For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పెళ్లికి ఇప్పుడు తొందరేంలేదు.. కెరీర్‌లో ఇంకా ఎంతో సాదించాలి: స్టార్ పేసర్

Pakistan bowler Shaheen Shah Afridi shared an update on his marriage plans

లాహోర్‌: పాకిస్తాన్‌ యువ పేస్ బౌలర్‌ షాహిన్‌ షా అఫ్రిది తన పెళ్లిపై ఓ క్లారిటీ ఇచ్చాడు. కెరీర్‌లో ఇంకా ఎంతో సాదించాల్సి ఉందని.. పెళ్లికి ఇప్పుడేం తొందర లేదని తెలిపాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్‌ మాజీ ఆల్‌రౌండర్‌, కెప్టెన్ షాహిద్‌ అఫ్రిది కూతురు అక్సా అఫ్రిదితో వివాహం జరగనున్నట్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరి పెళ్లి జరగబోయేది నిజమేనని.. ఎప్పుడు చేయాలనేది మా రెండు కుటుంబాలు మాట్లాడుకుంటామని అఫ్రిది వెల్లడించాడు. ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లని.. షాహిన్‌, అక్సాల మధ్య ఎలాంటి లవ్ ఎఫైర్ లేదని కూడా షాహిద్‌ అఫ్రిది స్పష్టం చేశాడు.

పెళ్లికి తొందరేంలేదు

పెళ్లికి తొందరేంలేదు

తాజాగా షాహిన్‌ షా అఫ్రిది తన పెళ్లిపై వస్తున్న వార్తలకు మరోసారి చెక్‌ పెట్టాడు. డైలీ జాంగ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షాహిన్‌ షా అఫ్రిది మాట్లాడుతూ.. 'నా పెళ్లికి ఇప్పుడేం తొందర లేదు. అది సమయం వచ్చినపుడు జరుగుతుంది. కెరీర్‌లో ఇది నాకు కీలక సమయం. అన్ని ఫార్మాట్లలో రెగ్యులర్‌ బౌలర్‌గా మారుతున్న సమయం. ఇలాంటి దశలో ఎలా ముందుకు వెళ్లాలన్నది మాత్రమే ఆలోచిస్తున్నా.

పెళ్లి విషయం ఇప్పుడే ఆలోచించట్లేదు. ఇక బౌలింగ్‌లో రికార్డుల గురించి పెద్దగా పట్టించుకోను. ఏ బౌలర్ రికార్డులు బద్దలు కొట్టాలనుకొను. నేను ఏ ఫాస్ట్ బౌలర్ రికార్డులను బద్దలు కొట్టడంపై దృష్టి పెట్టలేదు. ఎందుకంటే.. రికార్డులు ఎల్లప్పుడూ బ్రేక్ అవుతూనే ఉంటాయి' అని అన్నాడు.

నా కోరిక అదే

నా కోరిక అదే

'ఎల్లప్పుడూ నన్ను నేను పూర్తిగా ఫిట్‌గా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాను. పాకిస్తాన్ తరఫున ఎక్కువ సమయం క్రికెట్ ఆడాలన్నదే నా కోరిక. అందుకోసం కష్టపడుతా. జట్టు తరపున ఆడామా.. మ్యాచ్‌లో వికెట్లు పడగొట్టామా.. గెలిపించామా అనేదే ఆలోచిస్తా. నా కెరీర్‌ను ఇలానే తీర్చిదిద్దుకుంటున్నా. నాకు విశ్రాంతి అవసరమని భావించినప్పుడల్లా నేను టీమ్ మేనేజ్‌మెంట్‌కు తెలియజేస్తాను. నేను ప్రస్తుతం పూర్తిగా ఫిట్‌గా ఉన్నాను. ఏ ఆటగాడికి తగినంత విశ్రాంతి ఇవ్వాలో టీమ్ మేనేజ్‌మెంట్‌కు బాగా తెలుసు. అన్ని వారు చూసుకుంటారు' అని షాహిన్‌ షా అఫ్రిది తెలిపాడు.

IND vs ENG: 'భారత్‌ను తక్కువ అంచనా వేస్తే అంతే సంగతులు! ఆట ఇప్పుడే మొదలైంది.. సిరీస్ మేమే గెలుస్తాం'

రమీజ్ రాజా అద్భుతాలు చేయగలడు

రమీజ్ రాజా అద్భుతాలు చేయగలడు

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్‌గా రమీజ్ రాజా నియామకం చాలా సంతోషంగా ఉందని అతడు అద్భుతాలు చేయగలడు అని కూడా షాహిన్‌ షా అఫ్రిది ధీమా వ్యక్తం చేశాడు. ప్రధాన మంత్రిగా ఇమ్రాన్ ఖాన్ మరియు పీసీబీ ఛైర్మన్ గా రమీజ్ రాజా పాకిస్థాన్ క్రికెట్‌కు ప్రయోజనం చేకూరుస్తారు. నేను 2019 క్రికెట్ ప్రపంచకప్‌కు ముందు ఇమ్రాన్ ఖాన్‌ను కలిశాను.

అతడిని విడిగా కలవడం నాకు ఆనందం కలిగించలేదు' అని అఫ్రిది చెప్పుకొచ్చాడు. అఫ్రిది ప్రస్తుతం పాకిస్తాన్‌ జట్టులో కీలక బౌలర్‌గా ఎదుగుతున్నాడు. అన్ని ఫార్మాట్లలోనూ మంచి ఫామ్‌ కనబరుస్తున్నాడు. షాహిన్‌ అఫ్రిది పాకిస్తాన్‌ తరపున 19 టెస్టుల్లో 76 వికెట్లు, 28 వన్డేల్లో 53 వికెట్లు, 30 టీ20ల్లో 32 వికెట్లు పడగొట్టాడు.

ఇద్దరికి 21 ఏళ్లే

ఇద్దరికి 21 ఏళ్లే

పాకిస్తాన్ మాజీ సారథి షాహిద్ అఫ్రిదీకి మొత్తం ఐదుగురు కూతుళ్లు ఉన్నారు. అక్సా, అన్షా, అజ్వా, అస్మరా, ఆర్వా. వీరిలో పెద్ద కుమార్తె అక్సా. ఆమెనే షాహిన్‌ షా అఫ్రిదికి ఇస్తున్నారు. అయితే షాహీన్, అక్సాలకు 21 ఏళ్లే కావడం విశేషం. షాహిద్ అఫ్రిదీ కుటుంబంతో షాహీన్ షా అఫ్రిదీ తండ్రి అయాజ్ కొన్ని నెలలుగా చర్చలు జరిపి.. చివరకు పెళ్లి కుదిర్చారు. షాహిద్, షాహీన్ ఇద్దరూ వేర్వేరు తెగలకు చెందినవారని ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది.

Story first published: Thursday, September 2, 2021, 14:33 [IST]
Other articles published on Sep 2, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+