For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అలా జరగడం విరాట్ కోహ్లీ కేరీర్‌లోనే తొలిసారి..!!

IND vs ZIM, T20 World Cup: First time Virat Kohli nominated for the ICC Player of the month award

మెల్‌బోర్న్: టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌లో భారత క్రికెట్ జట్టు తన దూకుడును కొనసాగిస్తూ వస్తోంది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లలో మూడింట్లో ఘన విజయాన్ని సాధించింది. దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. నాలుగు మ్యాచ్‌లు - మూడు విజయాలతో గ్రూప్ 2 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది టీమిండియా. తన తదుపరి మ్యాచ్‌లో జింబాబ్వేను ఢీ కొట్టబోతోంది. మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియంలో ఈ ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటలకు ఆరంభం కానుంది.

ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఇప్పటికే అడిలైడ్ నుంచి మెల్‌బోర్న్‌కు చేరుకుంది. నెట్ ప్రాక్టీస్‌లో తలమునకలైంది. ఈ టోర్నమెంట్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ మీదే అందరి దృష్టీ నిలిచింది. ఇప్పటికే పాకిస్తాన్‌ను ఒంటిచేత్తో ఓడించాడు కింగ్ కోహ్లీ. నెదర్లాండ్స్‌ దక్షిణాఫ్రికాపైనా రాణించాడు. బంగ్లాదేశ్‌పై మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఈ నాలుగు మ్యాచ్‌లల్లో 205 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో- విరాట్ కోహ్లీ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్ కోసం ఎంపికయ్యాడు. ఐసీసీ ఈ అవార్డును ప్రవేశపెట్టిన తరువాత విరాట్ కోహ్లీ నామినేట్ కావడం ఇదే తొలిసారి. ఇదివరకెప్పుడూ అతని పేరును పరిశీలనలోకి తీసుకోలేదు ఐసీసీ. విరాట్ కోహ్లీతో పాటు దక్షిణాఫ్రికా మిడిలార్డర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్, జింబాబ్వే ఆల్ రౌండర్ సికందర్ రజా పేర్లను కూడా నామినేట్ చేసింది ఐసీసీ. ఈ ముగ్గురిలో ఎవరికి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డ్ లభిస్తుందనేది వెయిట్ అండ్ సీ.

అక్టోబర్‌లో భారత్‌తో ఆడిన ద్వైపాక్షిక సిరీస్‌లో డేవిడ్ మిల్లర్ దుమ్ము రేపిన విషయం తెలిసిందే. గువాహటిలో నిర్వహించిన టీ20 ఇంటర్నేషనల్‌లో 79 బంతుల్లో 106 పరుగులు చేశాడు కిల్లర్ మిల్లర్. ప్రపంచకప్‌లో సత్తా చాటుతున్నాడు. ఇక జింబాబ్వే విజయాల్లో ఆ జట్టు ఆల్ రౌండర్ సికందర్ రజా కీలక పాత్ర పోషిస్తోన్నాడు. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ గ్రూప్ దశతో పాటు సూపర్ 12లో రాణిస్తోన్నాడు.

సూపర్ 12లో బ్యాటర్‌గా విఫలమైన్పటికీ.. బౌలర్‌గా వరుసగా వికెట్లను పడగొడుతున్నాడు. ఆగస్టులోనూ అతను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్ అందుకున్నాడు. వారి పెర్ఫార్మెన్స్‌ను ఆధారంగా చేసుకుని ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కోసం నామినేట్ చేసింది ఐసీసీ. త్వరలోనే అవార్డును ప్రకటించనుంది.

Story first published: Thursday, November 3, 2022, 14:27 [IST]
Other articles published on Nov 3, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+