పిల్ల బచ్చాలతో ఎందుకు ఆడారు? టీమిండియాపై విరుచుకుపడిన పాక్ కెప్టెన్!
న్యూఢిల్లీ: ఎమర్జింగ్ ఆసియాకప్ 2023 టైటిల్‌ను పాకిస్థాన్ ఏ జట్టు గెలుచుకున్న విషయం తెలిసిందే. భారత్-ఏతో జరిగిన ఫైనల్లో 128 పరుగుల భారీ తేడాతో పాక్-ఏ జట్టు గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ అడ్డదారిలో విజయం సాధించిందని భారత అభిమానులు ట్రోల్ చేశారు.
భారత జట్టులో 20-23 ఏళ్ల కుర్రాళ్లు ఉంటే.. పాకిస్థాన్, శ్రీలంక జట్లు మాత్రం అంతర్జాతీయ క్రికెట్ ఆడిన 30 ఏళ్ల ప్లేయర్లను ఆడించారని ఆరోపించారు. ఎమర్జింగ్ ఆసియాకప్ ఫైనల్లో సెంచరీతో చెలరేగిన తయ్యబ్ తాహీర్ వయసు 30 ఏళ్లు అని, అతను పాకిస్థాన్ తరఫున మూడు అంతర్జాతీయ టీ20లు కూడా ఆడారని భారత అభిమానులు గణంకాలతో సహా బయటపెట్టారు.

అయితే ఈ విమర్శలపై పాకిస్థాన్ -ఏ టీమ్ కెప్టెన్ మహమ్మద్ హరీస్ ఘాటుగా స్పందించాడు. పిల్ల బచ్చా గాళ్లను ఎవరు పంపించమన్నారని ప్రశ్నించాడు. అయితే తమ కంటే భారత కుర్రాళ్లకే ఎక్కువ అనుభవం ఉందని తెలిపాడు. 'మేం ఎమర్జింగ్ ఆసియాకప్ గెలిచిన తర్వాత చాలా మంది మా ఓటమిని ఎగతాళీ చేశారు.
సీనియర్లతో బరిలోకి దిగి గెలిచారని ట్రోల్ చేశారు. వాళ్లందరిని నేను ఒక్కటే అడుగుతున్నా? మేం పిల్ల బచ్చాలను పంపివ్వమని చెప్పలేదే? ఇంకా మా జట్టులో చాలా మందికి అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం ఉందని చెబుతున్నారు. మేం ఎన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాం? సయిం 5 మ్యాచ్‌లు ఆడితే నేను 6 మ్యాచ్‌లు ఆడాను.
టీమిండియా కుర్రాళ్లు దాదాపు 260 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడారు. దాన్ని ఎవ్వరూ పట్టించుకోరు ఏంటి? అని మహమ్మద్ హారీస్ ఘాటుగా వ్యాఖ్యానించాడు.
ఇక 20 ఏళ్ల యశ్‌ధుల్ కెప్టెన్సీలోని భారత్ ఏ జట్టు అసాధారణ ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. చివరి లీగ్ మ్యాచ్‌లోనూ పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. కానీ ఫైనల్లో మాత్రం ఒత్తిడిని అధిగమించలేకపోయింది. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవడంతో పాటు రాజవర్దన్ హంగర్గేకర్ నోబాల్ వేయడం టీమిండియా విజయవకాశాలను దెబ్బతీసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications