
ఎలాగైనా సిరీస్ ఆడాలని
ఇటీవల అఫ్గాన్‌ని తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. దాంతో అక్కడ ఒక్కసారిగా జనజీవనం స్తంభించి.. ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తూ.. కొంత మంది ప్రాణాలు సైతం కోల్పోయారు. మరోవైపు కాబుల్ విమానాశ్రయంలోనూ పరిస్థితులు దయనీయంగా మారాయి. దేశం దాటే క్రమంలో ఓ ఫుట్ బాల్ ప్లేయర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. అయితే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇవేమీ పట్టించుకోకుండా.. నిన్నటివరకు అఫ్గాన్‌తో ఎలాగైనా సిరీస్ ఆడాలని చూసింది.

క్రికెటర్ల మానసిక స్థితిని దృష్టిలో పెట్టుకొని
ఈ నేపథ్యంలోనే సోమవారం ఉదయం పాక్, అఫ్గాన్ దేశాల క్రికెట్ బోర్డులు వర్చువల్‌గా సమావేశమై పాకిస్థాన్‌లో మూడు వన్డేల మ్యాచ్‌లు నిర్వహించాలని అంగీకరించాయి. చివరికి అఫ్గాన్ బోర్డు తమ నిర్ణయాన్ని మార్చుకొని పాకిస్థాన్‌కు భారీ షాక్ ఇచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో తమ క్రికెటర్ల మానసిక స్థితిని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ బోర్డు సీఈవో హమిద్ షిన్వారి ఓ జాతీయ మీడియాకు చెప్పారు.
మరోవైపు తాలిబన్ల పాలనలో ఆ దేశంలో క్రికెట్‌కు ఎలాంటి నష్టం జరగకూడదని ఆయన ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. శ్రీలంక వేదికగా సెప్టెంబర్ 3 నుంచి ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగాల్సి ఉంది.
నేను చేసిన ఆ పనికి సిగ్గుపడుతున్నా.. దయచేసి క్షమించండి: దక్షిణాఫ్రికా కోచ్

నిరాశలో పీసీబీ
అనంతరం ఈ విషయంపై స్పందించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. ఈ సిరీస్ జరగడానికి అఫ్గాన్‌తో తాము పూర్తిగా సహకరించామని, ఇరు జట్ల మధ్య ఈ ద్వైపాక్షిక సిరీస్ జరుగుతుందని ఆశించామని పేర్కొంది. ఇప్పుడు ఆ దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వాయిదాకు అంగీకరించామని చెప్పుకొచ్చింది. ఈ సిరీస్ వాయిదా పడడంతో పీసీబీ నిరాశ వ్యక్తం చేసింది. అఫ్గన్, పాకిస్తాన్‌ల మధ్య శ్రీలంక వేదికగా సెప్టెంబర్ 1 నుంచి మూడు వన్డేల సిరీస్ మొదలు కావాల్సి ఉంది. సెప్టెంబర్ 1న తొలి వన్డే, 3న రెండో వన్డే, 5న చివరి వన్డే జరగాల్సి ఉంది.

గందరగోళంలో క్రికెటర్ల భవిష్యత్తు
ప్రస్తుతం అఫ్గాన్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశ క్రికెటర్ల భవిష్యత్తు గందరగోళంలో పడిపోయింది. అయితే ఐపీఎల్ 2021 మలిదశ మ్యాచ్‌లకు అఫ్గాన్ క్రికెటర్లు అందుబాటులో ఉండనున్నారట. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్న రషీద్ ఖాన్, మహమ్మద్ నబీలు టోర్నీకి అందుబాటులో ఉంటారని సన్‌రైజర్స్ టీమ్ సీఈవో షణ్ముగం తెలిపారు. ఈ నెల 31న తమ టీమ్ యూఏఈకి బయలుదేరుతోందని ఆయన వెల్లడించారు. ఇక సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్ 2021 మలిదశ మ్యాచ్‌లు ఆరంభం కానున్నాయి.


Click it and Unblock the Notifications












