For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

PAK vs NZ:హ్యారీస్ రౌఫ్ ఇన్.. రచిన్ రవీంద్ర డౌట్! ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ ఆడే తుది జట్లు ఇవే!

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి రంగం సిద్దమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో పాకిస్థాన్ ఈ మినీ ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇస్తుండగా.. మరికొద్ది గంటల్లో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. కరాచీ వేదికగా నేడు(బుధవారం) జరిగే తొలి మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్థాన్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. పాక్ గడ్డపై ముక్కోణపు సిరీస్ గెలిచి న్యూజిలాండ్ మంచి జోష్‌లో ఉంది. ఈ సిరీస్‌లో పాకిస్థాన్‌తో రెండు సార్లు తలపడిన కివీస్ రెండింటికి రెండు మ్యాచ్‌లు గెలిచింది.

అదే జోరులో ఛాంపియన్స్ ట్రోఫీ 2025లోనూ పాక్‌ను ఓడించి శుభారంభం చేయాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు ముక్కోణపు సిరీస్ వైఫల్యంతో తమ తప్పిదాలపై ఫోకస్ పెట్టిన పాకిస్థాన్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. దాదాపు 29 ఏళ్ల తర్వాత ఐసీసీ టోర్నీకి తమ దేశం ఆతిథ్యం ఇస్తుండటంతో ఎలాగైన శుభారంభం చేయాలని పాకిస్థాన్ భావిస్తోంది.

PAK vs NZ Playing XIs For Champions Trophy 2025 Opener Haris Rauf In and Rachin Ravindra Doubt

హ్యారీస్ రౌఫ్ రీఎంట్రీ..
గాయంతో ముక్కోణపు సిరీస్‌కు దూరంగా ఉన్న హ్యారీస్ రౌఫ్ జట్టులోకి రావడం పాకిస్థాన్‌కు కలిసొచ్చే అంశం. ఇప్పటికే నెట్స్‌లో ముమ్మరంగా బౌలింగ్ చేసిన అతను తొలి మ్యాచ్‌ ఆడనున్నాడు. పాకిస్థాన్ ముగ్గురు పేసర్లతో పాటు ఇద్దరు స్పిన్నర్ల కాంబినేషన్‌తో బరిలోకి దిగనుంది. ఓపెనర్లుగా ఫకార్ జమాన్, బాబర్ ఆజామ్ ఆడనుండగా.. సౌద్ షకీల్, మహమ్మద్ రిజ్వాన్, సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్ మిడిలార్డర్‌లో ఆడనున్నారు.

స్పిన్ ఆల్‌రౌండర్ కుష్దిల్ షా ఆడనుండగా.. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా అబ్రర్ అహ్మద్ బరిలోకి దిగనున్నాడు. షాహిన్ షా అఫ్రిది, నసీమ్ షా, హ్యారీస్ రౌఫ్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు. అబ్రర్ అహ్మద్‌, కుష్దిల్ షాలకు తోడుగా అబ్రర్ అహ్మద్ కూడా బౌలింగ్ చేయనున్నాడు.

రచిన్ రవీంద్ర డౌట్..
మరోవైపు న్యూజిలాండ్‌ను గాయాల బెడద వెంటాడుతోంది. గాయంతో లాకీ ఫెర్గూసన్ ఈ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతని స్థాన్ కైల్ జెమిసన్ జట్టులోకి వచ్చాడు. నుదటి గాయం కారణంగా ముక్కోణపు సిరీస్‌కు దూరంగా ఉన్న రచిన్ రవీంద్ర రీఎంట్రీ ఇచ్చాడు. కానీ అతను తొలి మ్యాచ్ ఆడే విషయంపై సందేహాలు నెలకొన్నాయి. ఒకవేళ అతను ఫిట్‌గా లేకుంటే విల్ యంగ్ ఆడుతాడు.

తుది జట్లు(అంచనా):
పాకిస్థాన్: ఫకార్ జమాన్, బాబర్ ఆజామ్, సౌద్ షకీల్, మహమ్మద్ రిజ్వాన్, సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, కుష్దిల్ షా, షాహిన్ షా అఫ్రిది, నసీమ్ షా, హ్యారీస్ రౌఫ్, అబ్రర్ అహ్మద్.

న్యూజిలాండ్: రచిన్ రవీంద్ర/విల్ యంగ్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్, గ్లేన్ ఫిలిప్స్, మైకేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్, మ్యాట్ హెన్రీ, జాకోబ్ డఫ్ఫీ, విల్ ఓ రూర్కీ.

Story first published: Wednesday, February 19, 2025, 10:15 [IST]
Other articles published on Feb 19, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+