్లు ప్రచారం జరిగింది.

Pakistan Coach Sarfaraz Ahmed Denies Knowledge of PCB s Reported Lord s Test Boycott Threat Over Atherton Interview

ఇదే విషయాన్ని మీడియా ప్రతినిధులు సర్ఫరాజ్ అహ్మద్ ముందు ప్రస్తావించగా.. అతను కొట్టిపారేసాడు. 'ఈ విషయంపై మాకు ఎలాంటి సమాచారం లేదు. మేమంతా క్షేమంగా ఉన్నాం. ఆ సమయంలో మేం భోజనం చేస్తున్నాం.'అని బదులిచ్చాడు.

ఇమ్రాన్ హత్యకు పాక్ కుట్ర..

ఈ ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఖాన్ కుమారులు కాసిం, సులేమాన్ ఖాన్‌లు పాకిస్థాన్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. జైల్లో తమ తండ్రిని చంపేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. 'ఇమ్రాన్ ఖాన్ విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియడం లేదు. ఆయనను జైల్లో చంపేందుకు కుట్ర చేస్తున్నారు. వీలైనంత కాలం ఆయనను జైలులోనే ఉంచి.. గొంతు నొక్కేయాలని చూస్తున్నారు.

చివరిసారి ఆయన మా బంధువులతో మాట్లాడినప్పుడు పరిస్థితి చాలా దయనీయంగా ఉందని చెప్పారు. జైలులో హత్యకు గురై, మరణించిన ఇతర రాజకీయ ఖైదీల పరిస్థితితో పోల్చారు. రోజంతా ఇమ్రాన్ ఖాన్‌ను గదిలోనే ఏకాంతంగా ఉంచుతున్నారు.'అని కాసిం, సులేమాన్ ఆవేదన వ్యక్తం చేశారు.

ENG vs PAK: పాకిస్థాన్ చెత్త రికార్డ్.. 2 ఇన్నింగ్స్‌ల్లో సున్నాకే వికెట్!

Also Read

ENG vs PAK: పాకిస్థాన్ చెత్త రికార్డ్.. 2 ఇన్నింగ్స్‌ల్లో సున్నాకే వికెట్!

క్రికెట్ ప్రపంచం ఆందోళన..

అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్ 2023లో అరెస్టైన విషయం తెలిసిందే. గత మూడేళ్లుగా జైలులో ఉన్న ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ ఆటగాళ్లు పాకిస్థాన్ ప్రభుత్వానికి లేఖ రాసారు. భారత దిగ్గజ ఆటగాళ్లు కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్‌తో పాటు పలువురు మాజీ కెప్టెన్లు ఈ లేఖలో పాక్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పాట్ కమిన్స్ కూడా మాజీ కెప్టెన్లకు తన మద్దతును తెలియజేస్తూ.. ఇమ్రాన్ ఖాన్‌కు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశాడు.

పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లు, ప్రస్తుత ప్లేయర్లు మాత్రం నోరు విప్పడం లేదు. జావేద్ మియాందాద్ ఒక్కడే.. ఇమ్రాన్ ఖాన్‌కు సరైన చికిత్స అందించాలని కోరాడు.

Story first published: Saturday, August 29, 2026, 11:59 [IST]
Other articles published on Aug 29, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+