For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నీ బొమ్మ తిరగబడే రోజొచ్చిందిరా ఆజామూ..!!

 PAK vs SA: Babar Azams horror run in T20 World Cup continues, gone for 6 against South Africa

సిడ్నీ: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌ సూపర్ 12లో అట్టర్ ఫ్లాప్ టీమ్ అంటూ ఏదైనా ఉందంటే- అది పాకిస్తానే. ఏ మాత్రం అంచనాలను అందుకోలేకపోతోందా జట్టు. టైటిల్ హాట్ ఫేవరెట్స్‌లల్లో ఒకటిగా ఈ టోర్నమెంట్‌లో అడుగు పెట్టిన బాబర్ ఆజమ్ సేన పరిస్థితి ఇప్పుడు తలకిందులైంది. సెమీ ఫైనల్స్‌కు చేరుకునే అవకాశాలను దాదాపుగా కోల్పోయినట్టే. ఆడే ప్రతీ మ్యాచ్‌ను కూడా గెలవడంతో పాటు నెట్ రన్‌రేట్‌ను కూడా కాపాడుకోవాల్సిన దశలో ఉంది పాకిస్తాన్.

వరుస ఓటములు..

ఈ టోర్నీలో తొలుత భారత్ చేతిలో ఓడింది. టీమిండియా బ్యాటర్లు విరాట్ కోహ్లీ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రదర్శించిన దూకుడు ముందు పాక్ బౌలర్లు వెలవెలబోయారు. ఆ తరువాత జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లోనూ ఫలితం మారలేదు. ఫైనల్ ఓవర్ థ్రిల్లర్‌లో ఒత్తిడికి గురయ్యారు పాకిస్తాన్ బ్యాటర్లు. చివరి బంతికి మూడు పరుగులు చేయాల్సి ఉండగా- రెండుతోనే సరిపెట్టుకున్నారు. ఫలితంగా- ఒక్క పరుగు తేడాతో ఓడాల్సొచ్చింది.

నెదర్లాండ్స్‌తో ఫర్వాలేదనిపించుకుందే గానీ..

నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించుకుంది. తొలుత బౌలింగ్ చేసిన పాకిస్తాన్.. ప్రత్యర్థిని 91 పరుగుల వద్దే కట్టడి చేసింది. అనంతరం నాలుగు వికెట్ల నష్టపోయి లక్ష్యాన్ని అందుకుంది. ఈ మూడు మ్యాచ్‌లల్లో కూడా కామన్ పాయింట్ ఒక్కటే- పాకిస్తాన్ కేప్టెన్ బాబర్ ఆజమ్ ఘోరంగా విఫలం కావడం. మూడింటితో కలిపి అతను చేసిన పరుగులు ఎనిమిదే. భారత్‌పై డకౌట్ కాగా.. జింబాబ్వే, నెదర్లాండ్స్‌పై నాలుగు చొప్పున రన్స్ తీశాడు.

ఫెయిల్యూర్ కంటిన్యూస్..

బాబర్ ఆజమ్ ఘోర వైఫల్యానికి బ్రేక్ పడట్లేదు. కొనసాగుతూనే వస్తోంది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లోనూ భారీ స్కోర్ సాధించలేక చేతులెత్తేశాడు. ఈ మ్యాచ్‌లో అతను చేసింది ఆరు పరుగులే. లుంగి ఎంగిడి బౌలింగ్‌లో మిడ్ వికెట్ మిడాన్ దిశగా భారీ షాట్‌కు ప్రయత్నించి- కగిసొ రబడ చేతికి చిక్కాడు. అద్భుతమైన క్యాచ్ అది. 25 గజాల దూరం వెనుకకు పరుగెత్తుతూ క్యాచ్‌ను అందుకున్నాడు రబడ.

వరస్ట్ బ్యాటింగ్ యావరేజ్..

మొత్తంగా ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌లల్లో బాబర్ ఆజమ్ చేసింది 14 పరుగులే. బ్యాటింగ్ యావరేజ్ 3.5గా రికార్డయింది. వరస్ట్ బ్యాటింగ్ యావరేజ్. నెదర్లాండ్స్ లోయర్ ఆర్డర్ బ్యాటర్ ఫ్రెడ్ క్లాసెన్-3.33, శ్రీలంక బౌలర్-4 బ్యాటింగ్ యావరేజ్‌తో జత కలిశాడు బాబర్. ఈ పరిణామాలు అతని కేప్టెన్సీకే ఎసరు పెట్టేలా మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ టోర్నమెంట్ ముగిసే సమయానికి భారీ ఇన్నింగ్ ఆడకపోతే మాత్రం బాబర్ ఆజమ్ తన కేప్టెన్సీని వదులుకోవాల్సి రావొచ్చు.

అలా జరగడం విరాట్ కోహ్లీ కేరీర్‌లోనే తొలిసారి..!!

Story first published: Thursday, November 3, 2022, 15:20 [IST]
Other articles published on Nov 3, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+