For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Asia Cup 2025: అందుకే బౌలింగ్ ఎంచుకున్నా: పాక్ కెప్టెన్

ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న సూపర్-4 మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా తెలిపాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. ఇది మంచి వికెట్‌గా కనిపిస్తోంది. పిచ్‌లో పెద్దగా మార్పు ఉండదని అనుకుంటున్నా. భారత్‌తో మ్యాచ్‌లో మేం శుభారంభం అందుకున్నాం. కానీ ఆ తర్వాత టెంపో మారిపోయింది. భారత్‌తో పాటు మాది మంచి జట్టే. మేం గతం గురించి ఆలోచించం.ఈ రోజు మ్యాచ్‌పై మాత్రమే ఫోకస్ పెడ్తాం. మా జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.'అని సల్మాన్ అలీ అఘా చెప్పుకొచ్చాడు.

మరోవైపు టాస్ గెలిస్తే తాను కూడా బౌలింగ్ ఎంచుకునేవాడినని శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంక తెలిపాడు. అయితే ఈ పిచ్ బాగా కనిపిస్తోందని, ముందుగా బ్యాటింగ్ చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నాడు. 'మేము మంచి క్రికెట్ ఆడుతున్నాం. కొన్ని విషయాల్లో మెరుగవ్వాలి.

Pakistan Captain Salman Agha Explains Decision to Bowl First vs Sri Lanka in Asia Cup 2025 Super 4 Clash
Photo Credit: Asian Cricket Council

మెరుగ్గా బ్యాటింగ్‌ చేయడంతో పాటు చివరి ఓవర్లలో కట్టడిగా బౌలింగ్ చేయాలి. తుది జట్టులో రెండు మార్పులు చేశాడు. తీక్షణ, కరుణరత్నే జట్టులోకి వచ్చారు. మాకు ఒక అదనపు బౌలర్ కావాలని భావించాం. అందుకే బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన బౌలర్‌ను తీసుకున్నాం.'అని చరిత్ అసలంక చెప్పుకొచ్చాడు.

సూపర్-4 పోరులో చెరో మ్యాచ్ ఓడిన పాకిస్థాన్, శ్రీలంకకు ఈ మ్యాచ్ గెలవడం కీలకం. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకే ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది.

తుది జట్లు:

శ్రీలంక : పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (కీపర్), కుసల్ పెరీరా, చరిత్ అసలంక (కెప్టెన్), దసున్ షనక, కమిందు మెండిస్, చమిక కరుణరత్నే, వనిందు హసరంగా, మహీష్ తీక్షణ, దుష్మంత చమీర, నువాన్ తుషార

పాకిస్థాన్ : సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సల్మాన్ ఆఘా (కెప్టెన్), హుస్సేన్ తలత్, మహమ్మద్ హారిస్ (కీపర్), మహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్.

Story first published: Tuesday, September 23, 2025, 19:56 [IST]
Other articles published on Sep 23, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+