Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మహమ్మద్‌ హఫీజ్‌కు పీసీబీ షాక్.. లేటుగా వస్తానన్నందుకు వేటు! మండిపడుతున్న ఫాన్స్!

PAK vs SA: Mohammad Hafeez dropped from Pakistans T20I squad for South Africa

కరాచీ: సీనియర్ బ్యాట్స్‌మన్‌ మహమ్మద్‌ హఫీజ్‌కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) షాక్ ఇచ్చింది. రెండు రోజులు ఆలస్యంగా బయో సెక్యూర్‌ బబుల్‌లో చేరతానని చేసిన విజ్ఞప్తిని పీసీబీ తిరస్కరించింది. దీంతో దక్షిణాఫ్రికా సిరీస్ కోసం అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న హఫీజ్ లేకుండానే టీ20 జట్టును ఆదివారం పాక్‌ సెలక్షన్‌ కమిటీ ప్రకటించింది. హఫీజ్ గతేడాది పాకిస్థాన్‌ తరపున పొట్టి ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన విషయం తెలిసిందే.

రెండు రోజులు ఆలస్యంగా వస్తానన్నందుకు:

రెండు రోజులు ఆలస్యంగా వస్తానన్నందుకు:

ప్రస్తుతం అబుదాబిలో టీ10 లీగ్‌ ఆడుతున్న మహమ్మద్‌ హఫీజ్.. దక్షిణాఫ్రికాతో జరగనున్న టీ20 సిరీస్‌ కోసం జట్టు కంటే రెండు రోజులు ఆలస్యంగా బయో సెక్యూర్‌ బబుల్‌లో చేరతానని పీసీబీకి విజ్ఞప్తి చేశాడు.హఫీజ్ విజ్ఞప్తిని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు తిరస్కరించింది. దీంతో దక్షిణాఫ్రికాతో టీ20లకు జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఫఖర్‌ జమాన్, వాహబ్‌ రియాజ్‌లపైనా పీసీబీ వేటు పడింది. గాయంతో షాదాబ్‌ ఖాన్, వ్యక్తిగత కారణాలతో ఇమాద్ వసీమ్‌ సెలక్షన్స్‌కు అందుబాటులో లేకుండాపోయారు. జాఫర్, డానిష్‌ అజీజ్, జాహిద్, అమద్‌ మొదటిసారి జట్టుకు ఎంపికయ్యారు.

3న బబుల్‌లో అడుగుపెట్టాలి

'ప్రతి ఆటగాడు ఫిబ్రవరి 3న బయో బబుల్‌లో అడుగుపెట్టాలి. ఒకవేళ ఎవరికైనా అది సాధ్యం కాకపోతే అతను సిరీస్‌కు అందుబాటులో లేనట్లే. అందుకే మహమ్మద్‌ హఫీజ్‌ను ఎంపిక చేయలేదు' అని పాక్ ప్రధాన సెలక్టర్‌ మహమ్మద్‌ వసీమ్‌ పేర్కొన్నాడు. పాకిస్తాన్ జట్టుకు బాబర్‌ అజామ్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ నెల 11న ఆరంభమయ్యే ఈ టీ20 సిరీస్‌ కోసం రెండు జట్లు 3వ తేదీనే బయో బబుల్‌లో అడుగుపెట్టనున్నాయి. సఫారీతో 4న ప్రారంభమయ్యే రెండో టెస్టు ఆడుతున్న ఆటగాళ్లు ఆ మ్యాచ్‌ ముగిశాక.. మిగతా ఆటగాళ్లతో చేరతారు.

అత్యుత్తమ ఫామ్‌లో హఫీజ్‌

అత్యుత్తమ ఫామ్‌లో హఫీజ్‌

పాకిస్తాన్ టీ20 జట్టులో మహమ్మద్‌ హఫీజ్ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌. హఫీజ్ తన చివరి 12 టీ20 మ్యాచ్‌లలో 100.40 సగటుతో 153 స్ట్రైక్ రేట్‌తో 502 పరుగులు చేశాడు. గతేడాది 10 టీ20ల్లో 83 సగటుతో 415 పరుగులు చేశాడు. అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న హఫీజ్‌ను ఎంపికచేయకపోవడంపై పాక్ ఫాన్స్ మండిపడుతున్నారు. 'హఫీజ్‌జట్టులో లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది' అని ఒకరు కామెంట్ చేయగా.. 'కావాలనే హఫీజ్‌ను తప్పించారు' అని మరొకరు ట్వీట్ చేశారు.

పాకిస్తాన్ టీ20 జట్టు

పాకిస్తాన్ టీ20 జట్టు

బాబర్ అజామ్, హైదర్ అలీ, ఖుష్దిల్ షా, హుస్సేన్ తలాత్, డానిష్ అజీజ్, ఆసిఫ్ అలీ, ఇఫ్తీఖర్ అహ్మద్, మహ్మద్ నవాజ్, జాఫర్ గోహర్, ఫహీమ్ అష్రాఫ్, అమీర్ యామిన్, అమద్ బట్, మహ్మద్ రిజ్వాన్, సర్ఫరాజ్ అహ్మద్, షహీన్ అఫ్రిదిన్, హసన్ అలీ, ఉస్మాన్ ఖాదిర్, జాహిద్ మెహమూద్.

సరికొత్త వెర్షన్‌లో బుమ్రా బౌలింగ్! ఇప్పుడు ఫాస్ట్‌ బౌలర్‌ కాదు.. లెగ్ స్పిన్నర్‌! (వీడియో)

Story first published: Monday, February 1, 2021, 11:56 [IST]
Other articles published on Feb 1, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+