
బౌలింగ్ తప్పిదాలే..
తమ కంటే భారత్ మెరుగైన ప్రదర్శన చేసిందని కొనియాడింది. 'గేమ్ ఆసాంతం మాకు విజయావకాలున్నాయి. కానీ భారత్ అసాధారణ ప్రదర్శన కనబర్చింది. బంతితో మేం కొన్ని తప్పిదాలు చేశాం. తదుపరి మ్యాచ్‌లో మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తాం. బ్యాటర్లు తమ పాత్రను సమర్థవంతంగా నిర్వర్తించారు.
ముఖ్యంగా ఆయేషా కీలకమైన ఇన్నింగ్స్ ఆడింది'అని బిస్మా మరూఫ్ చెప్పుకొచ్చింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ బిస్మా మారూఫ్ ( 55 బంతుల్లో 7 ఫోర్లతో 68 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. అయేషా నసీమ్ ( 25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43 నాటౌట్) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడింది.

జట్టుకు శుభ సూచకం..
పాకిస్థాన్ అద్భుతంగా బ్యాటింగ్ చేసినా.. జెమీమా, రిచా ఘోష్ అసాధారణ పోరాటంతో విజయం సాధించామని టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తెలిపింది. 'ఇదో సూపర్ గేమ్. పాకిస్థాన్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. కానీ మా బ్యాటర్లు జెమీమా, రిచా అంత కంటే గొప్పగా రాణించారు. సమయస్పూర్తిగా ఆడారు. జట్టు సమష్టి ప్రదర్శన కనబర్చింది.
అవకాశం వచ్చిన ప్రతీ ప్లేయర్ తమను తాము నిరూపించుకునే ప్రయత్నం చేశారు. ఇది జట్టుకు శుభసూచకం. పాకిస్థాన్‌పై గెలవడం ఎప్పటికీ ప్రత్యేకమే. ప్రేక్షకులు సైతం అధిక సంఖ్యలో హాజరై మాకు అండగా నిలిచారు. వెస్టిండీస్‌తో తదుపరి మ్యాచ్‌కు ముందు మా తప్పిదాలను సవరించుకుంటాం. వీలైనంత వరకు నెట్స్‌లో గడుపుతాం. ఈ జైత్రయాత్రను కొనసాగించడం చాలా ముఖ్యం.'అని హర్మన్‌ప్రీత్ కౌర్ తెలిపింది.

మాటలు రావడం లేదు..
అజేయ హాఫ్ సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న జెమీమా రోడ్రిగ్స్ సంతోషం వ్యక్తం చేసింది. ఈ విజయం గురించి మాట్లాడటానికి తనకు మాటలు రావడం లేదని చెప్పింది. 'ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. భాగస్వామ్యాలు నిర్మిస్తూ.. గేమ్‌ను చివరి వరకు తీసుకెళ్తే లక్ష్యాన్ని చేధించవచ్చనే విషయం నాకు తెలుసు.
బంగ్లాదేశ్‌తో రిచా, నేను భాగస్వామ్యం నెలకొల్పాం. ఈ రోజు పాక్‌పై అలానే ఆడాం. ఈ ఇన్నింగ్స్ నాకు చాలా ప్రత్యేకమైనది. గత కొన్ని రోజులుగా నేను పెద్దగా పరుగులు చేసింది లేదు. ఆ దేవుడు నాపై దయ చూపాడు. ఈ ఇన్నింగ్స్‌ను మా తల్లిదండ్రులకు అంకితమివ్వాలనుకుంటున్నా. వాళ్లు స్టేడియంలోనే ఉన్నారు.
మ్యాచ్‌లో ఎలాంటి ఒత్తిడికి గురవ్వలేదు. ఆఖరి వరకు ఆడితే పాక్ బౌలర్లు లూజ్ బాల్స్ వేస్తారనే విషయం తెలుసు. ఆ ప్రణాళికలతోనే ఆడాం. మేం మా తప్పిదాలను సవరించుకుంటూ.. నిలకడగా రాణిస్తూ ముందుకు సాగాల్సి ఉంది.

థ్రిల్లింగ్ విక్టరీ..
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 149 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ 3 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. రిచా ఘోష్ (20 బంతుల్లో 5 ఫోర్లు, 31 నాటౌట్)తో కలిసి 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' జెమీమా రోడ్రిగ్స్ (38 బంతుల్లో 8 ఫోర్లతో 53 నాటౌట్) జట్టును గెలిపించింది. ఈ జోడీ అబేధ్యమైన నాలుగో వికెట్‌కు 58 పరుగులు జతచేసింది. షెఫాలీ వర్మ ( 25 బంతుల్లో 4 ఫోర్లతో 33) కూడా మెరిసింది.


Click it and Unblock the Notifications












