For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అలా చేసుంటే గెలిచేవాళ్లం: పాకిస్థాన్ కెప్టెన్

పేలవ బ్యాటింగ్‌తోనే గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమిపాలయ్యామని పాకిస్థాన్ కెప్టెన్ షాన్ మసూద్ తెలిపాడు. ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శనివారం ముగిసిన మూడో టెస్ట్‌లో పాకిస్థాన్ 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయంతో సిరీస్‌ను 0-3తో కోల్పోయింది.

ఈ ఓటమి అనంతరం మాట్లాడిన షాన్ మసూద్.. రెండో ఇన్నింగ్స్‌లో కాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేసి 200 పరుగుల లక్ష్యం నమోదు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో ఓడినా తమకు ఎన్నో సానుకూలాంశాలు లభించాయని చెప్పాడు.

Pakistan Captain Shan Masood Reveals Shocking Reason for Massive Defeat in 3rd Test vs Australia

'మెల్‌బోర్న్ టెస్ట్‌లానే ఈ మ్యాచ్‌ను చేజేతులా చేజార్చుకున్నాం. ఈ ఓటములు మాకు ఓ గుణపాఠాలు. ఈ సిరీస్‌లో మాకు లభించిన సానుకూలంశాలపై దృష్టి సారించాలి. తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం అందుకొని మంచి స్కోర్ నమోదు చేయాల్సిన పరిస్థితుల్లో తప్పిదాలు చేశాం. ఫీల్డింగ్ తప్పిదాలతో పాటు మిచెల్ మార్ష్ వంటి ఆటగాడిని తర్వగా ఔట్ చేయకపోవడంతో 50- 60 పరుగుల ఆధిక్యాన్ని అందుకోలేకపోయాం.

మెల్‌బోర్న్‌లోనూ ఇలాంటి తప్పిదాలే చేశాం. ఆస్ట్రేలియాతో వారి సొంతగడ్డపై ఆడుతున్నప్పుడు ఎలాంటి తప్పిదాలు చేయకూడదు. క్వాలిటీ బౌలర్లు ఉన్న ఆసీస్.. తప్పిదాలను క్యాష్ చేసుకుంటుంది. మా రెండో ఇన్నింగ్స్‌లో అదే జరిగింది.

నాలుగో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లతో ఆసీస్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాలనేది మా ప్రణాళిక. కానీ తక్కువ లక్ష్యం ఉండటంతో డేవిడ్ వార్నర్, మార్నస్ లబుషేన్ అటాకింగ్ గేమ్ ఆడారు. టార్గెట్ 200 ప్లస్ ఉంటే ఫలితం మరోలా ఉండేది. అప్పుడు బ్యాటర్లు జాగ్రత్తగా ఆడే ప్రయత్నం చేసేవారు. కానీ 130 పరుగుల లక్ష్యమే కావడంతో స్వేచ్చగా అటాకింగ్ గేమ్ ఆడారు.

రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా అద్భుతంగా బౌలింగ్ చేసింది. మా జట్టులో రిజ్వాన్ మినహా మరే బ్యాటర్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. బ్యాటింగ్ విభాగం విఫలమైనా.. బౌలింగ్ యూనిట్ అసాధారణ ప్రదర్శన కనబర్చింది. మెల్ బోర్న్‌లో 20 వికెట్లు తీసిన మా బౌలర్లు సిడ్నీలోనూ చెలరేగారు. పెర్త్‌లోనూ సత్తా చాటారు.

ఈ సిరీస్‌లో మాకు లభించిన సానుకూలంశాలు ఇవే. ఈ సిరీస్‌లో మేం నమోదు చేసిన హాఫ్ సెంచరీలను.. శతకాలుగా మార్చితే టెస్ట్‌ల్లోనూ అసాధారణ విజయాలు అందుకోవచ్చు. సుమారు 10 నెలల తర్వాత మేం టెస్ట్ మ్యాచ్ ఆడనున్నాం. బంగ్లాదేశ్‌తో ఆగస్టులో టెస్ట్ సిరీస్ ఆడనున్నాం. ఆ సిరీస్‌లో ఇలానే సమష్టిగా రాణించే ప్రయత్నం చేస్తాం. టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన డేవిడ్ వార్నర్‌కు బాబర్ ఆజామ్ జెర్సీని బహుమతిగా అందజేశాం.'అని షాన్ మసూద్ చెప్పుకొచ్చాడు.

Story first published: Saturday, January 6, 2024, 10:14 [IST]
Other articles published on Jan 6, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+