Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇదెక్కడి స్టంపౌట్ రా మామ..!(వీడియో)

న్యూఢిల్లీ: క్రికెట్‌లో అప్పుడప్పుడు విచిత్రకరమైన ఘటనలను చూస్తుంటాం. తాజాగా పాకిస్థాన్ యువ ప్లేయర్ హైదర్ అలీ విచిత్రకరమైన రీతిలో స్టంపౌట్ అవ్వడం చర్చనీయాంశమైంది. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్ టోర్నీలో ఈ ఘటన చోటు చేసుకుంది. బుధవారం వార్విక్‌షైర్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో డెర్బీషైర్ బ్యాటర్ హైదర్ అలీ స్టంపౌట్ అయిన తీరు అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఈ స్టంపౌట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

అసలేం జరిగిందంటే..?
వార్విక్‌షైర్ బౌలర్ డాన్నీ బ్రిగ్స్ వేసిన 11వ ఓవర్‌లో హైదర్ అలీ.. స్టెప్ ఔటై భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. దీన్ని పసిగిట్టిన బౌలర్.. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా బంతిని వేసాడు. దాంతో హైదర్ అలీ బ్యాట్‌ను మిస్సైన బంతి వికెట్ కీపర్ చేతిలో పడింది.ఈ బంతిని అందుకునే క్రమంలో వికెట్ కీపర్ కాస్త తడబడగా.. హైదర్ అలీ అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేశాడు.

Pakistan

ముందుగా స్టంపౌట్‌ను తప్పించుకునేందుకు బ్యాట్‌ను క్రీజులో పెట్టిన హైదర్ అలీ.. ఆ తర్వాత కీపర్ బంతిని వికెట్లకు కొట్టేసాడని భ్రమపడి పరుగుకు ప్రయత్నించాడు. కానీ బంతిని చేతులోనే ఉంచుకున్న వికెట్ కీపర్ స్టంపౌట్ చేశాడు. దాంతో హైదర్ అలీ బిత్తరపోయాడు. ప్రస్తుతం ఈ స్టంపౌట్‌కు సంబంధించిన వీడియో క్రికెట్ అభిమానులకు నవ్వులు తెప్పిస్తోంది. ఫ్యాన్స్ ఇదెక్కడి స్టంపౌట్ రా మామ అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో హైదర్ అలీ ప్రాతినిథ్యం వహిస్తున్న డెర్బీ షైర్ జట్టే 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన వార్విక్‌షైర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 203 పరుగులు చేసింది.

సామ్ హైన్(79 నాటౌట్), డాన్ మౌస్లీ(26), అలెక్స్ డేవిస్(26) రాణించారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన డెర్బీ షైర్ 19.3 ఓవర్లలోనే 4 వికెట్లకు 207 పరుగులు చేసి గెలుపొందింది. లూస్ డూ పోలీ(66 నాటౌట్), లూయిస్ రీస్(57) హాఫ్ సెంచరీలతో రాణించగా.. హైదర్ అలీ(48) విలువైన పరుగులు చేశాడు.

Story first published: Thursday, June 8, 2023, 22:45 [IST]
Other articles published on Jun 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+