Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PAK vs SL ప్రీఫైనల్.. శ్రీలంక చేతిలో పాక్ చిత్తు..!

PAK vs SL: Sri Lanka grab morale boosting 5-wicket win against Pakistan

దుబాయ్: ఆసియాకప్ 2022లో శ్రీలంక జైత్ర యాత్ర కొనసాగుతోంది. సూపర్ 4 దశలో ఆ జట్టు వరుసగా మూడో విజయాన్నందుకుంది. పాకిస్థాన్‌తో శుక్రవారం జరిగిన ప్రీ ఫైనల్ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన శ్రీలంక 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన లంక.. అద్భుతమైన ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకెళ్లడమే కాకుండా టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. కీలక ఫైనల్‌ ముందు జరిగిన మ్యాచ్‌లో పాక్ చిత్తు చేసిన ఆ జట్టు.. ఫైనల్లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.1 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. శ్రీలం బౌలర్లలో స్పిన్నర్ వానిందు హసరంగా (3/21) మూడు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు. ఇతర బౌలర్లలో మహీశ్ తీక్షణ(2/21), ప్రమోద్ మదుషన్(2/21) రెండేసి వికెట్లు తీయగా.. చమిక కరుణరత్నే, ధనుంజయ డిసిల్వా తలో వికెట్ తీసారు. లంక బౌలర్ల ధాటికి పాక్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. కెప్టెన్ బాబర్ ఆజామ్(29 బంతుల్లో 2 ఫోర్లతో 30), మహమ్మద్ నవాజ్(18 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 26) మినహా మరెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. ముగ్గురు బ్యాటర్లు కనీసం ఖాతా కూడా తెరవలేదు.

122 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 17 ఓవర్లలోనే 5 వికెట్లకు 124 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ఓపెనర్ పాతుమ్ నిస్సంక(48 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 55 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించాడు. కుశాల్ మెండిస్(0), గుణతిలక(0) విఫలమైనా.. భానుక రాజపక్స(24), డసన్ షనక(21) పర్వాలేదనిపించారు. పాక్ బౌలర్లలో మమమ్మద్ హస్‌నైన్, హ్యారీస్ రౌఫ్ రెండేసి వికెట్లు తీయగా.. ఉస్మాన్ ఖదీర్ తలో వికెట్ తీసారు.

Story first published: Friday, September 9, 2022, 23:02 [IST]
Other articles published on Sep 9, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+