PAK vs NZ: 8 ఏళ్ల తర్వాత సర్ఫరాజ్ సెంచరీ.. బతికిపోయిన పాకిస్థాన్!

కరాచీ: పాకిస్థాన్-న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండు టెస్ట్‌ల సిరీస్ ఫలితం తేలకుండా ముగిసింది. శుక్రవారం ముగిసిన రెండో టెస్ట్‌లో పాకిస్థాన్ ఓటమి తప్పించుకుంది. ఆఖరి క్షణం వరకు ఇరు జట్లను ఊరించిన విజయం.. చివరకు ఊసురుమనిపించింది. 8 ఏళ్ల తర్వాత సెంచరీ నమోదు చేసిన పాకిస్థాన్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ సర్ఫరాజ్ అహ్మద్.. పాకిస్థాన్‌కు ఓటమి తప్పించాడు. టెయిలెండర్ల సాయంతో ఆఖరి వరకు పోరాడిన సర్ఫరాజ్.. జట్టును విజయం దిశగా తీసుకెళ్లాడు. కానీ లక్ష్యానికి 22 పరుగుల దూరంలో 9వ వికెట్‌గా అతను పెవిలియన్ చేరడం పాకిస్థాన్ ఓటమి కొరల్లో చిక్కుకుంది. అయితే నసీమ్ షా(15 నాటౌట్), అబ్రర్ అహ్మద్(7 నాటౌట్)లు పోరాడగా.. బ్యాడ్ లైట్‌తో అంపైర్లు మరో మూడు ఓవర్ల ఆట మిగిలి ఉండగానే ఆటను నిలిపేసారు. దాంతో పాక్ ఓటమి తప్పించుకుంది.
319 పరుగుల లక్ష్యంలో భాగంగా 0/2 ఓవర్ నైట్‌స్కోర్‌తో చివరి రోజు ఆటను ప్రారంభించిన పాకిస్థాన్.. ఆట ముగిసే సమయానికి 9 వికెట్లకు 304 పరుగులు చేసి విజయానికి 15 పరుగుల దూరంలో నిలిచిపోయింది. సర్ఫరాజ్ అహ్మద్(176 బంతుల్లో9 ఫోర్లు, సిక్స్‌తో 118) ఒక్కడే సెంచరీతో రాణించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మైకేల్ బ్రేస్‌వెల్ నాలుగు వికెట్లు తీయగా.. ఇష్ సోది, టీమ్ సౌథీ రెండేసి వికెట్లు పడగొట్టారు. మ్యాట్ హెన్రీ ఓ వికెట్ తీసాడు.
ఓ దశలో 80 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగిన పాకిస్థాన్‌ను సౌద్ షకీల్‌తో కలిసి సర్ఫరాజ్ ఆదుకున్నాడు. షకీల్‌తో 6వ వికెట్‌కు 123 పరుగులు జోడించిన సర్ఫరాజ్.. ఆఘా సల్మాన్(30)తో ఏడో వికెట్‌కు 70 పరుగులు జోడించాడు. ఈ క్రమంలోనే సెంచరీ పూర్తి చేసుకున్న సర్ఫరాజ్.. 9 ఏళ్ల తర్వాత ఈ ఫీట్ సాధించాడు. దాంతో భావోద్వేగానికి గురయ్యాడు. ఈ మ్యాచ్‌కు హాజరైన అతని తల్లిదండ్రులు సైతం సర్ఫరాజ్ సెంచరీతో ఏమోషనల్ అయ్యారు. బ్రేస్ వెల్ సూపర్ డెలివరీతో సర్ఫరాజ్‌ను క్యాచ్ ఔట్ చేయడంతో పాకిస్థాన్ విజయవకాశాలు దెబ్బతిన్నాయి.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 449 పరుగులు చేసింది. పాకిస్థాన్ 408 పరుగులకే ఆలౌట్ అయింది. 41 పరుగుల తొలి ఆధిక్యం కలుపుకుని కివీస్ రెండో ఇన్నింగ్స్ లో 277 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఫలితంగా పాకిస్తాన్ ఎదుట 319 పరుగుల విజయలక్ష్యాన్ని నిలిపింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications