సరికొత్త వెర్షన్‌లో బుమ్రా బౌలింగ్! ఇప్పుడు ఫాస్ట్ బౌలర్ కాదు.. లెగ్ స్పిన్నర్! (వీడియో)

చెన్నై: జస్ప్రీత్ బుమ్రా టీమిండియా పేసర్ కదా?.. లెగ్ స్పిన్నర్‌గా ఏంటి అనుకుంటున్నారా?. మరేమీలేదు బుమ్రా లెగ్ స్పిన్‌ను సాధన చేస్తున్నాడు. టీమిండియా దిగ్గజ స్పిన్నర్, మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లేలా అనుకరిస్తూ నెట్స్‌లో బంతులు విసురుతున్నాడు. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలో గాయం కారణంగా గబ్బా టెస్ట్‌కు దూరమైన బూమ్రా.. ఇంగ్లండ్‌తో ప్రారంభంకానున్న నాలుగు టెస్ట్‌ల సిరీస్‌కు అందుబాటులోకి వచ్చాడు. చెన్నైలో జరుగనున్న తొలి రెండు టెస్ట్‌లకు జట్టులోకి వచ్చిన భారత స్పీడ్ గన్.. నెట్ ప్రాక్టీస్ సందర్భంగా కుంబ్లేను అనుకరిస్తూ సరదాగా బౌలింగ్ చేశాడు.
కుంబ్లేలా బౌలింగ్ చేసిన బుమ్రా:
అనిల్ కుంబ్లేలా బౌలింగ్ చేసిన జస్ప్రీత్ బుమ్రా వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలలో పోస్ట్ చేసింది. 'జస్ప్రీత్ బుమ్రా యార్కర్లు, బౌన్సర్లు మనం చూశాం. అయితే ఇప్పటివరకు ఫాస్ట్ బౌలర్లు ప్రదర్శించని సరికొత్త వెర్షన్‌లో బుమ్రా బౌలింగ్ చేస్తున్నాడు. టీమిండియా లెజెండ్ అనిల్ కుంబ్లే బౌలింగ్ యాక్షన్‌ను అనుకరిస్తున్నాడు' అని బీసీసీఐ వీడియోకి కాప్షన్ పెట్టింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

నాలానే బౌలింగ్ చేస్తున్నావు:
బీసీసీఐ పోస్ట్‌పై అనిల్ కుంబ్లే స్పందించారు. 'వెల్‌డన్ జస్ప్రీత్ బుమ్రా. నాలానే బౌలింగ్ చేస్తున్నావు. నీ బౌలింగ్ యాక్షన్‌ను అనుకరించడానికి ప్రయత్నిస్తున్న ఎంతో మంది యువ బౌలర్లకు.. నువ్వు స్ఫూర్తి. ఇంగ్లండ్ సిరీస్‌లో రాణించాలని కోరుకుంటున్నా' అని కుంబ్లే వీడియోకి కామెంట్ చేశారు. బీసీసీఐ పోస్ట్ చేసిన వీడియోలో బూమ్రా.. కుంబ్లేలా బౌలింగ్ చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. నెట్స్‌లో లెఫ్ట్ హ్యాండర్ (వాషింగ్టన్ సుందర్) బ్యాటింగ్ చేస్తుంటాడు. విభిన్న శైలితో, కచ్చితత్వంతో బుమ్రా వేసే యార్కర్లకు బ్యాట్స్‌మెన్ వద్ద సమాధానం ఉండదనే విషయం తెలిసిందే.

ఫాస్ట్ బౌలర్ కాదు.. లెగ్ స్పిన్నర్:
భారత్ తరపున అత్యధిక వన్డే, టెస్ట్ వికెట్లు సాధించిన బౌలర్‌గా కొనసాగుతున్న అనిల్ కుంబ్లే.. భారత జట్టు ప్రధాన కోచ్‌గా కూడా వ్యవహరించారు. అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీతో గొడవ కారణంగా కుంబ్లే ఎక్కువ కాలం కోచ్‌గా కొనసాగలేదు. అతని స్థానంలోకి రవిశాస్త్రి వచ్చాడు. గత కొంత కాలంగా భారత జట్టులో కీలక సభ్యుడిగా కొనసాగుతున్నజస్ప్రీత్ బూమ్రా.. వైవిధ్యభరితమైన బౌలింగ్ శైలిని కలిగి ఉంటాడు. అలాంటిది అతను మరొక బౌలర్‌ను అనుకరించడం సరదాగా ఉందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. 'బుమ్రా ఇప్పుడు ఫాస్ట్ బౌలర్ కాదు.. లెగ్ స్పిన్నర్' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మంగళవారం నుంచి సాధన:
సుదీర్ఘ పర్యటనలో భారత్-ఇంగ్లండ్ జట్లు వరుసగా నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఫిబ్రవరి 5 నుంచి ఇరు జట్ల మధ్య చెన్నై వేదికగా మొదటి టెస్టు ఆరంభంకానుంది. 13 నుంచి 17 వరకు చెన్నై వేదికగానే రెండో టెస్ట్ జరగనుంది. మొతేరా స్టేడియంలో చివరి రెండు టెస్టులు జరగనున్నాయి. ఆపై ఐదు టీ20ల సిరీస్ ఇక్కడే జరగనుంది. ఇక పూణేలో మూడు వన్డేల సిరీస్ జరుగుతుంది. ప్రస్తుతం ఇరు జట్ల ఆటగాళ్లు చెన్నైలో క్వారంటైన్‌లో ఉన్నారు. మంగళవారం నుంచి సాధన చేయనున్నారు.
'ఆస్ట్రేలియాపై గెలవాలని కోరుకున్నాం.. ఇప్పుడు టీమిండియాను శత్రువులుగా భావించాల్సి వస్తుంది'
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications