Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PAK vs WI: షాహిన్ షా తీన్మార్.. వెస్టిండీస్ బేజార్! పాక్‌దే టీ20 సిరీస్!

PAK vs WI: Shaheen Shah Afridi Takes 3 Wickets In An Over Pakistan beat West Indies In 2nd T20I

కరాచీ: సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌ను పాకిస్థాన్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. మంగళవారం జరిగిన రెండో టీ20లో సమష్టిగా రాణించిన బాబర్ సేన.. 13 పరుగుల తేడాతో గెలుపొందింది. పాక్ స్టార్ పేసర్ షాహిన్ షా అఫ్రిదీ(3/26) మూడు వికెట్లతో చెలరేగి వెస్టిండీస్ పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 రన్స్ చేసింది.

ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్‌ ( 30 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 38), ఇఫ్తిఖార్‌ అహ్మద్‌ (19 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 32), హైదర్‌ అలీ (34 బంతుల్లో 4 ఫోర్లతో 31) టాప్ స్కోరర్లుగా నిలిచారు. షాదాబ్ ఖాన్(12 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 28 నాటౌట్) విలువైన పరుగులు చేశాడు. కెప్టెన్ బాబర్ ఆజామ్(7) తీవ్రంగా నిరాశపరిచాడు. రనౌట్‌గా వెనుదిరిగాడు. అనంతరం వెస్టిండీస్ 20 ఓవర్లలో 163 పరుగులకు ఆలౌటైంది. బ్రాండన్‌ కింగ్‌ (43 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 67), షెపర్డ్‌ (19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 35 నాటౌట్) పోరాడిన ఫలితం లేకపోయింది. చివరి ఓవర్లో గెలుపు కోసం 23 పరుగులు చేయాల్సిన స్థితిలో వెస్టిండీస్‌ 13 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాక్ బౌలర్లలో షాహిన్ అఫ్రిది మూడు వికెట్లకు తోడుగా.. మహమ్మద్ నవాజ్, మహమ్మద్ వాసీమ్, హ్యారీస్ రౌట్ రెండేసి వికెట్లు పడగొట్టాడు. ఇరు జట్ల నామమాత్రపు చివరి టీ20 గురువారం జరగనుంది.

ఈ మ్యాచ్‌లో బాబర్‌ ఆజమ్‌ రనౌట్‌ అయిన తీరు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. విండీస్‌ స్పిన్నర్‌ ఏకియల్‌ హొస్సేన్‌ వేసిన మూడో ఓవర్‌ మూడో బంతిని మహ్మద్‌ రిజ్వాన్‌ బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ దిశగా ఆడాడు. అయితే క్విక్‌ సింగిల్‌ తీయొచ్చనే ఉద్దేశంతో రిజ్వాన్‌ నాన్‌ స్ట్రైక్‌ ఎండ్‌వైపు పరిగెత్తాడు. అతని పిలుపు అందుకున్న బాబార్‌ అజమ్‌ కూడా పరిగెత్తినప్పటికి సకాలంలో క్రీజులోకి చేరుకోలేకపోయాడు. ఇంతలో బంతిని అందుకున్న హెడెన్‌ వాల్ష్‌ కీపర్‌ పూరన్‌కు త్రో విసిరాడు.

దీంతో బాబర్‌ అజమ్‌ క్రీజుకు చాలా దూరంలో ఉండగానే పూరన్‌ బెయిల్స్‌ ఎగురగొట్టడంతో బాబర్‌ రనౌటయ్యాడు. ప్రస్టేషన్‌తో బాబర్‌ అజమ్‌ పెవిలియన్‌కు వెళ్తూ బ్యాట్‌ను కోపంతో కొట్టడం కెమెరాలకు చిక్కింది. దీంతో బాబర్‌ అజమ్‌ను క్రికెట్‌ ఫ్యాన్స్‌ తమదైన శైలిలో ట్రోల్‌ చేశారు. ''బాబర్‌ అజమ్‌ మరీ ఇంత బద్దకమా.. నీకు వయసు అయిపోతుంది.. సింగిల్‌ వద్దు అనుకుంటే రిజ్వాన్‌కు కాల్‌ ఇవ్వాల్సింది..'' అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. వాస్తవానికి అక్కడ సింగిల్ వచ్చే పరిస్థితే లేదు.

Story first published: Wednesday, December 15, 2021, 11:40 [IST]
Other articles published on Dec 15, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+