For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PAK vs WI: ‘మాదర్**’ అంటూ కెప్టెన్ బాబర్ ఆజామ్‌ను తిట్టిన పాకిస్థాన్ ఓపెనర్! (వీడియో)

 PAK vs WI: Imam-ul-Haqs Angry Reaction After Mix-Up With Babar Azam Causes Run-Out Goes Viral

ముల్తాన్: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌పై ఆ జట్టు ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ నోరు పారేసుకున్నాడు. అనవసరంగా తనను రనౌట్ చేశాడనే అసహనంతో కెప్టెన్ అనే కనీస గౌరవం లేకుండా నోరు జారాడు. రాయలేని పదంతో బండ బూతులు తిట్టాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. వెస్టిండీస్‌తో సొంతగడ్డపై జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ముల్తాన్ వేదికగా శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

అసలు విషయం ఏంటంటే..?

అసలు విషయం ఏంటంటే..?

పాకిస్థాన్ ఇన్నింగ్స్‌ సందర్భంగా విండీస్ పేసర్ అకీల్‌ హొసేన్‌ వేసిన 28వ ఓవర్‌లో ఇమామ్ ఉల్ హక్ రనౌటయ్యాడు. మిడ్‌వికెట్‌ దిశగా ఆడి క్విక్ సింగిల్‌కు ప్రయత్నించాడు. రన్ కోసం మూమెంటమ్ ఇచ్చిన బాబర్.. బంతి ఎక్కువ దూరం వెళ్లకపోవడంతో పరుగుకు నిరాకరించాడు. అయితే అప్పటికే ఇమాముల్‌ హక్‌ సగం క్రీజు దాటి నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌కు వచ్చేశాడు. బాబర్‌ పిలుపుతో వెనక్కి వెళ్లినప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

బంతిని అందుకున్న షెయ్ హోప్‌ వికెట్లను గిరాటేయడంతో ఇమాముల్‌ హక్ 72 పరుగుల వద్ద రనౌట్‌ అయ్యాడు.

మాదర్ అంటూ..

మాదర్ అంటూ..

దాంతో ఇమామ్ ఉల్‌ హక్‌ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. పెవిలియన్‌కు వెళ్తూ బ్యాట్‌ను కింద కొట్టుకుంటూనే తిట్ల దండకం అందుకున్నాడు. సెంచరీ చేయాలనే తన ఆశను బాబర్ ఆజమ్ చిదిమేసాడని ఇమామ్ అసహనానికి గురయ్యాడు. ఇక బాబర్, ఇమామ్ రెండో వికెట్‌కు ఏకంగా 120 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. బాబర్ ఆజామ్ కూడా ఔటవ్వడంతో భారీ స్కోర్ దిశగా సాగిన పాకిస్థాన్ ఇన్నింగ్స్ సాధారణ స్కోర్‌కే పరిమితమైంది.

పాక్‌దే సిరీస్..

వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే పాకిస్థాన్‌ చేజిక్కించుకుంది. శుక్రవారం రెండో వన్డేలో పాక్‌ 120 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. ఇమాముల్‌ హక్‌ (72), బాబర్‌ అజామ్‌ (77) రాణించడంతో మొదట పాక్‌ 50 ఓవర్లలో 8 వికెట్లకు 275 పరుగులు చేసింది. నవాజ్‌ (4/19), మహ్మద్‌ వసీమ్‌ (3/34) విజృంభించడంతో ఛేదనలో విండీస్‌ 32.2 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌటైంది.

Story first published: Saturday, June 11, 2022, 10:44 [IST]
Other articles published on Jun 11, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+