
మాంచెస్టర్: ఇంగ్లండ్‌తో మాంచెస్టర్ వేదికగా బుధవారం నుంచి ప్రారంభంకానున్న ఫస్ట్ టెస్ట్‌కు 16 మంది సభ్యులతో కూడిన జట్టును పాకిస్థాన్ ప్రకటించింది. సుదీర్ఘ విరామం తర్వాత జట్టులోకి వచ్చిన మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌కు అవకాశం దక్కింది. గతేడాది అక్టోబరులో చివరిసారిగా అతను పాక్ తరఫున బరిలోకి దిగాడు. శ్రీలంకతో సొంతగడ్డపై జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో పాక్ చిత్తుగా ఓడిపోవడంతో.. ఆగ్రహించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సర్ఫరాజ్ అహ్మద్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడమే కాకుండా జట్టు నుంచి తొలగించింది.
ఈ 16 మంది సభ్యుల నుంచి మ్యాచ్‌కు ముందు తుది జట్టును ఎంపిక చేయనున్నారు. ఇక భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటల నుంచి ఈ టెస్టు ప్రారంభం కానుంది. ఇక వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ గెలిచి ఉత్సాహంగా ఉన్న ఆతిథ్య జట్టును ఓడించడం అజహర్ అలీ సేనకు సవాల్‌తో కూడుకున్నది.
ఈ మ్యాచ్‌తో మూడు టెస్టులు సిరీస్ ప్రారంభం కానుండగా.. అనంతరం మూడు టీ20ల సిరీస్ జరగనుంది. ఈ రెండు సిరీస్‌లు పూర్తి బయో- సెక్యూర్ వాతారణంలో ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిర్వహిస్తోంది. ఈ మేరకు నెల రోజులు ముందుగానే పాకిస్థాన్ జట్టును అక్కడికి రప్పించిన ఈసీబీ.. కరోనా వైరస్ పరీక్షలు, 14 రోజులు క్వారంటైన్‌లో ఉంచి.. ఇరు జట్ల ఆటగాళ్లని బయో- సెక్యూర్ బబుల్‌లోకి చేర్చింది. ఒక్కసారి క్రికెటర్లు, మ్యాచ్ అధికారులు ఈ బబుల్‌లోకి ఎంటరైన తర్వాత సిరీస్ ముగిసే వరకూ బయటకు రాకూడదు. ఇక పాకిస్థాన్ టీమ్ ప్రాక్టీస్ మ్యాచ్‌లు కూడా ఆడింది.
ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకి పాకిస్థాన్ జట్టు..
అజహర్ అలీ (కెప్టెన్), బాబర్ అజామ్, అబిద్ అలి, అసద్ షాఫిక్, పవాద్ అలామ్, ఇమామ్ ఉల్ హక్, ఖాసిప్ భట్టీ, మహ్మద్ అబ్బాస్, మహ్మద్ రిజ్వాన్, నసీమ్ షా, సర్ఫరాజ్ అహ్మద్, షదాబ్ ఖాన్, షాహీన్ షా అఫ్రిది, షాన్ మసూద్, సొహైల్ ఖాన్, యాసీర్ షా